నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఔరా పిల్లలు !!!!

ఈ రోజుల్లో పిల్లలు చెడిపోతున్నారని చాలామంది అనుకుంటున్నారు. చూస్తున్నాము కూడా. కాని మా పిల్లలతో జరిగిన ఒక సంఘటన తలుచుకుంటే నాకు ఆశ్చర్యమెస్తుంది. ఔరా నేటి తరం ఎంతా ఎదిగిపోయింది అని.

కొన్ని రోజుల క్రింద ఒక ఇంటర్వ్యూ ప్రశ్న అడిగా మా పిల్లలిద్దరిని.

ఒక చల్లని సాయంత్రం రమేష్ తన బైక్‌పై వెళుతున్నాడు . అలా వెళుతుండగా ఒక బస్‌స్టాపులో  ఒక ముసలావిడ జ్వరంతో ఉంది, అతని గర్ల్‌ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ సతీష్ ఉన్నారు. అప్పుడూ రమేష్ ఏం చేయాలి?? అందరినీ సంతోషపరచాలి ..ఆ రమేష్ స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావ్??

అసలు సమాధానం ఐతే అతను బైకును తన ఫ్రెండ్‌కిచ్చి ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్ళమని అతను అక్కడే తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తాడు.

మా అమ్మాయి మాత్రం ఇదే సమాధానం  చెప్పింది. కాని మా అబ్బాయి ఏమన్నాడో తెలుసా.తనే ఆ ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్తానని. నేనడిగా  అలా ఐతే నీ గర్ల్‌ఫ్రెండ్,బెస్ట్ ఫ్రెండ్‌కి న్యాయం చేయట్లేదు కదా.బైకు సతీష్‌కిచ్చి ముసలావిడను ఆసుపత్రికి తీసికెళ్ళమని, హాయిగా గర్ల్‌ఫ్రెండ్‌తో ముచ్చట్లేసుకోవచ్చుగా. వాడంటాడు. “తొక్కల గర్ల్‌ఫ్రెండ్!! ముందు ఆ ముసలావిడ ఆరోగ్యం ముఖ్యం కదా.ఐనా నా క్లోజ్ ఫ్రెండ్ ఐనంత మాత్రాన నా బైక్క్ ఇచ్చి వెళ్ళమంటే వాడు ఆ ముసలావిడను తీసికెళ్ళకుంటే, నా బైక్ తీసుకుని ఊరంతా తిరిగి మళ్ళీ రాకుంటే. సో నేను అలా చేయను. ఐనా ఈ అమ్మాయిలకు అంత ఇంపార్టెన్స్  ఎందుకివ్వాలి అంటాడు వెధవ. ఒక సంగతి చెప్పనా… అందరు అమ్మాయిలు అబ్బాయిలతో ఖర్చు పెట్టిస్తే , మావాడు మాత్రం అమ్మాయిలనే ముంచేస్తాడు. వాళ్ళనే ఖర్చు పెట్టించి. కాలేజిలో ఐనా, ఇప్పుడు  ఉద్యోగంలో ఐనా!! ఏం చేయను వాడితో??? 

బాగుపడతాడా??  

Comments on: "ఔరా పిల్లలు !!!!" (9)

 1. మీ వాడే రైటు. నిజమైన గాలు ప్రెండు మీ వాడు ఆ ముసలావిడని అలా తీసుకెల్లినా బాధ పడదు సరిగదా, సంతోషిస్తుంది. చిన్న చిన్న విషయాలకే విరిగిపోయే అద్దాలను ఎవరు వాడుతారండీ…మనకు కాస్త బెల్జియం క్వాలిటీ అద్దాలు అవసరం…గాలు ఫ్రెండు విషయంలో మాత్రం.

 2. ఘటికుడే మీ అబ్బాయి. తన అభిప్రాయన్ని తప్పైనా, ఒప్పైనా టక్కున చెప్పేసాడు.

 3. “Baagupadathaada??” adigaaru choodandi chivarlo…
  Samaadhaanam mee post lone vundi, already baagu paddadu.. marintha chinthinchakandi..

  Practical gaa vunnadu mee pilla vedhava (sorry, muddu gaa anna lendi). Alage life ni practical gaa teesununi noorellu haayigaa bathakamanandi…

  Edi eamanna meeru santhoshinchaalsina vishayam..

 4. శెభాష్ కృష్ణ చైతన్య, సుధాకర్ గారి అభిప్రాయమే నాదీనూ, అయినా ఒకరి వెంట మనమెల్లడమేంటి?? అమ్మాయిల (ఇక్కడ గర్ల్స్ ఫ్రెండ్స్ అని మాత్రమే చదువుకోవాలి) మీద ఖర్చు పెట్టడమంత దండగమారి వ్యవహారం ఇంకోటుండదు. (అనుభవజ్ఞానం)

 5. ఇంతకీ మీ abbayi వయసెంతో చెప్పలేదు..

 6. దిన్నిపాటి said:

  ఓరి పిడుగా ఈ వయస్సులోనే ఎంత పరిణితి? నాకు బండిలొ పెట్రోల్ టాంక్, పర్స్ లో రూపాయలు ఖాలీ అయిన సందర్భాలు గుర్తొస్తున్నాయ్..

 7. మావాడు చెడిపోయే అవకాశమున్న వయసులో ఉన్నాడు. 22…వాడు అమ్మాయిలతో ఎప్పుడూ మాట్లాడతాడు, సాయం చేస్తాడు కాని ఇలా తిరగడాలు, ఖర్చు పెట్టడాలు,లైన్లేయడాలూ నచ్చవు. వాడి ఫ్రెండ్స్ చాలా మంది ఇదేపని. ఐనా ఈరోజుల్లో అబ్బాయిలే అమ్మాయిలనుండి జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాని అది సరైన సమాధానం కాదని చెప్పినా తన అభిప్రాయాన్ని మార్చుకోడూ, ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగినా ఇదే చెప్తా అంటాడూ.అది నాకు నచ్చింది..

 8. అడక్కుండానే లిఫ్టిస్తా–తొక్కలో అమ్మాయిలకు మాత్రం కాదు.

 9. Pavani, lavanya, mallika garlu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

టాగు మేఘం

%d bloggers like this: