నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

యమదొంగ

                        yama.jpg

కొత్త సీసాలో పాత మందులా అలనాటి ఎన్.టి.ఆర్ సూపర్ డూపర్ హిట్ “యమగోల” సినిమా ఆధారంగా వచ్చిన జూ.ఎన్.టి.ఆర్ “యమదొంగ” హిట్ అంటున్నారు. చిక్కినా చక్కదనమే అన్నట్టు ఎన్.టి.ఆర్ ఇంకా గ్లామరస్‌గా కనిపిస్తున్నాడు. పాత కొత్త సుందరాంగులతో సయ్యాటలాడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కొత్త సినిమా టాక్ అంటే కాలేజీ పిల్లలే చెప్పాలి. అందుకే మా పిల్లలను అడుగుతా ఎలా ఉంది అని. వాళ్ళు అన్నీ చూడకున్నా వాళ్ళ స్నేహితులనుండి తెలుస్తుంది సినిమా వచ్చిన రోజో మరునాడో. నీట్ కామెడీ, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్, యమలోకం సెట్టింగ్స్, ముఖ్యంగా మోహన్‌బాబు డైలాగ్స్ అదుర్స్. యముడు, హీరో తగూలాటలు, మాటల యుద్ధాలు, యమలోకంలో హీరో చేసే అల్లరి అందరిని ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ కూడా ఓకే.హిట్ అంటున్నారు. సినిమా రాకముందే మా పిల్లలు నన్నడుగుతారు. ఇది హిట్టా ఫట్టా అని. సినిమా స్టోరీ, మ్యూజిక్ వినగానే చెప్పేస్తా. అది కరెక్ట్ అవుతుంది  కూడా. అలాగే యమదొంగ విషయంలో కూడా స్టోరి  బానే ఉంటుంది. కామెడి బాగుంటేనే హిట్ అవుతుందని చెప్పా. పాత హీరోయిన్ రంభ ఒక హిట్ పాటలో ఎన్.టి.ఆర్ తో పోటీ పడి నాట్యం చేసింది. తన వయసు ఎక్కువని అస్సలు తెలీలేదు. అందరూ హీరోయిన్లు ముద్దుగా ఉన్నారు.

ఇక సినిమా విషయానికొస్తే…

నటీనటులు:
జూ.ఎన్.టి.ఆర్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రియమణి,మమతా మోహన్‌దాస్, ఆలీ,మొదలగువారు.
దర్శకుడు.. రాజమౌళి

హీరో ఒక ఆరితేరిన దొంగ. కోట్లకు వారసురాలైనా హీరోయిన్ (ప్రియమణి)ని ఆమె ఆస్థి కోసం ప్రేమిస్తాడు. కాని ఆమె  బంధువుల వల్ల జరిగిన ఘర్షణలో చనిపోతాడు. అక్కడినుండి యమలోకానికి వెళ్ళి నానా అల్లరి చేస్తాడు. అప్సరసలతో ఆటలు,పాటలు. ఇలా యముడు, హీరో దాగుడుమూతలు.. వెరసి సినిమా మంచి కామెడి …
చూడడంలో ప్రమాదం ఎమీ లేదు. 

ప్రకటనలు

Comments on: "యమదొంగ" (10)

 1. jyothi garu cinima reviews kuda rastunnara

 2. మీరన్నట్టు భహుశా ఇది యువతరం సినిమానే,రాజమౌళి మెదటి నుండీ పాతసీసాలనే నమ్ముకున్నాడు.అలాగే హిట్లు కొడుతున్నాడు. పెద్ద వయసు వారికి కొంచెం ఇబ్బంది కలిగించే సన్నివేశాలు ఉండవచ్హు కాని ఇప్పుడు హిట్టు కావాలంటే ఆమాత్రం తప్పదు.

 3. తెలుగుఅభిమాని said:

  అక్కియ్యా! ఇంతకీ మీరు ఈ బొమ్మ చూశారా లేదా అర్థం కాలా.

 4. Yama donga movie is like old wine in new bottle, as you said this is right, rajamouli direction superb, NTR dances,acting is very good these are the assets. and the negative points is misusing of mamata mohandas fame and irrelated comedy, i think rajamouli increases the comedy part it will be helpful for movie. However movies is good you can watch with your family also.

 5. nenu sinima 4 sarlu chusaa,1st day 1time,sunday 2times, monday 1 time, sinima chaalaa bavundi yamudu getup lo jr Ntr keka dance baaga chesadu,mohan babu dialogues super,
  sinimanae oka pedda keka meeru collection chusinattu laeru?
  dadusukuntaru.

  ikkada konni karanalaritya na paeru(pedda donga),e-mail tappuga ichaa.

  ADVICE: inka nunchi cinima chusi wakya lu raayandi evado cheppadu animatram cheppakandi?

 6. పోయిన వారం అన్నయ్య లండన్ వెళ్ళే ముందు సరదాగా మదనపల్లెలో ఇద్దరం కలసి చూశాం ఈ సినిమాను. అసలే చిరంజీవి అభిమానులం, డ్యాన్సులు బాగా నచ్చుతాయి. ఇక చూసుకోండి…..పండగే పండగ. NTR డ్యాన్సులు ఇరగదీశాడు. మాటల్లో వ్రాయలేను కానీ మాకైతే లేచి డ్యాన్సేద్దామా అన్నంత ఊపు వచ్చింది (నాచోరే..నాచో పాట). ఎన్నో సన్నివేశాలకు ప్రేక్షకులు చాలా బాగా స్పందించారు. విరామం ముందు…NTR మానవుడు యముడికన్నా ఏమీ తీసిపోలేదంటూ దానవీరశూరకర్ణలో లాగా పెద్ద డైలాగు చెప్పినప్పుడు ప్రేక్షకులు పెద్దగా ఈలలు వేసి తమ ఆనందం ప్రకటించారు. అప్పుడు అనిపించింది..తెలుగునాట పౌరాణికాలకు ఇంకా ఆదరణ ఉందని (దర్శకనిర్మాతలు వింటున్నారా!!!). ‘యంగ్ యమ యంగ్ యమ’ పాటలో మరియు దానికి ముందు సన్నివేశంలో Sr. NTR వచ్చినప్పుడైతే థియేటర్లో భూకంపమే వచ్చింది. అసలే రామారావుకు రాయలసీమలో ఫాలోయింగు యెక్కువ. నా వరకు రామారావును మళ్ళీ సినిమాలో చూడాటానికైనా ఈ సినిమాను తాప్పక చూడాలి అనిపించింది. నేను పెట్టిన డబులకు మళ్ళీ నటసార్వభౌముడిని రెండు నిముషాల పాటు ధియేటర్లో చూడగలిగాను …అది చాలు. మనిషి పోయి పది సంవత్సరాలైనా ….తెలుగోడి గుండెల్లో అభిమానం ఆలాగే బ్రతికి ఉంది. ప్రతి పాట అదుర్సే…..ముఖ్యంగా యమలోకాన్ని చాలా బాగా చూపెట్టాడు.
  కానీ ఆశ్చర్యంగా మొదటి భాగం బాగోలేదు, రెండో భాగం సాగదీశాడు, యమలోకం సీన్లు బాగాలేవంట లాంటి సన్నాయి నొక్కులు వినిపించాయి….మొత్తం మీద సినిమా నాకైతే బోరు కొట్టలేదు (సామాన్యం మనకు అంత త్వరగా తలనొప్పి రాదులెండి 🙂 ).

 7. యమ దొంగని చూడాలన్న నా కోరికని యమ యమగా పెంచేశారు. క్యూలో కొట్టుకోకుండా టిక్కెట్లు ఎప్పుడు దొరుకుతాయో…

  ఈజీ మూవీస్ ప్రయత్నించాలి

 8. అయ్యా! పెద్ద దొంగగారు, మీరు పేరు మార్చి ఎందుకు రాసారో గాని. నా అభిప్రాయం నేను చెప్పా. అది తప్పా. మీరు ఎన్ని సార్లన్నా చూడండి ఎవరొద్దన్నారు.బావుంది .ఒకే…

  మీ advice మాత్రం నేను పాటించబోవడం లేదు. సినిమా గురించి రాయాలంటే దానిని థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన పనిలేదు. …

 9. జ్యోతి గార్కి నమస్కారములు. నా పేరు సుధాకర రెడ్డి. నా దర్శకత్వంలో జెమినిలో “నీలోసగం” టైటిల్ తో ఒక సీరియల్ రాబోతోంది. నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఒక వెబ్ సైట్ http://www.neelosagam.com కూడా డిజైన్ చేసాను సీరియల్ గురించి చెబుతూ. మీ సూటి మనస్తత్వం నాకు బాగా నచ్చింది. సైట్ పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. విధేయుడు ……సుధాకర రెడ్డి. జ్యోతి గారూ! మరీ ఘాటుగా విమర్శించకండి సుమా, మా దర్శకుల మనసు చాలా సున్నితమైనది.

 10. […] యమదొంగ సినిమా గ?రించి జ?యోతి గార? తన అభిప?రాయాన?ని తెలియచేస?త?న?నార? నీట? కామెడీ, […]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: