నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

HAPPY BIRTHDAY JYOTHI

                            7.jpg

రోజుకి నేను బ్లాగు మొదలుపెట్టి సరిగ్గా సంవత్సరమవుతుంది. నా బ్లాగ్ప్రయాణంలో అన్నీ శుభాలు, విజయాలే దక్కాయి నాకు. అది జరగడానికి నాకు సహకరించి, ప్రోత్సహించిన అందరు బ్లాగర్లకు హృదయపూర్వక ధన్యవాదములు.

 

ఊరికే టైంపాసుకు నెట్‌కొచ్చిన నాకు దొరికిన అమూల్యమైన వరం తెలుగు బ్లాగు గ్రూపు. మొదట్లో సరదాగా గడిచిపోయింది గుంపులో కాని అందరు కలిసి నన్ను బ్లాగు మొదలెట్టించారు. బ్లాగు మొదలెట్టిన సమయంలో అంతా అయోమయంగా ఉండేది. అస్సలేమీ తెలీదు. ఎలా చేయాలో తెలీదు. ఊరికే టైప్ చెయ్యడం మాత్రం వచ్చేది. కాని నేనడిగిన సందేహలన్నింటికి  గుంపులో ఓపిగ్గా సమాధానమిచ్చేవారు ఎవరో ఒకరు.

 

గత సంవత్సరం అందరి ఆడాళ్ళలాగే  ఇంటిపని కాగానే నిద్రపోవడం, టీవీలో వచ్చే చెత్త సీరియళ్ళన్నీ చూడడం( అప్పుడవి మహాద్భుతాలు) వాటిగురించే చర్చించడం, మరునాటి కోసం ఎదురుచూడ్డం చేసేదాన్ని. వేరే వినోదం అంటూ లేదు మరి. ఐనా నాలో ఎదో అసంతృప్తి. నాకు నచ్చిన పాటలు, వంటలు, జోకులు, కథలు,పురాణగాథలు. వీటన్నింటి గురించి మాట్లాడుకోటానికి స్నేహితులు లేరు.నాలో నేనే అనుకోవడం. మొదటినుండి తెలుగు అంటే ప్రాణం. పుస్తకాలంటే మరీను. మరి ఏదైనా విషయం గురించి చర్చించాలి, సందేహం తీర్చుకోవాలి అంటే ఎవరూ లేరు. అందుకే గూగుల్‌లో కనపడ్డ తెలుగు గుంపులన్నీ చేరిపోయా. అప్పటికి గ్రూపులంటే తెలీదు. తర్వాత ఒక్కటొక్కటిగా తెలుసుకుని బ్లాగు గుంపులో స్థిరపడిపోయా. సమయంలో నన్ను అడుగడుగునా ప్రోత్సహించిన వీవెన్, చావాకిరణ్, సుధాకర్, శిరీష్‌గారు, సిబిరావుగారు, రమణ, త్రివిక్రం, ప్రసాద్, రవి వైజాసత్య అందరికీ ఎంతోణపడి ఉన్నాను. బ్లాగుల మూలంగానే నాకే తెలియకుండా నాలో దాగి ఉన్న అభిరుచులన్నీ బయటపడ్డాయి. నాకు ఇష్టమైనవన్నీ బ్లాగుల రూపంలో భద్రపరుచుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. ఎలాంటి అశాంతి అసహనం లేదు.నాకిష్టమైన వంటలు, సరదా కథలు,జోకులు,పాటలు అన్నీ తెలుగులో రాయగలుగుతున్నాను, నాలా ఆలోచించే, అర్ధం చేసుకోగలిగే మిత్రులతో పంచుకోగలుగుతున్నాను అని. బ్లాగుల వల్ల నా ఆలోచన, అవగాహనా శక్తి పెరిగింది.నిజం. ఎప్పుడైనా  ఏ విషయమైనా నచ్చిందైనా , నచ్చనిదైనా, నా స్వంత విషయమైనా వెంటనే బ్లాగులో రాసుకుని అందరితో పంచుకోవడం అలవాటైపోయింది. అందరూ కుటుంబ సభ్యులు, పాత మిత్రులలా అనిపిస్తుంది. ఈ ప్రయాణంలో నేను ఎవ్వరితోను పోటీ అనుకోలేదు. నాకు నేనే పోటీ పెట్టుకుని రాసుకుంటూ పోయా. మొదటినుండి నాదో అలవాటు మంచిదో కాదో తెలీదు. నాకు తెలిసింది పదిమందికి చెప్పడం, తెలీంది పదిమందిని అడగడం. అదే పాటిస్తూ వస్తున్నా ..

 

ఇన్నేళ్ళుగా మావారు, పిల్లలకిష్టమైనవి చేయడమే నా బాధ్యత, కర్తవ్యం అంటూ బ్రతికేసాను. నాకంటూ ఇష్టాలు ఏమున్నాయి అని ఆలోచించలేదు. ఫలానా ఆయన భార్య, ఫలానా ఆయన కూతురు అని మాత్రమే నాకు గుర్తింపు ఉండేది. నాకంటు ఒక గుర్తింపు ఉంటుంది, ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదు. కాని బ్లాగులలో రాసుకుంటూ పోతుంటే మీ అందరి ప్రోత్సాహం, అభినందనలు,గౌరవం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.నేను కూడా ఎదో చేయగలను, సాధించగలను అనుకుంటూ మరింత ఉత్సాహంతో సాగిపోయాను. ప్రయాణంలో ఎక్కడా అపశృతులు కలుగలేదు.ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని.. ఇది నేను ఇంట్లోనే ఉండి చేయగలిగాను అని. అందరూ ఊరికే అనేవారు మరి ఎప్పుడూ  కంప్యూటర్లో ఏం చేస్తుంటావు అని.  నేను ఎన్ని బ్లాగులు రాసినా అది నా కుటుంబ బాధ్యతల తర్వాతే తీరిక సమయాలలో చేస్తున్నాను.  టీవీ అంటే చిరాగ్గా ఉందిప్పుడు. బయటికెళ్ళిగాని, ఫోన్లోగానీ సొల్లు కబుర్లు బంద్. తెలిసినవాళ్ళందరు అడుగుతుంటారు ఏంటిది అస్సలు కనపడటంలేదు, మాట్లాడటంలేదు. ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని.నవ్వి ఊరుకుంటాను. నేను చేసే పని చెప్పినా వేస్ట్ కాబట్టి. వాళ్ళకి అర్ధం కాదు.

 

ఏడాది ప్రయాణంలో నాకు ఎప్పుడు అలసటకాని, కష్టం కాని అనిపించలేదు. ఎందుకంటే నాకిష్టమైన తెలుగులో పని కదా.ఇష్టమైతే ఎదీ కష్టం కాదు. ఏడాది కాలంలో తెలిసి ఎవ్వరినీ నొప్పించలేదు. తెలియక నొప్పించితే క్షమించండి.మీకు తెలుసుగా నేను ఎప్పుడు సరదాగానే ఉంటాను అని.

 

ఇవి నా ప్రయాణంలో అంచెలంచలుగా నా ఎదుగుదల.

 

మొదటి నెలలో రెండో బ్లాగు షడ్రుచులు

మూడు నెలలలో షడ్రుచులలో 100 టపాలు, మూడో  బ్లాగు గీతలహరి

ఆరునెలలో – 500 టపాలు , 4  బ్లాగులు

తొమ్మిది నెలలలో -1000 టపాలు , 5 బ్లాగులు

సంవత్సరానికి తెలుగు వెలుగులు వ్యాసం. 

 

ఇంకా ఏమన్నా ఉందా నేను చేయగలిగేది. లేదనుకుంటా. కాని ఇంకా ఎంతో సాధించాల్సింది ముందుంది అనిపిస్తుంది. ఆపై దేవుడి దయ.  నాకు ఒక్కటే లోటుగా ఉంది. తెవికీలో రాయడానికి సమయం చిక్కడంలేదు.

 

ఒక కొత్త శీర్షిక : నా స్నేహితురాలు స్వరూప చెప్పే ముచ్చట్లు అప్పుడప్పుడు రాస్తుంటాను. అది తెలంగాణ శకుంతల టైపు. పాతబస్తీలో ఉంటుంది.

 

సంవత్సరంగా నాకు నచ్చిన నా ఆలోచనలు, భావాలు, చర్చలు …. 

అదేంటో గాని.

వారెవ్వా క్యా సినిమా హై

అనుబంధం

ఆడపిల్ల

అదే మరి మండుద్ది

500

ఒక భార్య మనోవేదన

ఆడవాళ్ళలో జీనియస్సులు ఎందుకు లేరు

పెళ్ళిచూపుల ప్రహసనం

పడ్డానండి ప్రేమలో మరి

నమస్తే అన్నా

శతమానం  భవతి

మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు

 

ఏడాది క్రితం నేను ఏమి తెలీదు అంటూ గుంపులో కొచ్చా. కాని ఇప్పుడు అందరికంటే నేనే గొప్ప. నాకున్న బిరుదు, గౌరవం ఎవరికన్నా ఉందాఅదేంటాజ్యోతక్క.. అనే పేరు.  మరి అన్నా అని ఎవరన్నా పిలిపించుకున్నారా? విహారి ఏమంటావ్? నువ్వేనా మరి.

 

 

ఇప్పటికే కోతలు ఎక్కువయ్యాయి గాని….ఉంటా మరి..

Comments on: "HAPPY BIRTHDAY JYOTHI" (35)

  1. ధన్యవాదాలు. మీ బ్లాగ్విజయాల పరంపకు ఇది నాంది మాత్రమే…

  2. మా బ్లాగక్క గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. ఇలాగే అలుపులేకుండా శత సంవత్సరాలు బ్లాగుతూనే ఆనందంగా జీవించాలని మా తెలుగు బ్లాగు జీవుల కోరిక.

  3. ఈ సంవత్సరంలో నిజంగా అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిపోయావక్కా. నీ పేరు జ్యోతక్క కాదు బ్లాగక్క.
    ఇలాగే దినదిన ప్రవర్ధనమాన మవుతూ నీ బ్లాక్కీర్తిని నలుదిశలా విస్తరిస్తూ తెలుగుకు మరింత సేవ చేయాలని కోరుకుంటూ…

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. వింజమూరి విజయకుమార్ said:

    విజయీభవ! దిగ్విజయీభవ!! ఒక మైలురాయి వెనక్కి జరిగింది. అసంఖ్యాకాలు ముందున్నాయి. అధిగమించగలరని గుండెల నిండుగా అభిలషిస్తున్నాను. మీ సహృదయతే ఈ విజయ పరంపరకి చోదక హేతువని ఉధ్ఘాటిస్తున్నాను. కోనసాగించమంటున్నాను. ఉంటాను.

  5. మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకంక్షలు.
    మీరు ఇలాగే మరిన్ని టపాలు రాసి మరింత మంది చేత రాయించాలి.

  6. మిమ్మల్ని కలుసుకున్నందుకు, మీ బ్లాగులు క్రమం తప్పక చదువుతున్నందుకు నేనే (మేమే) గ్రేట్.
    (మా బావమరిదికిద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి ఒకసారి అమ్మనాది, నాన్న నాది, బామ్మ నాది, …. అని అందరినీ స్వంతం చేసుకుంది. అప్పుడు చిన్నది, అక్కనాది అని షాకిచ్చింది. ఆ స్పూర్తితో. )

  7. జ్యోతక్కా!
    బ్లాగరుగా మీ మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒక్క సంవత్సరంలో ఎన్ని మైలురాళ్ళో!!! అభివందనలు…
    -నేనుసైతం

  8. ఈ తమ్ముడి తరఫున కూడా నీ బ్లాగ్‌కి మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతక్క….!!

  9. అభినందనలు! ఇంకా ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ

  10. congratulations Jyothi garu.
    mee blog appuDappuDu chadutunTa kaani comments raase vopika leka vellipotunTa.
    Btw, naa purti peru lo inko sagam jyothi.
    Anduke aa peru gala vallu anagane abhimanam to mee blog chadivestu vunTanu.
    miru ilage eppaTiki ee jyothi ki kuDa jyotakka gaa spurthi andinchali ani aasistu..

    Aruna.. vuff.. jyothirmai Gosukonda.

  11. మన:పూర్వక శుభాకాంక్షలు!

  12. అక్కవి కావు..తెలుగు బ్లాగుకు అమ్మవి నీవే..బ్లాగులో ఏడాదంటే పదేళ్ళన్నట్టే..శుభాకాంక్షలు

  13. చూడు జ్యోతక్కో. ఇలా మాటి మాటికి శుభాకాంక్షలు చెప్పడం మా వాల్ల కాదు. ఇలా ప్యాకేజీ డీల్ శుభాకాంక్షలు ఏమన్నా వుంటే చెప్పు. వాటికి డబ్బు కట్టేసి చేతులు దులుపుకుంటాం. ఇలా వందా, అయిదు వందలూ, వెయ్యీ, లక్ష, కోటి, సంవత్సరం..యుగం అని శుభాకాంక్షలు చెప్పడం మా వల్ల కాదు. దానికి తోడు అప్పుడప్పుడూ పేపర్లలో నీ పేరు కూడా. రేప్పొద్దున ఏ తెలుగు టి.వి. వాళ్ళో నిన్ను స్క్రీన్ మీద చూపించేస్తే అప్పుడు ఫోనెత్తుకుని శుభాకాంక్షలు చెప్పడం నా వల్ల మాత్రం కాదు. అసలే నేను చాలా బిజీ. ఇలా కుదరదు కానీ ఏ కీన్యా లోనో బాంగ్లా దేశ్ లోనో ఆఫ్ షోర్ విషింగ్ సెంటర్ ఓపన్ చేసి పెడతాము.

    నా.నా.(నలుగుర్లో నారాయణ) : ప్రచండ బ్లాగరికి మొదటి వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు.

    నేను అన్ననవడమా.. డామిట్ నాకు మొన్నే గా ఇరవై పోయి ఇరవై ఒకటి వచ్చింది. వున్న ఒక్క తెల్ల వెంట్రుక్కి నిన్నేగా రంగేసింది. నాది చైల్డ్ మ్యారేజ్ లే అందుకనే ఇద్దరు పిల్లలు. ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు ఉద్యోగాల్లో సెటీలయ్యాక అప్పుడు అన్న పోస్టు గురించి ఆలోచిస్తా.

    — అందరి కంటే చిన్న తమ్ముడు.

  14. మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకంక్షలు.
    మీకొత్త బిరుదు కూడా బగుంది లెండి!”బ్లాగక్క” అని!!సరే కాని మాందరికీ పార్టీ లేదా!

  15. నల్లమోతు శ్రీధర్ said:

    జ్యోతక్కా, ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. యోగా క్లాస్ నుండి వచ్చేసరికి ఆలస్యమైంది. నిజంగా మనిషిలోని నిభిడీకృతమైన శక్తియుక్తులను వెలికితీస్తే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి నువ్వే తార్కాణం. నిజంగా నీలాంటి మంచి వ్యక్తితో ఆత్మీయ బంధం కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాను. బ్లాగుల ద్వారా నువ్వు సాధించే విజయాల కంటే వ్యక్తిగా నీ స్వభావం యొక్క ఔన్నత్యం నేను ఎక్కువ ఇష్టపడతాను. మంచి మనిషికి వందనాలు.
    -నల్లమోతు శ్రీధర్

  16. బ్లాగులోకంలో ఏడాది పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు.

  17. వ్రాయాలంటే పెద్ద పెద్ద పదాలే వస్తున్నాయి కానీ, భవిష్యత్తు కోసం వాటిని దాస్తున్నాను. ప్రస్తుతానికి చిన్నగా శుభాకాంక్షలు.

  18. ఇన్ని రాసినా మీ జాబుల్లో అచ్చుతప్పులు చా…లా తక్కువగా ఉంటాయి. మీ బ్లాగుల్లో నాకు బాగా నచ్చేదదే!

    ఈ సందర్భంగా నా అభినందనలూ అందుకోండి.

    మీరే అన్నట్టు.. మీకు మీరే పోటీ!

  19. జ్యొతి గారు, మీ బ్లాగుకి పుట్టిన రోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు!

    శ్రీ

  20. “ఇప్పుడు నేను మా ఇంట్లోవాళ్ళకి , మా పుట్టింట్లో గర్వంగా చెప్పుకుంటాను ఇంటర్‌నెట్‌లో దేశవిదేశాల్లో నాకెంత పేరుందో తెలుసా అని”
    మీరేమో ఇలా చెప్పుకుంటున్నారు.మేమేమో నాకు జ్యోతి గారు తెలుసు అని గర్వం గా చెప్పుకుంటున్నాము.
    మీరిలాగే ఎప్పటికప్పుడు మా చేత శుభాకాంక్షలు చెప్పించుకునే ఎన్నో పనులు చేయాలని కోరుకుంటున్నాను.

  21. మీకు వినాయకచవితి శుభాకాంక్షలు

  22. ఒక విధంగా మీరు నాకో చిన్న స్పూర్తి
    ఒకప్పుడు మీరు తెవికీ గురించి రాసిన ఠపాతో
    నేను మంచి తెవికీపిడియనుగా మారిపోయాను.
    అందుకే నా వైపునుండి
    కృతజ్ఞతలు+జన్మధిన శుభా కాంక్షలు

  23. చాలా సంతోషం.
    శుభాకాంక్షలు!

  24. పుట్టినరోజు (ఆలస్యపు) శుభకాంక్షల తో పాటు వినాయకచవితి శుభాకాంక్షలు కూడా అందుకోండి.

  25. మీకు ఆలస్యం గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్యధా భావించవద్దు.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ..

  26. జ్యోతక్కా,

    మీరు ఇలా మరో వేయి పుట్టిన రోజులు జరుపుకోవాలని అశిస్తూ.. మీ చిట్టి తమ్ముడు.
    మరమరాలు

  27. శుభాకాంక్షలండీ జ్యోతిగారు. టైంపాసు నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాము అన్నది అక్షరాల నిజం. ఇలానే వ్రాస్తూ ఉండండి.

  28. కందర్ప కృష్ణమోహన్ said:

    ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యలొచ్చిన టపా బ్లాగుల్లో ఏదైనా ఉందా… ఆ రికార్డు కూడా మీదేనా.. నా వయసు నాలుగు నెలలే కావడం మూలాంఛి మంచి బ్లాగులన్నీ రోజూ క్రమం తప్పక తిరగడం ఇంకా అలవాటు కాలేదు… క్షమించమని అడిగితే సరిపోతుందని నిఝ్ఝంగా అనుకోడం లేదు…

    అక్కాయ్…. హృదయపూర్వక శుభాకాంక్షలు……..

  29. అందరికీ ధన్యవాదములు .. ఈ టపా రాసేటప్పుడు ఎంతో అలసినట్టుగా ఉండింది. ఇంక నేను రాసేది ఏముంది అన్న నిసత్తువ ఆవరించింది. కాని మరునాడు మీ అందరి వ్యాఖ్యలు చదవగానే ఆ నిరాశ, నిస్సత్తువ, అలసట అన్ని గాలికెగిరిపోయాయి. మళ్ళీ పూర్వ ఉత్సాహం ఆవరించింది. ఇక కాసుకోండి అన్ని బ్లాగులు, వికీ ని పరిగెత్తించే ప్రయత్నం మొదలెడతా.

  30. Thanks Ra Jyothi(Aunty) for providing all these thing for me and all the telugu people.. its great work done by you..
    i appreciate you for such work..

    Good Luck..

  31. హబ్బా..ఏమి వైభవము. పూర్వ జన్మ సుకృతం. గలా గలా గోదారిలా కదలి పోతూనే ఉంటుంది. మీ బ్లాగ్విభావరి.. కల కాలం.. కళ కళ లాడుతూ…

  32. అభినందన సహస్రాలు.
    జీవేమ!శరదశ్శతం!
    నందామ శరదశ్శతం!
    మోదామ !శరదశ్శతం!

Leave a reply to చదువరి స్పందనను రద్దుచేయి