నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మాట్లాడే బ్లాగు

ఇప్పటిదాకా అందరం బ్లాగులలో రాస్తున్నాము. చదువుతున్నాము. కాస్త విలక్షణంగా బ్లాగులను మాట్లాడిస్తే ఎలా ఉంటుంది. ఆ మధ్య కొత్తపాళిగారు  పద్యం పాడి తమ బ్లాగులో పెట్టినప్పడు  ఈ ఆలొచన వచ్చింది. నేను ప్రయత్నించా నా బ్లాగు పుట్టినరోజు టపాలో . కాని మొదటిసారిగా నా గొంతు విని నేనే జడుసుకున్నా. ఎందుకనవసరంగా అందరినీ బాధపెట్టడం అని వదిలేసా. మనలో ఎందరో గాయకులు ఉండొచ్చు. సో మంచి పాటలు, కవితలు,పద్యాలు, లేదా ఎదైనా కాని అప్పుడప్పుడు మాట్లాడి బ్లాగులో పెట్టండి. మేము చదివే బదులు వింటాం.ఇది Real Player తో చాలా ఈజీ.

 ఏవంటారు???

ప్రకటనలు

Comments on: "మాట్లాడే బ్లాగు" (7)

 1. ఏం? పాడటమే అక్కర్లేదు, మాట్లాడి ఐనా పెట్టచ్చు. నా మట్టుకి నాకు రానారె తన యీరబల్లె కతనొకదాన్ని చదివి సౌండు పెడితే వినాలని మహా కోరికగా ఉంది.
  అన్నట్టు ఒక కన్ఫెషను: చాన్నాళ్ళ క్రితం ఒక సైటులో తెలుగు కవిత్వం గురించి ఆంగ్లంలో రాస్తుండేవాణ్ణి. జనుల ప్రోద్బలం మీద కొన్ని కవితల్ని పైకి చదివి ఆడియో కూడా పెట్టాను. అది విన్న మహానుభావుడొకరు ఇలా రాశారు – “ఏవండీ, మీరు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులా? ఎందుకు కవితలు భావం లేకుండా అంత నిర్వేదంగా చదువుతారెందుకు. మీరు ప్రేమ కవిత ఐనా యుద్దం మీద కవిత ఐనా ఒకే విధంగా చదువుతున్నందుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు” :-))

 2. కందర్ప కృష్ణమోహన్ said:

  హ్హ హ్హ… భలేవారే..

  అక్కాయ్.. నాకూ సరిగ్గా ఇదే ఆలోచన వచ్చి రెండుమూడు నెలలైంది.. కానీ మైక్రోఫోన్ కొనేటంత కూడా బద్ధకం తీరనివ్వట్లేదు..

 3. మీరనేది పాడ్ కాస్టింగ్ గురించా?

 4. గురువుగారూ, కాదరయ్య కతలన్నింటిలో మీకు బాగా నచ్చినది లేదా చదవడానికి బాగా ఇబ్బంది పెట్టినది – అడగండి. జ్యోతిగారికి కృతజ్ఞతలతో …

 5. జ్యోతిగారూ! అన్నీ పెట్టకపోయినా పర్లేదు కానీ, ఒక్క పొస్టయినా ఆడియోలో పెట్టండి. మీ గొంతు వినాలనుంది. విఖ్యాతులు కదా మరి…

 6. జ్యోతి గారూ.. మీరన్నట్లు… అందరం అన్ని రకాల మాధ్యమాలని బ్లాగుల్లో పెట్టటం మంచి ఆలోచన…మొన్నీమధ్య మీరు రాసినట్లు… అత్యుత్తమ బ్లాగుల్లాగా… ఇలా మాట్లాడే బ్లాగులకి కూడా ఒక బహుమతి ప్రకటిస్తే ఉత్సాహ పరచినట్లు అవుతుంది…

  నాకు తెలిసి.. దీప్తి మామిడూరు గారి సంహితం బ్లాగు లో అన్ని టపా లూ.. మాటలాడే మాహ బాగు బ్లాగులే…. (http://samhitam.blogspot.com/)

 7. ఇప్పటికి పాడ్కాస్టు సైట్లు (మాట్లాడే బ్లాగులు) చాలానే ఉన్నాయి..అలానే వ్లాగు (దృశ్యకపు బ్లాగు, Video blog) , మొబ్లాగు (చర బ్లాగు, mobile blog ), మొవ్లాగులు (దృశ్యకపు చర బ్లాగు, Video mobile blog) కూడా రానురానూ ప్రసిద్ధి పొందుతున్నాయి .

  కానీ నాకు తెలిసినంతవరకు తెలుగులో మాత్రం ఇవేమీ లేవు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: