నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

flowers.gif వరూధినిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా బ్లాగ్లోకానికి రావాలని కోరుతూ…….

birthday_cake2.jpg

ప్రకటనలు

Comments on: "సిరిసిరిమువ్వగారికి శుభాకాంక్షలు…" (17)

 1. వరూధినిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నొ చేసుకొవాలి.

 2. జ్యోతి గారు
  ధన్యవాదములు. ఏదో మాటల మద్య చెప్పింది చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. రోజూ ఎదురుగా తిరిగే చదువరి గారికే ఈ రోజు నా పుట్టిన రోజు అని గుర్తు లేదు. అయినా ఈ పుట్టిన రోజులు అవీ చేసుకునే అలవాటు ఎప్పుడూ లేదు లేండి.

 3. జన్మదిన శుభాకాంక్షలు. చదువరిగారికి గుర్తుంటే ఆశ్చర్య పోవాలి. ఇది మగ వాళ్ళందరినీ పీడించే సమస్యనుకుంటా. ఒక జోకుంది దీనిమీద. మొగుడికి పెళ్ళాం పుట్టినరోజైనా, తమ పెళ్ళిరోజైనా జీవితాంతం గుర్తుండాలంటే మార్గం ఏంటి? ఒక్క సారి మర్చి పోవడం. ఇది ఖచ్చితంగా పని చేస్తుందని స్టాంపు పేపరు మీద రాసిస్తా. స్వానుభవం. :)))

 4. వరూధిని గారికి సభాముఖంగా నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.
  జ్యోతి గారూ, చాలా థాంక్సండి.

 5. సత్యసాయి గారూ, మీకు చాలా థాంక్సు చెప్పాలి. మగాళ్ళంతా ఇంతే అని చెప్పి నా తప్పు తీవ్రతను బాగా తగ్గించారు.

 6. janmadhina shubhakaanshalu

 7. జ్యోతి గారూ నా పుట్టిన రోజుని బ్లాగుకి ఎక్కించి మరీ చదువరి గారికి గుర్తు చేసారండి.

  విహారి గారు థాంక్స్ అండి. మీ బ్లాగు ఈ మద్యే చూసాను. బాగుంటుంది. మీరు అరకు విశేషాల గురించి బాగా రాసారు. మునుముందు ఇలాగే మంచి మంచి విషయాలతో మీ నుండి బ్లాగులు రావాలని అశిస్తున్నాను. అరకు మేము వెళ్ళాము కాని మీరు చెప్పినవన్నీ చూడలేదు, అక్కడ సరైన వసతులు గానీ, సమాచారం అందించేవాళ్ళు కానీ కనిపించలేదు. ఎప్పుడో 10-11 సంవత్సరాల క్రితం లేండి. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయేమో తెలియదు. ప్రయాణం మాత్రం చాలా ఆహ్లాదంగా వుంది.

  ఆచార్యుల వారికి ధన్యవాదాలు. ఒక్క సారేంటండి బాబూ, గత 18 సంవత్సరాలుగా (పెళ్ళైన మొదటి సంవత్సరం కూడా) జరుగుతుంది అదే. సాయంత్రం ఇంటికి వచ్చాక మా పిల్లలు గుర్తు చేయటం, ఈయన నాలుక కరుచుకోవటం పరిపాటే. ఈ సారి జ్యోతి గారి పుణ్యమా అని కాస్త ముందు మేలుకున్నారు అంతే.

  సంతోష్ గారు ధన్యవాదములు.

 8. ఇది అందరు ఆడవాళ్ళ సమస్య.. వరూధినిగారు.

  సత్యసాయిగారు, మీరు చెప్పిన ఒక్క పాయింట్ మాత్రమే కరెక్ట్ అండి.

  రెండోది మాత్రం. అస్సలు పని చేయదు…మర్చిపోయి ఎంత గొడవ జరిగినా మళ్ళి మామూలే…దీనిగురించి మా ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. ఇప్పుడొద్దు కాని త్వరలో పెద్ద టపా రాయాలని నిశ్చయించుకున్నా. దాని వల్ల ఒరిగేదేమీ లేదని తెలిసినా…

 9. వామ్మో..కెవ్వు జ్యోతీ బాగా గుర్తు చేశావు (చాలా థాంకులు)
  వరూధిని గారికి జన్మదిన శుభాకాంక్షలు..

 10. వరూధిని గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని పుట్టిన రోజులు మీరిలాగే జరుపుకోవాలని ఆకాంక్షుస్తూ. (ఇలాగే లో మీ అనారోగ్యపు రోజులు మైనస్ చేసుకోండి)

  మగ వారి పరువు నిలబెట్టిన చదువరి గారికి జేజేలు. మరిచిపోవడం పురుష లక్షణం. అది అక్షరాలా నిరూపించారు. మీరిలాగే మరింత ఎత్తుకు ఎదగాలి.

  అదేంటో గుర్తు పెట్టుకుందామని సర్టిఫికేట్లో వున్న రోజు చూసి చెబ్తే ఆ రోజు వచ్చే అనుభవమే వేరు. ఎందుకంటే సర్టిఫికేట్లో ఒకటుంటుంది అసలుది ఇంకో రోజు వుంటుంది.

  — విహారి

 11. వరూధిని గారికి శుభాకాంక్షలు.

  గురువు గారూ, జాగ్రత్త! మీ ఆవిడ ఈ బ్లాగులు చూస్తుందేమొ!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 12. వరూధిని గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో బ్లాగ్విందు చేయండి.

  చదువరి గారూ…మనలో మాట…నేను ఎప్పుడూ మా ఆవిడ పుట్టిన రోజు మర్చిపోలేదండి , ఎందుకంటే అదే రోజు మా అమ్మాయి పుట్టిన రోజు. 🙂

  అభివందనలతో..

  -నేనుసైతం

 13. వరూధిని గారికి జన్మదిన శుభాకాంక్షలు! పెళ్లి కాకమునుపు బ్రహ్మాండంగా చేసాను నా కాబోయే శ్రీమతి పుట్టినరోజు…పెళ్లయ్యాక ఓ మూడేళ్లు షరా మామూలే! కానీ ఆ తర్వాత ఎప్పటికీ మరచిపోలేను…ఎందుకంటే ఆ రోజు 9/11!

 14. వరూధిని గారికి శుభాకాంక్షలు. చదువరి గారూ చాలా తెలివయిన పని చేసారు.బ్లాగ్ముఖం గా శుభాకాంక్షలందించి ఎక్కువ మార్కులు కొట్టేసారు.

 15. పుట్టినరోజు శుభాకాంక్షలు.

 16. వరూధినిగారికి హార్దిక శుభాకాంక్షలు.
  ఈ సందర్భంలో ఆరుద్ర రాసిన ఒక కూనలమ్మ పదం:
  భార్య పుట్టినరోజు
  భర్త మరచిన రోజు
  తగ్గెననుకొ మోజు
  ఓ కూనలమ్మ!

  లోగడ ఆరుద్ర కూనలమ్మ పదాలు బాపు బొమ్మలతో పుస్తకంగా వచ్చాయి. ఆ పుస్తకం ఇప్పుడు దొరుకుతోందోలేదో తెలీదు. కానీ, పై పద్యాన్ని బొమ్మ లేకుండా చదవడం పెరుగు లేని ఆవడ తిన్నట్టే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: