నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

నవ్వుల కరువు

                              att124506.gif

దురదృష్టవశాత్తు గంభీరంగా ఉండడమే పెద్దరికం అన్న అపోహ సమాజంలో పాతుకుపోయింది. అందుకే చాలామంది వివిధ సందర్భాల్లో అవసరం లేకపోయినా కష్టపడి మరీ మేకపోతు గాంభీర్యాన్ని , కప్పుకుని తామెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఫోజులు ఇస్తుంటారు. నిజమే…. గాంభీర్యం మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింపచేస్తుంది. అవసరం అయిన సంధర్భాల్లో అధికప్రసంగం లేకుండా గంభీరంగా ఉండడం ఎంతో శ్రేయస్కరం కూడా!  అయితే దానిని ప్రదర్సించవలసింది కొద్ది సందర్భాల్లో మాత్రమే . అంతే తప్ప, ఏవో కొంపలు మునిగిపోయినట్లు కన్పించిన ప్రతీ వ్యక్తి వద్దా…. చిరునవ్వు చిందిస్తే ఎక్కడ తాము చిన్నచూపు చూడబడతామోనని ఆముదం తాగిన మొహం పెడుతూ హావభావాల్లోనే పలకరింపులు జరపడం పెద్ద అవలక్షణం! నలుగురిలో కడుపుబ్బ నవ్వడానికి కూడా సందేహించేలా మన మనసుల్ని మనం  నియంత్రించుకుంటున్నాం. కడుపుబ్బ నవ్వడంనవ్వించడం కూడా ఓ అదృష్టమే. గాంభీర్యం చిరునవ్వుని హరిస్తోంది. మీరు మనసారా నవ్వుకుని ఎన్నాళ్ళైంది??

 

 

ఎలాంటి హిపోక్రసీలు లేకుండా, స్థాయిబేధాలు లేకుండా నవ్వొచ్చే సందర్భాల్లో చిరునవ్వులు చిందించగలగడం  ఓ అదృష్టం. మనమూ నవ్వుతాం.. ఎప్పుడంటే.. నవ్వితే ఎదైనా లాభం ఉంటుందనుకున్నప్పుడు బలవంతాన మొహంపై నవ్వు పులుముకుంటాం. ఎదుటి వ్యక్తి వైఫల్యాలను విన్నప్పుడూ పరోక్షంగా నవ్వుకుంటాం. ఇలాంటి కల్మషం ద్వారా లభించే పైశాచిక ఆనందమే మనకు హాస్యచతురతగా కన్పిస్తుంది. నేటి సినిమాల్లోనూ అంగవైకల్యాలను, అవలక్షణాలను హాస్యంగా చూపిస్తున్నారే తప్ప ఏ వర్గాన్ని బాధించని నిష్కల్మషమైన హస్యం కరువైపోయింది.  ఎలాంటి బేషజాలూ లేని స్వచ్చమైన నవ్వు మనసుని ఆహ్లాద పరుస్తుంది. అలాంటి నవ్వులను దూరం చేసుకుంటే మనం జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్నట్లే.  డబ్బు, ఆస్తులు, కార్లు ఇచ్చే ఆనందం ఎన్నటికీ నాకింతే చాలుఅనే సంతృప్తిని  ఇవ్వదు. .. వాటిని సంపాదించే యావతో అవేవీ ఇవ్వని అనిర్వచనీయమైన ఆనందాలను, చిరునవ్వులను మన మొహాల నుండి శాశ్వతంగా దూరం చేసుకుంటున్నామంటే మనల్ని మనం బండరాళ్ళుగా మల్చుకుంటున్నట్టే.

…………………………………………………………………………………………………………………………………………

నల్లమోతు శ్రీధర్ తన పత్రిక కంప్యూటర్ ఎరా లో ప్రతి నెలా రాసే సంపాదకీయాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎదురయ్యే ఆలోచనలే . అందుకే అతని అనుమతి అడగకుండానే పాత పత్రికలనుండి రాస్తున్నాను.

ప్రకటనలు

Comments on: "నవ్వుల కరువు" (7)

 1. I was amazed, when I started reading this post, because of the unexpected quality!
  In the last you said this is from some other source. Good one! Pls post more from other sources.

 2. Read the last setence as “Please post more.” instead of “Pls post more from other sources.”

 3. బాగుంది. శ్రీధర్ కి అభినందనలు

 4. మా నాన్న అమెరికాకి వచ్చి కొన్నిరోజులు ఉన్నప్పుడు అన్న మాటలు గుర్తుకువచ్చాయి – “నేను కనబడితే చిరునవ్వో, గుడ్ మాణింగో చెప్తారు ఇక్కడ. ఇండియాలో మన వాళ్ళు నవ్వితే ఎక్కడ లోకువవుతామో అన్నట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు” అని. అది నిజమే.

  కాకపోతే ఇక్కడకి వచ్చికొన్నిరోజులు ఉన్న భారతీయులుకూడా పలకరింపు నవ్వులు చిందించడం మొదలుపెడతారు. ఆ నవ్వు మధ్య మధ్యలో ఇండియాకి సెలవలికి వెళ్ళినప్పుడు తప్ప వసివాడవు 🙂

 5. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం” అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.

 6. బాగుందండి

  జ్యోతిగారికి,
  శ్రీధర్ కు

  అభినందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: