నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

వామ్మో!! ఏం దోపిడి!!!

నాకు రెండు నెలల క్రిందట హిందూ పేపర్లో వంటలపోటీలో  బహుమతి వచ్చిందిగా వెయ్యి రూపాయలది. అది తెచ్చుకుందామని 24 Letter Mantra ఆర్గానిక్ షాపుకి వెళ్ళాను మా అమ్మాయితో కలిసి. పెద్ద సూపర్ మార్కెట్. అందులో పనిచేసేవాళ్ళు తప్ప ఎవరూ లేరు. సరే ఎమేమున్నాయో చూసుకుంటూ వెళితే. నా గుండె లయ పెరిగిపోయింది. అలా ఉన్నాయి ధరలు. మనం వాడే ప్రతి సరుకు అర్గానిక్ అని పేరు పెట్టి నాలుగింతల ధర.అమ్మబాబోయ్!! ఇదేం దోపిడిరా అని ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను. ఎలాగూ మనది ఉచిత కొనుగోలు కదా అని ధైర్యం చేసాం. వెయ్యి రూపాయలు చాలా సరుకులు తీసుకోవాలని కొన్ని తీసుకుంటే అవే 1500 అయ్యాయి. మొత్తం కలిపి పదిహేను ఐటమ్స్ లేవు. సరే అని కొన్ని తీసేసి బిల్లు వెయ్యికి దించేసి చిన్న క్యారీ బాగులో తెచ్చుకున్నాం ఆ సరుకులు. పట్టుమని పది వస్తువులు లేవు.

ఇలా ఎక్కువ ధరలు పెట్టడమెందుకో, అలా ఖాళీగా కూర్చోడమెందుకో. కనీసం అద్దె, జీతాలైనా మిగులుతాయో లేదో నా అనుమానం. ఈ ఆర్గానిక్ ఆహారం ఏమిటో అని ఇంటికొచ్చి పుస్తకాలు వెతికితే తెలిసింది. ఎరువులు, రసాయనాలు లేకుండా స్వచ్చంగా పండీంచినవి అని. అసలు వాతావరణం కాలుష్యం, మనుష్యుల  మనసులే కాలుష్యం ఆవరించి ఉంటే ఈ స్వచ్చమైన ఆహారాన్ని నాలుగింతల ధరలు పెట్టి తమని తాము రక్షించుకుందామనుకుంటున్నారా ఇవి తినే పెద్దమనుషులు.

కొన్ని ధరలు చూడండి. మనం ఇంటి దగ్గర దుకాణంలోగాని, సూపర్ మార్కెట్‌లో గాని దీని ధరలు ఎలా ఉన్నాయి,తేడా చూడండీ.  

దాల్చిన కప్ కేకులు – 5  –    65 – 00
హెర్బల్ సబ్బు         75 gm  – 55 – 00
నల్ల కారం పొడి        100gm   – 30 – 00
బాదాం                  100gm  – 84 – 00
మిక్స్‌డ్ ఫ్రూట్ జాం     200gm  – 119 – 00
జీడిపప్పు                100gm  – 110 – 00 
అల్లం వెల్లుల్లి            200gm  – 44 – 00
పిస్తా                      100gm  – 89 – 00                  

ప్రకటనలు

Comments on: "వామ్మో!! ఏం దోపిడి!!!" (6)

 1. కనీసం జంతు ఉత్పత్తులైనా ఆర్గానిక్ వి తినటం శ్రేయష్కరం. కోళ్ళను బాగా గుడ్లు పెట్టించడానికి, బర్రెలు బాగా పాలివ్వటానికి, బ్రాయిలర్ కోళ్ళు విపరీతంగా బలవటానికి హార్మోన్లు ఇస్తుంటారు వాటికి. అవి మన ఆరోగ్యానికి అంతమంచివి కావు.

 2. రవి చెప్పినట్టు అవే కాదు, ఆకు కూరలు, కూరగాయలు కూడా. అవును మరి ఖరీదులు కోంచెం ఎక్కువే. ఎటొచ్చీ మీరు చెప్పిన షాపు చూస్తే జనాలకి ఆర్గానిక్ పేరు చెప్ప్ టోపీ వేసే వ్యవహారం లాగానే ఉంది.

 3. మీరు చెప్పినట్టు ఆర్గానిక్ ఫుడ్ సంగతి సరే, మరి రసాయనాల ఫుడ్ తింటే వచ్చే రోగాలతో డాక్టర్ దగ్గరికి వెళితే ఎంతు ఖర్చు చేయాలో ఆలోచించండి. పైగా ఆ రోగాలతో మనం పడే బాధలొకటి.
  ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఇక్కడ మీరు సూచించిన ధరలు మరీ ఎక్కువగానే వున్నాయి.

 4. ఇందులో దోపిడీ ఉందో లేదొ నేను చెప్పలేను కానీ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు “24 letter mantra” నుంది దాదాపు ప్రతీ నెలా సరకులు తెచ్చుకునే వాన్ని. మొదట్లో తినడానికి అంత రుచిగ ఉండకపోయినా, (ముఖ్యంగా బియ్యం) నెమ్మదిగా అందులో రుచి,శుచీ తెలిసి వచ్చాయి. పైగా అరోగ్యంగా ఉన్న అనుభవం. ఇతరత్రా వస్తువులు కూడా బావుంటాయి. సబ్బులు కూడా వాడుకోవడానికి చాలా బావుంటాయి.

  ధర ఎక్కువ అన్న విషయం మాత్రం నిజమే. పిండి కొద్దీ రొట్టె మరి. పిట్జాలు, బర్గర్ల ధరలతో పోలిస్తే నాకు ఇక్కడి సరకులు చవకగానే అనిపిస్తాయి.

  ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాల కోసం నేను తప్పనిసరిగా ఈ షాపును సూచిస్తాను.

  ప్రసాదం

 5. ప్రసాద్ గారు, మీరు చెప్పింది నిజమే . కాని ఇంతింత ధరలు పెడితే సామాన్య జనం వస్తారా ఆ దరిదాపులకైనా. మూడింతలు,నాలుగింతల ధరలా. మామూలు సూపర్‍మార్కెట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటే ఓ.కె. నేను ఉసిరికాయ పచ్చడి కొన్నా.250 gm సీసా 89 రూపాయలు. అదే ప్రియాదైతే కిలో 120 రూపాయలు. ఈ పచ్చడి అస్సలు బాలేదు. క్రితం సంవత్సరం లాగా ఉండి రుచి, దాని అవతారం కూడా. ఇక జీడిపప్పైతే నాణ్యమైన ఒకటో రకం కూడా కాదు.ఇంట్లో చేసుకుంటే పదిహేను రూపాయలు , వేరే కంపెనీదైతే 40 రూపాయలు దాటని జాం ఇక్కడ 110 రూపాయలు. ఇది దోపిడి కాక మరేంటి. ఐనా బర్గర్లు, పిజ్జాలు రోజు తినలేము కదా. అప్పుడప్పుడూ కాబట్టి ధర పెట్టొచ్చు.

 6. Dear Jyothi garu,

  Just now I have seen your post though it is posted long back. I am a blogs follower just to enjoy my self.

  Just wanted to clarify about organic food and its prices. You know when farmers grow the crops organically with out using chemical pesticides and fertilizers; first three years crop yield reduce to 60%. This is the major reason for the heavy prices for organic produces. Also, all the organic produces to be certified by external certification agencies under the standards enforced by APEDA (Central Government Agency). These certification agencies charge exhorbitant fee for the certification process.

  Basically, markets for organic produces not developed in India except few stores like 24 letter mantra, shreshta etc. India is catering the Europian and US organic markets.

  This is just to provide some information to you as I know some thing being an employee of a Organic Cotton Program in India.

  Thanks and regards,

  Rama Krishna.

  This is just

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: