నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అందరికీ ధన్యవాదములు…

                  namaste1.jpg

నేను మొదటి సారి రాసిన వ్యాసం అందరికీ నచ్చినందుకు , నన్ను అభినందించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.

నేను వెయ్యి టపాలు పూర్తి చేసి విక్షనరీ, తెవికీ పనులు చేసుకుందాము హాయిగా అనుకుని బ్రేక్ తీసుకున్నా. కాని అనుకోకుండా నల్లమోతు శ్రీధర్ గారు మన బ్లాగు గుంపులోకి రావడం,ఆయనని బ్లాగు మొదలెట్టమనడం జరిగింది. మామూలుగా నేను వికీ పని చేసుకుంటూ ఉండగా, ఒక రోజు శ్రీధర్ గారు ఏమనుకున్నారో ఏమో తను రాయాలనుకున్న బ్లాగుల గురించి వ్యాసం నన్ను రాయండి అని అడిగారు. ముందు నేను షాక్ అయ్యా. వీవెన్,త్రివిక్రం,నాగరాజుగారు, ప్రసాద్‌ని అడిగా ఇది సంగతి ఏం చేయను అని. వాళ్ళకు నామీద నాకంటే ఎక్కువ నమ్మకముంది. మీరు చేయగలరు ..మొదలెట్టండి అన్నారు. సరే. కంప్యూటర్ ఎరా పత్రిక చదివేది అందరూ కంప్యూటర్ ఉన్నవాళ్ళే, తెలుగు వచ్చినవాళ్ళే. మన బ్లాగులు, వికీ గురించి తెలియాలంటే, రాయలంటే తప్పనిసరిగా కంప్యూటర్ ఉండాల్సిందే. ఇది మంచి అవకాశం వదలకూడదు అని నిర్ణయించుకుని కొందరు బ్లాగర్లు ఇచ్చిన లింకులను సేకరించడం మొదలెట్టా.

అన్ని లింకులనుండి సమాచారాన్ని ముందుగా ప్రింట్ చేసి పెట్టుకున్నా. అస్తమానం కంప్యూటర్ ముందు కూర్చోడం కుదరదుగా. ఇంట్లో మావారికి కూడా చెప్పలేదు. ప్రింట్ చేసిన పేపర్లు చూసి మావారు అడిగారు ఏంటిది నా పేపర్లన్నీ ఖాళీ చేస్తున్నావ్,ప్రింటర్ ఇంక్ అంత తొందరగా ఐపోతుంది ఎన్ని సార్లు నింపనూ అని. ఒక ఆర్టికల్ రాస్తున్నా అని చెప్పాగాని కంప్యూటర్ ఎరా అని చెప్పలా. ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మావారు ఆ పత్రిక కొంటున్నారు. సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. ఎలాగైతేనేమి అనుకున్న సమయానికి వ్యాసం రాసి శ్రీధర్ గారికి అందివ్వగలిగాను. ఆయన చిత్రాలు పెట్టి కష్టపడి కవర్ పేజీ తయారు చేసారు.

నిజంగానే ఇది ఒక యజ్ఞం లా అనుకుని చేసాను. ఎందుకంటే బ్లాగుల గురించి, వికీ గురించి ఇంత వివరంగా చెప్పే అవకాశం వచ్చినందుకు, నా శాయశక్తులా ప్రయత్నించి అన్ని వివరాలు ఇవ్వగలిగా. దీనికి  వీవెన్,కిరణ్ , త్రివిక్రమ్,శిరీష్ గారు,రమణ,నవీన్ ఎంతో సాయపడ్డారు. వారి సాయం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.నేను అనుకున్నది, వీళ్ళందరికి చెప్పింది ఇది నా అర్టికల్ కాదు మనందరిది అని.

ఈ వ్యాసం రాసేటప్పుడు నేను రోజూ దేవుడిని ఇదే కోరుకున్నా. ఇది పూర్తి అయ్యేవరకు నాకు మానసికంగా కాని, శారీరకంగా కాని ఎటువంటి సమస్యలు రావద్దని, ఎలాంటి అడ్డంకులు రాకుండా పూర్తి చేయాలని. అది జరిగింది చాలు ఎంతో సంతృప్తిగా ఉంది. నేను ఇదంతా చెప్పింది నా గొప్పలు చెప్పాలని కాదు.నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నానిలా అని అంతే.

ఈ వ్యాస రచనలో  నాకు అనుక్షణం సహకరించిన గురువుగారు వీవెన్ కు శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సతాయించాలెండి. థాంక్యూ వీవెన్. 

నా ఈ విజయాన్ని మావారికి, పిల్లలకు మా వివాహ రజతోత్సవ కానుకగా ఇచ్చా. పత్రికాఫీసునుండి కాంప్లిమెంటరు కాపీ వచ్చేవరకు మావారికి తెలీదు. పత్రిక చూసి ఏంటిది ,ఎందుకొచ్చింది అని అడిగారు. చదివాకా నవ్వుతూ గుడ్ బావుంది అన్నారు.మనసులో కాస్త గర్వంగా ఫీల్ అయ్యారు . కాని  బయటపడలేదు. నాకు తెలీదేంటి.పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటున్నారు. 

ముచ్చట్లు ఎక్కువయ్యాయి కాని ఇక మామూలుగా నా బ్లాగులు రాసుకుంటాను. త్వరలో ఒక చురకలాంటి టపా రాయబోతున్నా మరి.

ప్రకటనలు

Comments on: "అందరికీ ధన్యవాదములు…" (7)

 1. జ్యోతి గారు మీరు పంపిన ఆర్టికల్ చదివానండి.నిజంగా పొగడటం అని కాదు గాని చిన్న పిల్లలకి కుడా అర్దమయ్యేలాగ అన్ని విపులంగా వివరించారు.ఇంత మంచి ఆర్టికల్ రాసిన మీకు ,మీకు సహకరించిన వారికి ,ప్రచురించిన శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు.

 2. ఒక లంకే ఇక్కడేస్తే మేము చదివేవాళ్ళం కదా?

 3. ఆ వ్యాసనికి ఇక్కడ ఒక లంకే ఇస్తే బాగుండేది కదా. ంఏము కూడా చదువుకునేవాళ్ళం. లేకపోతే ఒక scanned copy ఐనా సరిపోద్ది.

 4. అనిల్ గారు,

  ఆన్ లైన్ పత్రిక లేదండి. మార్కెట్లో కొనాల్సిందే. లేదా పత్రికాఫీసుకు మనీఆర్డర్ చేసి తెప్పించుకోండి. భారతదేశంలో ఎక్కడున్నా పంపిస్తారు..

 5. అవునండీ, అనిల్ గారు చెప్పినట్లు, మీరు ఇక్కడ ఆ లింక్ ఇస్తే బావుండేది.. నేను బెంగళూరు లో ప్రయత్నించాను కానీ దొరకలేదు.. మ్ ఏమి చేస్తాం ఇంటికి వెళ్ళేవరకు ఆగాల్సిందే… వీలుంటే ఆ లింక్ ఇవ్వడానికి ప్రయత్నించండి…

 6. జ్యోతి గారు,
  మీ వ్యాసంకోసమే, కంప్యుటర్ ఎరా అన్న పత్రికని, ఒక వార్తపత్రికల విక్రయదారుడివద్ద అక్షరాల ౧౫ రూపాయలిచ్హి కొని, చదివి, ఇంకొక ఇద్దరితో చదివించి ఇంకేవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తు ఈ వ్యాఖ్య.
  క్లుప్తంగా వ్యాసం బాగుంది.
  వికిపిడియా, బ్లాగులు, తెలుగులో బ్లాగులు, తెలుగులో వ్రాయడానికి పనికివచ్హే ఉపకరణాలు, అన్నీంటిని ఈ వ్యాసం స్పర్శించింది.
  వాటిని ఇంకొంచెం లోతుగా ఇస్తే బాగుండేదేమో?బహుశ స్థలాభావం అయ్యుంటుంది.
  కొన్ని బ్ల్లాగులకి లంకెలనుగూడా ఉదహరించారు. అది అసంపూర్ణంగా ఉంది.
  కొన్ని చిన్న దోషాలున్నవి. ఈ సారి ఆ తప్పులు దొర్లకుండా చూసుకోవచ్చు.
  శ్రీధర్ గారు, మీ వ్యాసాన్ని ముఖపత్రచిత్రానికి వాడడంకూడా సరిగ్గా అతికింది.
  ఏది ఏమైనా అంతర్జాలము, ఆంధ్రము, తెలుగు వారు, వారి బ్లాగులు గురించి ఇప్పటిదాకా ఇంత వివరంగా ఒక్కచోట సమగ్రంగా విషయాన్ని అందించిన మీకు, శ్రీధర్ (కంప్యుటర్ ఎరా)గారికి, తెలుగు బ్లాగ్‌లోకము కృతజ్నతలు తెలుపుకుంటుంది.

 7. నాలుగురోజుల పల్లెటూరి విహారం తర్వాత నిన్న(03 సెప్టెంబర్) రాత్రి సికింద్రాబాద్ స్టేషన్లో దిగీదిగగానే నా మొబైల్ ఫోన్ మోగింది.. ఎంట్రా అని చూస్తే ” Buy – Computer era” అని రిమైండర్ ఉంది..( రెండు రోజుల క్రితం నేనే పెట్టుకున్నది). వెంటనే ఆలస్యం చెయ్యకుండా స్టేషన్ ఎదురుగా ఉన్న షాప్ లో అడగ్గా లక్కీగా మిగిలిన చివరి 2 కాపీల్లోంచి ఒకదాన్ని ఇచ్చాడు. వెల రూ. 15/- అంట (అంతకుముందెన్నడూ ఆ పత్రిక ఉన్నట్లు కూడా తెలియదు నాకు).

  కొన్నాక నేను వెళ్లాల్సిన చోటికి సిటీ బస్ సిద్దంగా ఉంది. ఎక్కి చదవడం మొదలెడితే, నా స్టాప్ వచ్చేసరికి మొదటి పది ఆర్టికల్స్ అయిపోయాయి. ఇంక దిగి రూమ్ లోకి వెళ్లి భోంచేసాక కవర్ స్టోరి మొదలెడితే అయిపోయేసరికి రాత్రి దాదాపు 11 అయింది… ఆనందంతోపాటు ఆశ్చర్యం కూడా వేసింది… అంతర్జాలంలో తెలుగుపై నాకు తెలియని ఇన్ని విషయాలు ఉన్నాయా! అని… థాంక్స్ అక్కా!..

  సింపుల్ అండ్ స్వీట్… వెర్రీ ఇన్ఫర్మేటివ్ !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: