నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

మానసిక కాలుష్యం..

seaballycotton.jpg

 తుఫాను సమయంలో కారుమేఘాలు వడివడిగా పరుగిడే మాదిరిగా నాభి నుండి ఉద్భవించే మన ఆలోచనా తరంగాలు మనసు పొరలపై కామక్రోధాదులనే అరిషడ్వర్గాలను వర్షిస్తూ సాగిపోతుంటాయి. ప్రతీ ఆలోచన మనసుపై తనదైన ముద్ర మిగుల్చుతూ పోతుంది. ప్రస్తుతపు ఆలోచన కన్నా బలీయమైన, మనసుకు ఇంపైన అలోచన ప్రస్తుతపు ఆలోచనని హరించి మనసులో తాత్కాలికంగా ఆవరించుకుంటుంది. మన ఆలోచనలు మంచివైనా, చెడ్డవైనా మన బుద్ధిని అనుసరించే అవి నిర్ధిష్ట రూపం సంతరించుకుంటాయి. ప్రశాంతతను, హాయిని ఇచ్చే ఆలోచనాలను మాత్రమే మనసు కోరుకుంటుంటుంది. అయితే నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, అవమానాలు, భయాలు, అభద్రతాభావం, మనసుని అల్లకల్లోలం చేసే నెగిటివ్ ఆలోచనలను ఉసిగొలుపుతాయి. మనం ఎదుర్కొనే సంఘటనలకు ప్రతిస్పందనగా ఇబ్బడిముబ్బడిగా ఆలోచనలు ముప్పిరిగొంటుంటాయి

అయితే అవి కామక్రోధాదులనే మానవ బలహీనతలను మనస్సుపై వర్షించకుండా జాగ్రత్త వహించవలసిన బాధ్యత మన ఇచ్చదే ! ఒక్కసారి ఇలాంటి బలహీనతలు మనస్సుపై ఆధిపత్యం సాధిస్తే… మన ఆలోచనలు కూడా ఈ బలహీనతలను ప్రేరేపించే విధంగానే ఉద్భవించడం ప్రారంభిస్తాయి. దీంతో మానసిక కాలుష్యం కమ్ముకుంటుంది. మనస్సు అల్లకల్లోలం అవుతుంది. అప్పటివరకూ ఆనందం అనిపించింది ఏదీ సంతృప్తిని ఇవ్వదు. నిశ్చలంగా మెలగవలసిన మనస్సనే దీపం అస్థిమితంగా కొట్టుకుంటుంది. ధనం, ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే దురాశ, అన్నీ తెలుసునన్న అహంకారం, మనల్ని మనం సంస్కరించుకోవలసింది పోయి ఇతరుల విషయాలపై అమితాసక్తి, జన్మసంస్కారం లేకపోవడంవల్ల చేసే చర్యలు, కోరికలకు పగ్గాలు వేయలేకపోవడం వంటివన్నీ మన మనసుల్ని అస్థిమితపరుస్తూనే ఉంటాయి. మానసిక కాలుష్యం తొలగించుకోకుండా మనం మంచి మాటలు వల్లెవేసినా, మంచితనపు ముసుగుని కప్పుకున్నా నిష్ప్రయోజనమే స్థిమితమైన మనసుకి భావోద్వేగాలు అంటవు. అయితే అన్ని కాలుష్యాలూ తొలగించుకుని స్థిమితంగా ఉండాలన్న సంకల్పమే మనకు రుచించదు. మత్స్యకారుడికి నీచు వాసనే ఇంపైనట్లు కొందరికి మానసిక కాలుష్యమే సుగంధభరితం!! 

Comments on: "మానసిక కాలుష్యం.." (2)

  1. నల్లమోతు శ్రీధర్ said:

    అనారోగ్యం మూలంగా దాదాపు కోలుకోలేనంత డిప్రెషన్ లో కూరుకుపోయే సమయంలో ఒకవైపు నా విజ్ఞత నేనెంత ఊబిలోకి వెళుతున్నానో హెచ్చరిస్తుంటే నా మనసుని నేను విశ్లేషించుకుంటూ నన్ను నేను స్థిమితపరుచుకుంటూ రాసిన సంపాదకీయం ఇది. అనారోగ్యం నా మనసుని ప్రభావితం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఎందుకు అస్థిమితంగా ఉంటున్నారు అన్న విశ్లేషణకు లభించిన సమాధానమే సంపాదకీయంలోని చివరి వాఖ్యాలు.

    – నల్లమోతు శ్రీధర్

  2. Excellent analysis!
    Your lifestory is totally inspiring.
    All the best!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: