నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆరోగ్యమే మహాభాగ్యం…

లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజయ్. ఆ డాక్టర్ అదో టైపు.

సంజయ్ : సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
డాక్టర్: ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే.
సం: వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
డా. ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
సం: వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
డా: అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి ఎందుకు మంచివి కావో చెప్పు?
సం: పోనీ మద్యం మానేయాలంటారా?
డా: ఎవరయ్యా నీ బుర్ర పాడు చేసింది? వైన్ వచ్చేది పళ్ళ నుంచి కాదా ? బీరు బార్లీ నుంచే కదా! దర్జాగా తాగు.  పళ్ళు తిన్నంత ఆరోగ్యం.
సం: మరి ఐస్‌క్రీమ్‌స్, చాక్‌లెట్లు..
డా: లాభం లేదయ్యా! నేను చెప్పేది నీకు అర్ధం కావట్ళేదు. అవీ పాలు, కూరగాయల బై ప్రోడక్ట్సే కదా!
సం: వ్యాయామం చేస్తే ఎక్కువకాలం బ్రతుకుతారంటారు. నిజమేనా?
డా:ఎవరు నీకు చెప్పింది? కసరత్తు చేస్తే గుండె వేగం పెరుగుతుంది. వేగం పెరిగితే ఆయుస్షు ఎలాపెరుగుతుందయ్యా.ఇదెలా ఉందంటే, వేగంగా నడిపితే కారు మన్నిక ఎక్కువ కాలం ఉంటుందన్నట్లుంది.
సం: అది కాదు. సిట్ అప్స్ చేస్తే, పొట్ట తగ్గుతుందంటారు ..
డా: చూడు.. వ్యాయామం చేయిస్తే చేతికండరాలు పెరుగుతాయి కదా. అలాంటాప్పుడు సిట్ అప్స్ చేస్తే పొట్ట పెరగదా? కోరి కోరి లావు అవుతానంటావేమయ్యా!
సం: పోనీ మంచి ఫిగర్ కోసం ఈత కొట్టొచ్చా?
డా: ఈత కొడితే నాజూగ్గా అవుతారనేది తప్పుడు ప్రచారం. అదే నిజమైతే తిమింగలాలు ఎందుకు అంత సైజున్నాయో చెప్పు?
సం: మరి బాడీకి ఓ షేప్ ఎలా వస్తుందో చెప్పండి?
డా: రౌండుగా ఉండడం మాత్రం షేపు కాదా? ఎవరా మాట అన్నది?
సం: ???????

ప్రకటనలు

Comments on: "ఆరోగ్యమే మహాభాగ్యం…" (5)

  1. తెలుగుఅభిమాని said:

    ఇది చదివినప్పటినుంచి కడుపులో ’జజ్జినకరి’

  2. అదిరిందండి మీ హాస్యపుణుకులు

  3. భలే డాక్టరండి. బాగుంది.

  4. For every question, there are different answers with explanation. The answers from the doctor are in a negative mode!
    The general rule of thumb is we can enjoy everything in this creation in moderation. Moderation can make man healthy to enjoy life and to get the mission of life ie to know who are in real sense.

  5. Every human being is the author of his own health or disease by Gautama Buddha. So Your health is in your hands Only.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: