నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఈ నెల ఈ సమావేశం

1.jpg

ప్రతి నెల బ్లాగర్ల సమావేశానికి నన్ను రమ్మని వీవెన్, కిరణ్ పిలుస్తూనే ఉంటారు. నేనే బద్ధకంతో రాను, వచ్చిన ఏం చేయాలి అని దాటేస్తుంటాను. కాని ఈ నెల సమావేశానికి వెళ్ళడానికి కొన్ని కారణాలున్నాయి.

1. సమావేశ స్థలం మా ఇంటికి దగ్గరగా ఉంది.
2. క్రితం సారి సమావేశానికి వెళ్ళినప్పుడు అందరితో ఎక్కువ మాట్లాడడానికి సమయం సరిపోలేదు.
3. శ్రీధర్ ని కలవడానికి
4. మన కృష్ణమోహన్ ఓ సారి నేను సమావేశానికి రావాలని అన్నాడు . అతనిని కలవొచ్చు అనుకున్నా.
5. ముఖ్యమైనది. అప్పుడప్పుడు ఆడవాళ్ళు కూడా  వెళ్తుండాలని లేకపోతే బొత్తిగా మగాళ్ళ సమవేశమైపోతుందని.

 ఆదివారం మద్యాహ్నం చిక్కడపల్లిలో మా అమ్మాయి షాపింగ్ ఉంటే వెళ్ళాం. తీరిగ్గా నడుచుకుంటూ అన్నీ కొనుక్కుని, ఫుట్‌పాత్ మీద ఉన్న బుక్ షాప్స్ లో ఏమేమి పుస్తకాలున్నాయో చూసుకుంటు వెళ్ళా. మా అమ్మాయి తమిళ భాష నేర్చుకోడానికి పుస్తకం కొంటానంటే తిట్టా. సిగ్గులేకపోటే సరి ఉన్న తెలుగు మర్చిపోయి తమిళ్  నేర్చుకోడమేంటి. ఇంగ్లీషులో మాట్లాడుకో లేదా నీ స్నేహితులనే తెలుగు నేర్చుకోమని కొనివ్వలా. అక్కడినుండి శ్రీధర్‌కి ఫోన్ చేస్తే చాల పని ఉంది రాలేనంటే పర్లేదు రమ్మని చెప్పా. అక్కడినుండి ఆటోలో నెక్లేస్ రోడ్ కి వెళ్తుండగా, మధ్యలో లుంబిని పార్క్ దాటుతుండగా గుండె జల్లుమంది, ఒకలాంటి భయం కూడా, బాంబ్ బ్లాస్ట్ గుర్తొచ్చి. పీపుల్స్ ప్లాజా లో ఒంటరిగా కూర్చోడమెందుకు, మబ్బులు పట్టాయి, వాన వచ్చేటట్టుగా ఉందని ప్రక్కనే ఉన్న ఈట్ స్ట్రీట్ కెళ్ళి కూర్చున్నాము. కొద్దిసేపట్లో శ్రీధర్ వచ్చాడు. మాట్లాడుతుండగానే పది నిమిషాల్లో వీవెన్, సిబిరావుగారు,  శ్రీనివాస రాజు వచ్చారు. బయటకెళ్దామంటే నేనే వద్దన్నాను. వర్షమొస్తే కష్టమని.  వాతావరణం కూడా ఆహ్లదకరంగా ఉండింది. మరి కొద్ది సేపట్లో సత్యసాయిగారు వచ్చారు. ఇపుడాయన హైదరాబాదులోనే పని చేస్తున్నారు. ఆయన కూడా నాలానే సమావేశ స్థలం వాళ్ళ ఇంటికి దగ్గరగా  ఉందని వచ్చా అన్నారు.  తెలుగు వెలుగులు వ్యాసం గురించి మాట్లాడుకుంటుండగానే శ్రీధర్ స్నేహితుడు సుధాకర్ (ఈనాడులో పని చేసున్నారు) వచ్చారు. అందరి పరిచయాలు అవుతుండగా కందర్ప కృష్ణమోహన్ వచ్చాడు. అప్పుడు వీవెన్ వాళ్ళందరు నవ్వుకుంటుంటే నాకర్ధం కాలా.నేను కూడా సమావేశానికి వస్తే బాగుండును అని కృష్ణమోహన్ మన గుంపులో అడిగాడని తెలిసింది.  వారం నుండి మాకు నెట్ లేదు. సుధాకర్‌గారు మన  బ్లాగర్ల కార్యక్రమముల గురించి తెలుసుకోవాలని వచ్చారు. బ్లాగులలో ఎలాంటి అంశాలు రాస్తున్నారు, ఫోటో బ్లాగులు మొదలగునవి అడిగి తెలుసుకున్నారు.అసలు మీరు ఈ బ్లాగులు ఎలా మొదలెట్టారు అని అడిగితే అందరు చెప్పిన  సమాధానం ఒక్కటే నాతో సహా తెలుగు అన్న ఒక్క అంశమే అందరినీ బ్లాగర్లను చేసింది, దేశవిదేశాలలో ఉన్న తెలుగువారిని దగ్గర చేసింది అని. ఆ తర్వాత చావా కిరణ్, సుధాకర్ కూడా వచ్చారు. మనం ప్రతినెలా సమావేశ స్థలాన్ని మారుస్తుంటే బాగోదు. ఒక పర్మనెంట్ స్థలం పెట్టుకుందాం అన్నాడు చావా కిరణ్. కాని ఇలా వేర్వేరు స్థలాల్లో సమావేశం ఏర్పాటు చేసుకుంటే వైవిధ్యంగా ఉంటుంది , గుంపులో కాని, కూడలిలో కాని దాని వివరాలు ఎలాగు తెలుస్తాయి.ఎవ్వరికి ఇబ్బంది ఉండదు.మన  గుంపు ఉన్నది అవన్నీ చర్చించుకోడానికే కదా అని నేనన్నాను. మరి ఏం చేస్తారో తెలీదు.   కిరణ్ నాకు ఈ చోటు నచ్చలేదు అంటే అందరూ బయట కెళదామని బయలుదేరారు. నేను కూడా వచ్చి చాల సేపైంది వెళతానని చెప్పా. సుధాకర్ అందరికి చాయ్ , కాఫీలు ఇప్పించాడు. అందరు ఆ గ్లాసులు పట్టుకునే బయటకొచ్చారు.నేను అందరికి వీడ్కోలు పట్టుకుని మా అమ్మాయితో వెళ్ళిపోయా.అలా వెళ్ళడం మంచిదైంది. అరగంటలోపే భీకరమైన వర్షం వచ్చింది. ఇది నా సమావేశ అనుభవం. మళ్ళీ వెళతానో లేదో.
ఒక చిన్న రిక్వెస్ట్..

ప్రతి సమావేశానికి ఫోటోలు తీసుకుంటే బాగుంటుంది కదా.. ఒక జ్ఞాపకంగా.

ప్రకటనలు

Comments on: "ఈ నెల ఈ సమావేశం" (11)

 1. I nela samaavEsaM guriMci naaku teliyalEdu.

  I missed to meet you.

  next time better luck

 2. విధి అంటే ఏంటి అంటే ‘ఇది’ అని చెప్పగలను ఇప్పుడు. ఎందుకంటే మీరు లోపల సమావేశమైనంత సేపు నేను బయట నెక్లెస్ రోడ్ పైన వెతుకుతూనే ఉన్నాను, సమావేశం ఎక్కడ జరుగుతుందో అర్థం కాక… ఇవ్వక ఇవ్వక మా అన్నయ్య బైక్ ఇచ్చాడు, తెలుగు బ్లాగర్ల సమావేశం ఉంది అంటే. దానిలోని పెట్రోల్ కాస్తా అయిపోయింది, నేను నెక్లెస్‌రోడ్ పైన తిరిగిన తిరుగుడుకు. ఎక్కడని వెతకను. ఒకపక్క మీరు పంపిన ఫొటొలోని(గూగుల్ మ్యాప్)స్థలంలో ఎవడో బైకుల కంపని వాడు ‘టెస్ట్ డ్రివ్’ అంటూ ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు. మరో ప్రక్క అదే గ్రౌండ్లో ‘ఎయిడ్స్ పైన ఏదో చైతన్య కార్యక్రమం’ జరుగుతొంది. బైక్ ని పార్క్ చేసి గ్రౌండ్లోకి నడిచి చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు. ఎవర్నని అడగను, మీరు తెలుగు బ్లాగ్ సభ్యులా అని. అక్కడకీ దైర్యం చేసి ఒక గ్రూపుని అడిగాను.. సారీ అండి మేముకాదు అన్నారు.

  అలాగే చూసుకుంటూ ప్రక్కనే ఉన్న పార్క్‌లో ఈచివర నుండి ఆ చివరవరకు నడూస్తూ వెతికాను…( ఈ నడవడమేదో ప్రొద్దున నడిచి ఉంటే, మార్నింగ్ వాక్ చేసిన ఆనందమైనా దక్కి ఉండేది). ఊహు… కనబడితేనే కద..! అలా అలా… నాలుగున్నర (అప్పటికే గంట అయింది, నెక్లెస్ రోడ్డు ఎక్కి) గడిచేసరికి చూద్దాం మరో ప్రక్క ఉంటారేమోనని, మళ్ళీ బైక్ తీసి వెతకడం ప్రారంబించాను, ఈ చివరనుండి ఆ చివర వరకు (మొత్తం 3 కి||మీ||). దురదృష్టం. కలుసుకోలేకపోయాను. ఈ మొత్తం వెతకడంలో నేను చేసిన ఒకే ఒక తప్పు……………… అదిగో పైన కనిపిస్తున్న ఆ ‘EAT street’లో వెతక్కపోవడం. ఫోటో పెట్టినందుకు ధన్యవాదాలు, జ్యోతక్క…(కళ్లు తుడుచుకుంటున్నాను…..!!)

 3. మొత్తానికి తెలుగు గురించి తప్ప అన్ని విషయాలు చర్చించారన్న మాట!!

 4. లేదు నవీన్ నేను వెళ్ళిన తర్వాత చర్చించారులే…హైదరాబాదువాళ్ళని మరీ అంత తీసేయకు…

 5. హైదరాబాదును వాళ్ళను తీసెస్తే..తట్టలో ఏమి మిగులుతుంది..రెండు మెతుకులు తప్ప. ఏమి జరిగిందా అని ఆత్రంగా ఎదురు చూస్తూంటే..విశేషాలు, ఫోటోలు, నిర్ణయాలు, చర్చల గురించి ఎవ్వరూ విఫులంగా వ్రాయలేదనే నా బాధ. ఇప్పటికైనా మీరు వ్రాశారు సంతోషం. ఇంకొన్ని రివ్యూల కోసం ఎదురు చూస్తున్నాను.
  అన్నట్టు బెంగళూరు సమావేశం గురించి ఉలుకూ పలుకూ లేదేమిటి? ప్రవీణ్ను అడగాలి

 6. నవీన్ నువ్వు చెప్పింది కరెక్టే. కాని ఎక్కువగా చర్చలన్నీ గుంపులోనే జరిగిపోతున్నాయి. ప్రత్యేకంగా చేయవలసిన చర్చలు, నిర్ణయాలు అంటూ ఎక్కువగా ఉండవు కదా. ఐనా ఈ సమావేశానికి ఎంతమంది హైదరాబాదు బ్లాగర్లు వస్తున్నారు. క్రమం తప్పకుండా వచ్చేది ఓ పదిమంది ఉండరు. మిగతావారు ఎందుకు రారు అని నేను ఓ సారి గుంపులో అడిగితే ఎవరిష్టముంటే వాళ్ళు వస్తారు అన్నారు.ఈ ఎనిమిది మంది మాత్రమే వస్తారు మొదటినుండి. వాళ్ళకే తెలుగు మీద అభిమానముందా. వాళ్ళే చర్చించి నిర్ణయాలు తీసుకోవాలా. ఇదేం బిజినెస్ మీటింగ్ కాదే. మన ఇష్టంతో మిగతా బ్లాగర్లను కలవాలి అనే ఉత్సాహం అలాగే మంచి విషయాలు చర్చించుకోవచ్చు అని.ప్చ్ కాని ఎవరినన్నా అడిగితే బిజీ,బద్ధకం అంటారు. కాని వీవెన్,చావా కిరణ్, సుధాకర్ కూడా మహా బద్ధకస్తులు.నెలకొక్క రోజు కనీసం రెండు గంటలు ఈ సమవేశానికి కేటాయించకపోతే ఇప్పుడు వచ్చే బ్లాగర్లకి మాత్రం ఏం ఉత్సాహం ఉంటుంది. ఈ సమావేశం అందరు తెలుగు బ్లాగర్లకి, తెలుగు ప్రేమికులకి కదా. ఇంతకు ముందు అంటే తక్కువ బ్లాగులు ఉండేవి తక్కువ మంది వచ్చారనుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాదులో కూడా చాలామంది తెలుగు బ్లాగర్లున్నారు. ఎందుకు రారు. అందరికీ ఎవో పనులు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి కాదనను.

  చర్చలు చేసి తెలుగు గురించి కృషి చేస్తున్నారు.ఓకే. వీవెన్ గుంపులో చెప్పాడు కదా వర్డ్‌ప్రెస్ తెలుగీకరణ గురించి ఎంతమంది రెస్పాన్స్ ఇచ్చారు. వికీలో రాయండని మనం బ్లాగులలో చెప్తూనే ఉన్నాం. ఎంతమంది మొదలెట్టారు కనీసం వికీలో అడుగు పెట్టారా. తెలుగు వెలుగులు వ్యాసం తర్వాత ఎంతమంది గుంపులో చేరారు,ఎన్ని బ్లాగులు మొదలయ్యాయి.వీటన్నిటికి సమాధానం అంత సంతృప్తికరంగా లేదు. ఏం చేస్తాం.మన ప్రయత్నం మనం చేయాలి. ప్రతినెల ఏదోటి చర్చించాలి అన్నది ముఖ్యం కాదు. ఫలించిన ప్రయత్నాలెన్ని అన్నది గమనించాలి.

  గతంలో త్రివిక్రం శబ్ద రత్నాకరం నుండి విక్షనరీ కోసం అందరికీ పదాలు ఇచ్చారు కదా. అది ఎంత వరకు వచ్చింది. ఎంతమంది పూర్తి చేసారు. త్రివిక్రం, సుధాకర్ ఎంత కష్టపడ్డారు. ఆ పేజీలు జెరాక్స్ , స్కాన్ చేసి పంపడానికి.ఇలా ప్రోత్సాహం,సహకారం లేకుంటే ముందు ముందు ఏ పనైనా చేయడానికి ఎవరికైనా ఉత్సాహం వస్తుందా.

  అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. బ్లాగులు రాయడం ఒక్కటే కాదు అప్పుడప్పుడు సమవేశానికి రండి. తెలుగు వ్యాప్తిలో పాలుపంచుకోండి. దీనికి అందరి కృషి కావాలని నా అభిప్రాయం. ఇది ఎవ్వరినీ నొప్పించడానికి కాదు. క్షమించాలి.

 7. nanda,

  మీరు కూడా పర్మినెంటు సమావేశపు స్థలికి ఓటు వెయ్యాలి అయితే!

  అన్నట్టూ వీవెన్ ఫోన్ నంబర్ లేదా? 🙂

 8. ఏమండీ, మా చెన్నపట్నంలో తెలుగు బ్లాగర్సే లేరా??? ఎప్పుడు చూసినా బెంగుళూరు, హైదరాబాద్ పేరులు మాత్రమే వినిపిస్తున్నాయి? ఇలాంటి సమావేశాలు చెన్నై లో ఏమయినా జరిగాయా? ఎవరయినా ఉండి, కలుద్దాం అనే సరదా/ఉత్సాహం ఉంటే నేను సిద్దం.

 9. budugu,

  మీరే మొదలు పెట్టండి.

  send a mail to group, somebody will reply I guess/home.

 10. తెలుగు బ్లాగర్లందరు ఇష్టంగా అక్కా అని మిమల్ని పిలుస్తారు కదా ఒక సారి చూద్దాం అనుకున్నాను కాని,మొన్న సమవేశం వివరములుతెలియక రాలేదు మీరు వచ్చారు నా badluck,మీ బ్లాగ్ బాగుంటుంది!!

 11. మీ ఈ సమావేశానికి సుధాకర్(ఈనాడు పత్రిక)గారు రావడం వల్లే అనుకుంటా మొన్న శనివారం ఈనాడులో తెలుగు బ్లాగుల మీద వ్యాసం వచ్చింది..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: