నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఎవరో తెల్లోల్లు పెట్టిన ప్రేమికుల రోజు, తల్లుల రోజు, తండ్రుల రోజు, బ్రతికిన రోజు ,చచ్చిన రోజు అని జరుపుకుంటాం. కాని మనమే మన తెలుగు బ్లాగర్ల రోజు ఎందుకు జరుపుకోకూడదు. అది కూడా ఎప్పుడు అని మనమే నిర్ణయించుకుందాం అని మన భూపతి మహారాజుగారు కొద్ది రోజుల క్రింద సెలవిచ్చారు. అమలు చేయక తప్పదు. మంచి అవిడియా కదా!

 

ఇప్పటిదాకా మనం సంతోషంగా బ్లాగులు రాసుకుంటూ పోతున్నాము. తెలుగును అభిమానించే వారందరికి చెప్తున్నాము. అలాగే ఈ తెలుగు బ్లాగర్ల రోజు చేసుకుందాము. ఎప్పుడంటారా? తెలుగు బ్లాగు గుంపులో 1000 మంది సభ్యులు చేరగానే. దగ్గరలోనే ఉన్నాము. ఇప్పుడు ఈ గుంపులో 865 మంది ఉన్నారు. బహుశా నవంబరులో అ సంఖ్యను చేరుకోగలము. కాని ఆ రోజు జరుపుకోవడానికి ముందు చేయవలసిన కార్యక్రమములు ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఇది కొందరు బ్లాగరులు మాత్రమే చేసుకోవాల్సిన పండుగ కాదు. సుమారు  500 మంది తెలుగు బ్లాగర్లందరు గర్వంగా , సంతోషంగా జరుపుకోవల్సిన పండుగ. ఇది మన పండుగ. ఇందులో ఎవరు ప్రెసిడెంట్, సెక్రటరీ అంటూ లేరు. అందరు సభ్యులే. అందరు పాలుపంచుకోవాలి.

 

దీనికోసం ఏమేమి కార్యక్రమములు నిర్వహిస్తే బావుంటుందో ఆలోచించండి. గుంపులో చెప్పండి . చర్చించండి. దీని కోసం ఎక్కడికీ వెళ్ళక్కరలేదనుకుంటా. దేశదేశాలలో ఉన్న తెలుగు వారందరు (బ్లాగర్లు, వికీపీడియన్లు) తమ ఇంట్లోనే, తమ కంప్యూటర్ల ముందు కూర్చుని, కాస్తంత సమయం వెచ్చించి విజయవంతంగా జరుపుకోగలం.

 

నా ఆలోచన ఏంటంటేఉత్తమ బ్లాగుల అవార్డులువివిధ అంశాలలో

 

ఇప్పుడు మనమందరం గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే….

 

పత్రికా రంగంలో అదీ ఈనాడు, కంప్యూటర్ ఎరా పత్రికలలో మన బ్లాగులు, వికీ గురించి సమగ్రమైన వ్యాసాలు వచ్చాయి. చాలా మంది తెలుగు అభిమానులకి దీని గురించి అవగాహన కలిగింది. ఇప్పుడు మనమే పూనుకుని ఇంకా ఎలా వ్యాప్తి చేయాలి అని ఆలోచించాలి. పత్రికా రంగం ఐపోయింది. టీవీ రంగం వైపు దృష్టి సారిస్తే. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ పడాలి. అప్పుడే అది సాగుతుంది. ఈటీవీ2 లో ప్రతి ఆదివారం తెలుగు వెలుగులు అనే కార్యక్రమములో మన బ్లాగులు , వికీ గురించి ఒక కార్యక్రమము వచ్చేలా చేయాలి. 

 

నాదొక ఆలోచన. వచ్చేనెల బ్లాగర్ల సమావేశానికి ప్రెస్ ని పిలిచి బ్లాగులు, యూనికోడ్, వికీ గురించి, మనం జరుపుకోదలిచిన బ్లాగర్ల రోజు గురించి ప్రకటించాలి. దీని వలన ఇంకా ఎక్కువమందికి తెలుస్తుంది. ఏమంటారు.? ఈ దిశగా ప్రయత్నాలు మొదలెట్టండి మరి.

 

ఇది హైద్రాబాదులో ఉన్న బ్లాగర్లకి సంబంధించినది కార్యక్రమము కాదు. అందరూ అన్ని దేశాలలో ఉన్నతెలుగు బ్లాగర్లందరు ఈ తెలుగు బ్లాగులు, వికీ వ్యాప్తికి కృషి చేయాలి. చేస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ ఒక చోట చేర్చండి. అన్ని ప్రదేశాలలో అందరం ఒకేసారి జరుపుకుందాం.

 

ఆ బ్లాగర్ల రోజు వీలైతే అన్ని దేశాలలో ఉన్న తెలుగుబ్లాగర్లు ఒకేసారి ఫోన్లో కాని, gtalk లో గాని ఒకేసారి సమావేశమై ముచ్చటించుకుందాం. ఇది అసాధ్యమేమీ కాదనుకుంటా.

 

ఇంతవరకు తెలుగు బ్లాగు గుంపులో చేరని కొత్త బ్లాగర్లందరు  త్వరగా చేరండి. ఈ సమిష్టి కృషిలో పాల్గొనండి. విజయవంతం చేయండి. అందరికీ ఇదే ఆహ్వానం..

 

http://groups.google.com/group/telugublog

Comments on: "" (7)

  1. మీ ఆహ్వానం బావుంది, కాని మళ్ళి – పోయి పోయి – దినాలు జరపాలంటారా ? అవల్రెడీ – తెళ్ళొళ్ళు కనిపించిన ప్రతీదానికీ “దినం” పెట్టారుగా

  2. solarflareగారు,

    మనం మనకు ’దినం’ పెట్టుకోవడంలేదు. అంత ఖర్మ పట్టలేదనుకుంటాను. ఇది మనమందరం కలిసి జరుపుకుందామన్న పండుగ. మరీ అంత నీరసమైతే ఎలాగండి.

  3. మంచి ఆలోచన. నాకు నచ్చింది. సంవత్సరంలో 365 రోజులు మరిచిపోయి, ఏదో ఒక్క రోజు అమ్మ పండగ(మదర్స్ డే), నాన్న పండగ (ఫాదర్స్ డే) చేస్తే నచ్చకపోవచ్చు కాని… సంవత్సరంలో 365 రోజులు బ్లాగుతూ ఉండే మనం…అందులో ఒక రోజును బ్లాగరుల రోజుగా జరుపుకోవటం ..చాలా ఆహ్వానించదగ్గ నిర్ణయం.

    ఉత్తమ బ్లాగు టపాలని నిర్ణయించటానికి ముద్ర (http://www.tenugublog.com/mudra) సరి అయినది.

  4. మీ ఐడియా చాలా బాగుంది నేను కూడ బ్లాగు సంఘంలో సభ్యునిగా చేరాలని కోరుకుంటున్నాను.

  5. Its a only a copied thaught.Think innovatrive.But Jyothi u r thinking for Blogers.great and carrry on

  6. ఇంత మంచి అవిడియా ఇచ్చిన ’అవిడియాల భూపతి’ మహారాజు గారికీ జై!

    ఇక ఏరోజో నిర్ణయించడానికి నా సూచనలు:
    ౧. బ్లాగులో తొలిసారి తెలుగు కనబడిన రోజు
    ౨. తెలుగుబ్లాగు గుంపు ఏర్పడిన రోజు
    ౩. తొలి తెబ్లాస జరిగిన రోజు
    వీటిలో ఏది ముందొస్తే అది. ఏమంటారు?

వ్యాఖ్యానించండి