నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for the ‘కవితలు’ Category

గోదావరి…

నిన్న నా పాత పుస్తకాలు అన్ని సర్దుతూ ఉంటే పాతికేళ్ళ క్రింద ఒక వార పత్రిక నుండి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ పాట దొరికింది… నా బ్లాగులో పెట్టేసి దాచుకుంటూ మీ అందరితో పంచుకుంటున్నాను…… 

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

గోదావరీ దేవి గుండె జలజలలాడా

అదగొని మనసు కదలాడి జాలి

పొదులో పెల్లగిలి పూడి కిన్నెరా

గేదంగి తెల్ల రేకెత్తు క్రొత్తరగలలో

చాదుకొని పెనుతరంగ లూగే వాగు

నాదుగొన యామెవగ సాగే

 

గోదావరి జాలి గుండె గూడులు కదలి

సాదు కిన్నెర కెదురుపోయీ.. ఆమె

లోదిగులు తరగ చేదోయీవారించి

అదరముచే నామె నదిమి గౌగిట బూని

ఏది నీ మొగము నా తల్లీఅన్నదీ

నీ దిగులు నికమాను చెల్లీ

 

గోదావరి పేదగుండె లోతులు కలగి

రాదగ్గరకు రమ్ము తల్లీ ఎంత

సాదువే నా ముద్దు చెల్లీనీ వెన్ని

రాదగని కష్టాల రాశి మ్రగ్గితినమ్మ

నీదు పతి శిలరూపు పొందీ .. నీవేమో

ఓదె వనవాగుగా చిందీ

గోదావరీ జాలిగుండె ప్రేగులు తడిసి

నీ దుఃఖమెంతదో తల్లి నిన్ను

నాదరువుగా నమ్ము చెల్లి నిను చూచి

పేదలై, లోకాలు పెద్దలై యేలేటి

జొదులే, మతి చెడిరి తల్లి నీ యేడ్పు

రోదసిని నిండినది చెల్లీ

 

గోదావరీ యెడద కోసలను కోతపడి రా దగ్గరకు రమ్ము తల్లీ

జోదింక నిను కనడు చెల్లీ.. నా తల్లి

నాదు గర్భమున నిన్నాదుకుని ఉంటాను

నీదు నెగులును పోవచూడూ . కడలి

నీదు జోలికి నింక రాడూ

గోదావరీ దేవి కొస మనసులో వొరసి

ఏది నీ యొడలు నా తల్లీ చేర్చు

నాదు కౌగింటిలో చెల్లీ …. తల్లి నీ

లే దలిరు కెరటాలు చెల్లీ .. తల్లి నీ

లే దలిరు కెరటాలు నాదు కాల్వల నింతు

నీదు బొట్టును కడలి కనడూ నా తల్లి

నీదు సంగతి కడలి వినడూ

గోదావరీ మహా కూలంకషామృత

శ్రీదివ్య మధుతరంగాలూ.. చిన్న

సాదు కిన్నెర తరంగాలూ .. కలిసికొని

ప్రొదిగొను గంగా సరస్వతుల నీరములు

చాదుకొను తళుకు లురలించి .. చూడగా

సైదోడుతనము  మెరిపించె

 

 

విశ్వనాధ సత్యనారాయణ

కిన్నెరసాని పాటలనుండి….

 

అల్లరి

వై ఎస్       చేసేది         ‘ వాగ్ధానాల ‘      అల్లరి

బాబు        చేసేది         ‘ విమర్శలా        అల్లరి

కె సి ఆర్    చేసేది         ‘ తెలంగాణ ‘      అల్లరి

క్రికెటర్లు      చేసేది         ‘ పరుగుల ‘       అల్లరి

దాక్టర్లు       చేసేది         ‘ కాసుల ‘         అల్లరి

లాయర్లు     చేసేది         ‘ కేసుల ‘          అల్లరి

కండక్టరు     చేసేది         ‘ చిల్లర ‘            అల్లరి

ప్రియుడు     చేసేది         ‘ వలపు ‘          అల్లరి

ప్రియురాలు  చేసేది         ‘ చిలిపి ‘         అల్లరి

సిన్మాలు      చేసేది         ‘ చిత్రమైన ‘     అల్లరి

విద్యార్తులు  చేసేది         ‘ విచిత్ర ‘        అల్లరి

నీమాత్రం     చేసేది           ‘ ఎప్పుడూ ‘         అల్లరి 

   
 

మేరా డాలర్ $ మహాన్

ఆడ మగ పిల్లలందరు అమెరికాకు ఎగబడుతున్న ఈ సమయంలో వృద్ద తల్లిదండ్రుల మనోభావాలు

కంప్యూటర్ ఓ కంప్యూటర్ !

విడిపోతున్న బంధాలతో

వీడియో చాటింగులా ?

మమతతో స్పృశించాల్సిన వేళ్ళకు

మౌస్-కీ బోర్డులా?

కాటుక పెట్టాల్సిన కళ్ళకు

కాంటాక్టు లెన్సులా ?

పెసరట్టు దోశలను వదలి

పిజ్జా, ఫాస్త్ ఫుడ్సా ?

భావోద్వెగంతో నిండాల్సిన గుండెలకు

బ్రౌజింగ్ ఎంక్లేవులా?

ఒడిలో సేద తీరాల్సిన మాకు

ఓల్డేజి హోములా

కంప్యూటర్ ఓ కంప్యూటర్

నేటి కవిత

 • ట్యూబులైటు వెలుగు తెల్లగనుండు
  కలర్ టీవీ చూస్తే హాయిగ నుండు
  ఎయిర్ కండీషన్ చల్లగనుండు
  గీజర్ నీరు వెచ్చగనుండు
  బల్బులు చూడ వెలుగుచునుండు
  కరెంటు బిల్లు చూస్తే
  కళ్ళు తిరుగుచునుండు

టాగు మేఘం