నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పాపం పిల్లలు!!!!

       children.jpg 

వరూధినిగారి బ్లాగులో పిల్లలు సెలవుల గురించి చదివిన తర్వాత ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఈరోజుల్లో పిల్లలు కూలీలకంటే అధ్వాన్నంగా ఉన్నారు. ఎప్పుడూ చదువు చదువు. అసలు ఈ చదువులు, పోటీ పరీక్షలు పిల్లలను మరమనుష్యులుగా చేస్తున్నాయి. ఒక ఆటలేదు, పాటలేదు.సెలవులు ఉన్నా అంతకంటే ఎక్కువ వర్క్ ఇస్తారు.ఇంతగా కష్టపడడం అవసరమా అంటే అవునూ అనలేమూ వద్దూ అనలేమూ. పిల్లలను మీకు వచ్చినంత చదువు అంటే క్లాసులో వెనకపడిపోతాడు , పెద్దపెద్ద చదువులు చదవాలంటే వీలు కాదు అని చదవమని వాళ్ళ వెనకాల పడటం తప్పటంలేదు. ఈరోజుల్లో పిల్లలతో పాటూ తల్లితండ్రులు కూడా కష్టపడక తప్పటంలేదు.
నేను చదువుకునేటప్పుడు ఐతే ఇన్ని కష్టాలు లేవు బాబు. హాయిగా చదువుకుంటూ, ఆటలపోటీలు, డ్యాన్సులు, పాటలపోటీలు అన్నీ చేసేవాళ్ళము. అప్పుడూ కూడా ఈ పుస్తకాల మోతకోలు ఉండేది. క్లాస్‌వర్క్, హోంవర్క్ నోట్సులు, అస్సైన్‌మెంట్లు, మంత్లీ టెస్టులు, ఉండేవి. ఐనా వారంలో రెండు రోజులు గేమ్‌స్.  అప్పుడప్పుడు పోటీలు. ఇప్పుడు పిల్లలకైతే అస్సలు గేమ్‌స్ పీరియడ్ అంటే తెలీటంలేదేమో. ఇంటర్ తర్వాత తీసుకునే IIT కోచింగ్ ఈ రోజు ఎనిమిదవ తరగతి నుండే ఇస్తున్నారు. అది అవసరమా పిల్లలకు. రోజులో సుమారు పన్నెండు గంటలు స్కూలులోనే. వేలకువేల ఫీజులు. వాళ్ళను తీసికెళ్ళి తీసుకురావడం మన డ్యూటీ.అప్పుడైతే 60% పైన మార్కులొస్తే ఆహా ఒహో అనేవారు. 70% దాటితే డిస్టింక్షన్.  ఇప్పుడు 95% దాటితేనే కాస్త మర్యాదగా ఉంటుంది. ప్చ్. ఏంటో.. మన పిల్లలకు చదివించి, కష్టపడ్డదాంట్లో సగమైనా మనం అప్పుడు పడి ఉంటే ఇంకా ఎన్ని డిగ్రీలూ ఉండేవో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నర్సరీనుండి ప్రారంభమైనా ఈ పరుగు ఉద్యోగం వచ్చినా ఆగదేమో…..మరి ఈ పిల్లలు తమ బాల్యాన్ని ఎలా అనుభవించేది. మేమైతే పరీక్షలైపోయి సెలవులు ఇస్తే నాలుగు రోజులు కాగానే బోర్ కొట్టేది. ఏం చేయాలో తోచేది కాదు. స్కూలు తెరిస్తే కాని కొత్త పుస్తకాలు ఉండవు చదువుకోవడానికి. ఏంటో ఈ చదువులు?? 

ప్రకటనలు

Comments on: "పాపం పిల్లలు!!!!" (4)

 1. జ్యోతి,
  ఈ విషయం పై నాకూ టపా రాసేంత ఆవేశం ఉంది.
  ఇందులో మనం అందరం భాగస్వాములమే.
  కారణం భయం. ఇంజనీరో డాక్టరో కాకపోతే ఇంకేమీ పనికి రాదనే భయం
  పరువు పోతుందనే భయం. ఇంక వేరే options తెలియలేనితనం.
  ఇక్కడ కూడా వెంటనే కనిపించదు కానీ పోటీ చాలా ఉంటుంది. అయితే జనాభా తక్కువ. ఇక్కడ ఆసియా వాళ్ళూ (అంటే దేశీలు, చైనా దేశీయులు) మా దగ్గర అయితే ఈ పటికే ఇన్ని నేర్పించేశ్తారు, అని ఇంట్లోనే లేడా “కుమోన్” తరగతుల్లోనో వేసేసి నేర్పించెయ్యాలని చూస్తుంటారు. అదీ కుదరక పోతే ముఖ్యంగా తెలుగు వారు పిల్లలను ఇండియాలో పెద్ద వారి దగ్గర ఉంచి అక్కడ బడిలో మూడేళ్ళకే చేర్పించేసి నేర్పించెయ్య్యాలనుకుంటారు.
  ఇక మేము ఇళ్ళు కొనేందుకు చూస్తుంటే ఒక realtor ఆ development గురించి చెప్తూ ఇక్కడే ఒక ప్రైవేటు బడి ఉంది. అక్కడ చేరితే తప్పని సరిగా ivy కాలేజీలే అని advertisemnent. ప్రైవేటు పాఠశాల అంటే బోలెడు ఖర్చు. ఇప్పట్నుంచే ఇంత పెడితే రేపు స్కాలర్షిప్పు రాకుంటే మళ్ళీ కాలేజీ ఫీజులు తడిసి మోపెడు అవుతాయే ఎలా అని ఇంకో ఆలోచన. అలా ప్రైవేటు బడిలో చేర్పించినా, ఆ బడికి తగ్గట్టు లేరనిపిస్తే ఎప్పుడైనా యాజమాన్యం వారు తీసెయ్యొచ్చు.
  నాకు తెలిసిన ఒకరు రెండేళ్ళకే అక్షరాలు దిద్దించేసి, నాలుగేళ్ళకే 3 digit addition నేర్పించేసి, అయినా ఇంకా ఏమో తక్కువ చేస్తున్నామనుకుంటారు. అమ్మో పోటీ!
  ఎక్కడైనా కాని, ఇక్కడ మాత్రం స్నేహం, బంధుత్వం కన్నా పోటీలే ఎక్కువ ఉంటాయి.
  ఎందుకిలా? ఎంతమంది ఎన్ని చోట్ల చేరినా ఎన్ని సీట్లు ఉంటాయి? ఎంతమంది విజేతలుంటారు? ఏం సాధిస్తున్నాము? ఎనిమిదో తరగతి నుండే IIT coachinG, దానికి entrance, దానికి coaching…. ఎటు వైపు వెళ్తునాము? ఇలా చేసి ఆ పిల్లాడూ inter కొచ్చి నేను చదవను పో అని మొండికేస్తే వాడ్ని తిట్టడమూ.

 2. చదువు పద్యమందు చాలదా ఓక్కటి

 3. జ్యోతి,

  మీ ఆవేదన నిజం. అందుకే మా పిల్లలమీద అటువంటి భారం పడకుండా చూసుకుంటున్నాను. పిల్లల్లని పిల్లలుగా చూస్తూ వారి బాల్యానికి ఈమాత్రమూ భంగం కలగకుండా చూస్తున్నాను. రాంకులు రావాలనీ ఎప్పుడూ అనను – కాకపోతే మొదటి శ్రేణిలొ వుండమని అప్పుడప్పుడు అంటుంటాను. చదువులో కాకపోయినా తమ కిష్టమయిన ఏదో ఒక రంగంలో మొదటగా వుండాలని ప్రోత్సహిస్తుంటాను. మీరు చెప్పిన కారణాల వల్లనే మా పిల్లలని ఇండియాలో ఏ మాత్రమూ చదివించలేదు. కొద్ది నెలల క్రితం ప్రయోగాత్మకంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ హైదరబాదులో చేర్పిస్తే అక్కడా అలాగే ఏడ్చింది చదువు రుద్దుడు. ఆ చదువులు చదవలేమంటే పిల్ల్లల పరిస్థితి అర్ధమయ్యి మళ్ళీ యు ఎస్ కి వచ్చాము. ఇక్కడి చదువులు హాయిగా వున్నాయి. మిగతా దేశీలలాగా ఇక్కడ కూడా ర్యాంకులు పెట్టాలని నేను నస పెట్టను కాబట్టి వారికి ఇంకా హాయిగా వుంది. రచయిత చలం అయితే చదువెందుకు అంటాడు – ఏ సంగీతం లాగానో ఇష్టమయిన వాళ్ళే చదువుకోవాలంటాడు.

  ర్యాంకులకంటే వాల్ల బాల్యమే ప్రధానమయినది మనం గుర్తించాలి.

  శరత్

 4. అవన్నీ ఉన్నా పట్టించుకోకుండా టీచర్లచే దెబ్బలుతినే నాలాంటి మొద్దుపిల్లలూ ఉంటారు !! 😉

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: