నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

తులసి

thulasi.jpg
నటీనటులు: వెంకటేశ్, నయనతార, జయప్రకాశ్‌రెడ్డి,శివాజి,రమ్యకృష్ణ, ఆశిశ్ విద్యార్థి, సుబ్బరాజు, ఆలీ,విజయ్ కుమార్, మాస్టర్ అతులిత్.

దర్శకుడు: బోయపాటి సీను.
పండగ సీజన్‌లో  అన్నీ ఎంటర్‌టైనర్ సినిమాలు వస్తున్నాయి. తులసి సినిమా కూడా మంచి కమర్షియల్ మసాలా మూవీ – మంచి వినోదం, విదేశీ లోకేషన్లు మొదటి సగంలో, రెండో సగంలో మొత్తం ఫాక్షన్ కు సంబంధించిన యాక్షన్ సీనులు. ప్రేమించుకుందాం రా తర్వాత వెంకటేష్ చేసిన మరో మంచి ఫాక్షన్ సినిమా ఇది.

ఇందులో వెంకటేష్ బాగానే రాణించాడు అని చెప్పొచ్చు. మొదట్లో యువకుడిగా, తర్వాత ఒక బాధ్యతాయుతమైన భర్త, తండ్రిగా, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెనుకాడని వ్యక్తిగా బాగా నటించి మంచి మార్కులు కొట్టేసాడని అనుకోవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. తులసీరాం(వెంకటేష్) ఒక ఆర్కిటెక్ట్, ఫాక్షన్ గొడవలతో నిండిన పల్నాడుకు చెందినవాడు. అందమైన వసుంధరతో(నయనతార) ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంటాడు. ఒకానొక సంఘటనతో వెంకీ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి హింసకు దిగాల్సొస్తుంది. దానికి విలన్ అతనిని చంపాలనుకుని ప్లాన్ చేస్తే  ప్రమాదవశాత్తు వసుంధర తమ్ముడు (శివాజి) చనిపోతాడు. దీనితో వసుంధర షాక్ తిని భయంతో తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది.జబ్బు పడి ఉన్న కొడుకుని కాపాడుకోవడం, తన భార్యను తిరిగి తెచ్చుకోవడమే మిగిలిన సినిమా కథ.హీరోయిన్ నయనతార ఓకె. వెంకటేష్ కొడుకుగా చేసిన మాస్టర్ అతులిత్ చాలా బాగా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఓకె.స్పెషల్ ఏమీ లేదని చెప్పొచ్చు.
వెరసి పండగ రోజులు, సెలవు రోజులు హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.  

ప్రకటనలు

Comments on: "తులసి" (3)

  1. నేను చుసాఅనండి
    పర్వాలేదు అనిపించుఇంది
    వెంకటేష్ కోడుకుగా వెసిన పిల్లవాడు బా చేసాడు.

  2. word press lo telugu lo ela typala cheppagalarani manavi

  3. సినిమా కొంతవరుకు బాగనే ఉంది కాని డైరెక్టర్ కి మతిమరుపు ఎక్కువ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: