నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

హలో ! ఘుమఘుమల గాయత్రిగారేనా మాట్లాడేది ?”

 

అవునండి నేనే గాయత్రిని మాట్లాడుతున్నా మీరెవరు?”

 

 

నేను ఎదో టీవీ నుండి మాట్లాడుతున్నాను . మీరు వంటలపోటీలో గెలిచారని తెలుసుకుని మీ ఇంటర్వ్యూను మా ఎదో టీవీలో ప్రసారం చేయాలనుకుంటున్నామండి. ఎప్పుడు రమ్మంటారు?”

 

ఓహ్!   చాల సంతోషమండి .  ఎప్పుడైనా రావొచ్చు . అంతకంటేనా. ప్లీజ్ నాలుగురోజుల తరవాత రండి . నేను బ్యాంకు నుండి నగలు తెచ్చుకోవాలి, కొత్త చీర కొనుక్కోవాలి , నా ఫ్రెండ్స్‌ని కూడ రమ్మని పిలుస్తా. సరేనా ?”

 

యస్! మీ ఇష్టం . వచ్చే సోమవారం మద్యహ్నం రెండుగంటలకు వస్తాము మరి .”

 

సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు గాయత్రిగారి ఇంటికొచ్చారు ఎదో టీవీ యాంకరు కల్పనారాయ్ , కెమేరామెన్,  టెక్నిషియన్లు.

 

ఇప్పుడు మనం ఘుమఘుమల గాయత్రి గారి ఇంటిముందు ఉన్నాంఅంటూ కొద్దిగా తీసి ఉన్న తలుపు మీదే తట్టింది పక్కనే బెల్ ఉన్నా కూడా . 

 

వాళ్ళాయన్ని పోరుపెట్టి పదివేలు పెట్టి కొన్న పట్టు చీర కట్టుకుని చంద్రహారం, నెక్లేసు , గాజులు అనీ వేసుకుని తయారై ఉన్న గాయత్రి తలుపు తీసింది .

 

హల్లో! గాయత్రిగారు బావున్నారా! మేము ఎదో టీవీ నుండి వచ్చాము. ఓహ్ ! మీ ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారే ?(అందరూ పెళ్ళి కొచ్చినట్టు తయారై వచ్చారు)

 

గాయత్రిగారు ముందుగా మీకు అభినందనలు. ప్రైజ్ గెలుచుకున్నందుకుపూలబోకే ఇచ్చి  షేక్‌హ్యాండ్  ఇచ్చింది కల్పనారాయ్.

 

మీరు పోటీకి పంపిన వంటకం మాకు చేసి చూపిస్తారా?”

 

యస్ తప్పకుండా! రండిఅంటూ పక్కనే హాలులోనే గ్యాస్ స్టవ్, దినుసులు, అంతకుముందు రోజే కొన్న కొత్త నాన్స్టిక్ గిన్నెలు సర్ది ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసికెళ్ళింది . లోగా కెమేరామెన్, టెక్నిషియన్లు లైట్లూ అవీ సర్దుకున్నారు. గాయత్రి ,  కల్పనారాయ్ టేబుల్ ముందు నిలబడితే మిగతావాళ్ళు కాస్త  దూరంగా నిలబడ్డారు నవ్వుమొహంతో. ( లోలోపల కుళ్ళుకుంటున్నా).

 

గాయత్రిగారు, మీ వంటకం పేరు చెప్తారా?”

 

వంటకం పేరు ఓల్డ్ గోల్డ్ పాయసం‘. మీరు వస్తానని చెప్పిన వెంటనే చేసి ఫ్రిజ్‌లో పెట్టా . ఇలా తయారై వంట చేసి చూపెడితే నా చీర పాడైపోతుంది, మొహం జిడ్డుగా అవుతుంది. కెమెరా ముందు బాగోదు కదా.అందుకే ఊరికే చేసినట్టు నటిస్తా.ఒకేనా!”.

 

అలాగే నో ప్రాబ్లం. ముందుగా ఏయే పదార్థాలు కావాలో చెప్తారా ? అవును ఓల్ద్ గోల్డ్ పాయసం ఏంటండి వెరైటీగా ఉంది. 

 

ఇందులో అన్ని నిలవ ఉంచిన పదార్థాలే వాడతాం కాబట్టి పేరు పెట్టా నేనే

 

ఎహె! సోదంతా ఆపి వంట మొదలెట్టండి . అసలే అరగంట ప్రోగ్రామ్. పదినిమిషాల ప్రకటనలు. పదినిమిషాల మీ సొల్లు కబుర్లు. అసలు కార్యక్రమం ఎంత సేపుంటుంది.” అని గొణుక్కున్నాడు కెమేరామెన్.    

 

 

మనకు కావలసిన పదార్థాలు.. నాలుగు రోజుల క్రిందట ఉడికించి పెట్టుకున్న ఐదు బంగాళ దుంపలు“.

 

దుంపలు తొక్క తీయాలా అలాగే ఉంచాలా, ముక్కలు చేసి ఉడికించాలా, ఉడికించి ముక్కలు చేయాలా?” అడ్డుకుంది కల్పనారాయ్.

 

ఉండవమ్మా! మొదలెట్టానో లేదో ఇన్ని ప్రశ్నలేస్తున్నావు. మా ఆయనే ఇంతలా ప్రశ్నలేయడు.” అంది గాయత్రి.

 

సరే చెప్పండి

 

కూరగాయల తొక్కలలో విటమిన్లు ఉంటాయి. అది అలాగే ఉంచాలి. ఇంకా రెండు రోజుల క్రింద బాగా కాచి మాడిన పాలు లీటరు . ఇది ఫ్రిజ్‌లో పెట్టొద్దు. బయటే ఉండాలి“.

 

అయ్యో! బయట పెడితే పాలు కంపుగొట్టవూ. అదీ రెండు రోజులు . పాలు తప్పనిసరిగా మాడినవే ఉండాలా ?”.

 

నేను ముందే చెప్పాగా! ఓల్డ్ గోల్డ్ పాయసం అని. తాజా పదార్థాలు కాకుండా అన్నీ నిలువ ఉంచినవే వాడాలి. మాడిన పాలైతే అదో రకం వాసన, రుచి ఉంటాయి.  పెరట్లో మొలిచిన గడ్డి , రంగు రంగు క్రోటన్ ఆకులు కావాలి .”

 

అవి కూడా ఇందులో వేస్తారా ?”

 

లేదండి! అవి అలంకరణకు మాత్రమే“.

 

సరే! ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా ?”.

 

ఇది చాలా త్వరగా తయరయ్యే వంటకం. ఉడికించిన బంగాళదుంపలు, మాడిన పాలు కలిపి మిక్సీలో వేసి కొద్దిగా తిప్పాలి . తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లచల్లగా తినాలి“.

 

అయ్యో! ఇంత త్వరగా ఐపోయిందా . మరి ఇందులో రుచికి ఉప్పుకాని , పంచదార కాని వేయలేదేమి?”

 

అబ్బే! ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం. అయినా రోజుల్లో ఎక్కువగా బిపి , షుగర్ అంటున్నారు . ఏది తినాలో ఏది తినొద్దో తెలీకుండా ఉంది . అందుకే అందరూ హాయిగా తినగలిగే వంటకం చేసా . బిపి వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు . షుగర్ ఉన్నవాళ్ళు ఉప్పేసుకోవచ్చు అన్నమాట.”.

 

అబ్బా! ఘుమఘుమలు అదిరిపోతున్నాయి. నా నోరూరుతుంది. రుచి చూసేస్తా. అబ్బ ఎంత రుచిగా ….” దడాల్న అక్కడే ఉన్న సోఫాపై పడిపోయింది కల్పనారాయ్.

 

అయ్యయ్యో! అది మీరు తినడానికి కాదండి. మీ ఆత్రం తగలడిపోను . ఇంటికొచ్చిన చుట్టాలను తరిమేయడానికి నేను చేసే పాయసం ఎవడు తినమన్నాడు. ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి అడ్డమైన కొత్త వంటలన్నీ రుచి చూసి చూసి ఐశ్వర్యా రాయ్‌లా ఉండేది కల్పనా రాయ్‌లా తయారై గుమ్మం పట్టకుండా తయారైంది . ” అని విసుక్కుంది గాయత్రి.

 

యాంకరమ్మని కష్టం మీద లేపి సామానంతా సర్దుకుని వెళ్ళిపోయారు ఎదో టివి కెమేరామెన్లు, టెక్నిషియన్లు.

ఈ మధ్య అన్నీ టివి చానెళ్ళలో వస్తున్న వంటల ప్రోగ్రాములు చూసి రాసాను సరదాగా

ప్రకటనలు

Comments on: "ఇంటా – వంటా – తంటా – పెంట" (5)

 1. chAlA saradAgA umdi ;-))

 2. ¥½õ§¶¿ ©·ë¬¹þ¶ £¸ì¶¿ ·¦¶õœºë ©¶Ï™ºþ¶ ©¶Ï˜¨¿ ¨¸· ©¶Àþ·ä¦õ
  ú·¨¸ ˜È¬øÛ · ©¶Àφº ¥½õ £¸ì’Í(™¶¿)¶¿’.
  ¡µëœº ©º«µ¦¶õύ¶Á™· ¬µºà¶§¶Ï· œÆ§¶(£¸ì¶¿)¶¿ ‡ºÑÏú·§¶¿.
  ‚ύ· ¡µë¦¶õœºäÏú»Ïú»œÈ ±Ë˜Û úƍ¶Ñ¨¦Èõ꨸ ©¶ÀϘ¿Ï†º
  ¥½õ ¡Ç§¶¿¨Îþº ©Æ¨¿¶¿þ¶¿ ú¶†º©È £¸ìÍ¶¿¨Ï†¶§¶¿¶¿ ¡µÏú»þ¶Ï†¶¿¶¿ ¬µÏœÍ«µ¥¶õ¿.

  ¥¶õ§¶¨¸¶¨¿†·âÏ. üÍꜺ….

  ** ** ADITYA ** **

 3. oh..ayite twaraloa miiru tv loa kanipistaaranna maaTa.

 4. గొప్పగా నవ్వొచ్చింది మీ వ్యాసం చదివాక. ఇప్పుడు నిజంగా టీవీలలో జరిగే ఘుమఘుమల ప్రోగ్రాములన్నీ ఇలానే ఉంటున్నాయి. చదువుతుంటే ప్రతి సీనూ కళ్ళకి కట్టినట్లు గా కనిపించింది.

 5. వింజమూరి విజయకుమార్ said:

  నిజమే. ఎవరో యాంకర్ నిజంగా మీ యింటికొస్తే మాత్రం తప్పేముంది. ఆ వంటకాల కన్నా బహుమతి పొందిన వంటకం జనాలకి చూపిస్తే మంచిదేగా. కాకపోతే, మీరు నిలవవుంచిన పదార్ధాలతో వాళ్ళకి వంట చూపించకండే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: