నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అదేంటో గాని

అదేంటో గాని తెలుగు సినిమాలలో దర్శకుని పేరు ఆఖరున వేస్తారు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో సర్వసాధరణంగా విలన్ కూతుర్నే ప్రేమిస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరోయిన్ ప్రమాదంలో ఉండగా ఎక్కడినుంచి

 ఊడిపడతాడో తెలీదు కాని హీరో వచ్చేస్తాడు, ఫైట్స్ చేసేస్తాడు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో చెల్లెలే రేప్ కు గురవుతుంది.

అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో మారు వేషం వేస్తే మనకందరికి

తెలుస్తుంది కాని సిన్మాలో విలన్ గ్యాంగు వాళ్ళకు అస్సలు తెలీదు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో బాల నటులు అన్నీ ముదురు మాటలే మాట్లాదతారు.

అదేంటో గాని తెలుగు సినిమాలలో లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పంతుళ్ళు మరీ జోకర్లలాగా

 ప్రవర్తిస్తుంటారు. పిల్లలకు భయపడుతుంటారు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో రిక్షావాడైనా రీబోక్ షూస్ మాత్రమే వేసుకుంటాడు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్లు ఎంత పేదవారైనా టక్కున

అమెరికా, ఆస్టేలియా వెళ్ళి పాటలు పాడేసుకుంటారు.

 అదేంటో గాని తెలుగు సినిమాలలో హీరో కాని హీరోయిన్ తల్లి ఇంట్లో  మందులకు

కూడా డబ్బులుండవు కాని రెండువేలకు తక్కువ కాని జరీ చీర మాత్రమే కట్టుకుంటారు.

Comments on: "అదేంటో గాని" (9)

  1. అదేంటో గాని జ్యొతిగారికి ఇదే చాలా భిన్నమైన బ్లాగు.
    అదేంటో గాని చాలా సరదాగా ఉంది.
    అదేంటో గాని నాదే తొలి కామెంట్.

  2. క్షమించండి

    ఇది కేవలం ఒక్క తెలుగు సినిమాకే వర్తించదు…
    మీ కామెంట్లు మా “తె.సి.అ” (తెలుగు సినీ అభిమానులకి చాలా భాధాకరం)

    అదేంటొ అందరూ కామెంట్లు చేస్తారు…మళ్ళీ అవే సినిమాలు చూస్తారు…

    మీ
    అనిల్ చీమలమఱ్ఱి
    (తెలుగు సినీ వీరాభిమాని)

  3. ha ha…ademitogaani poddu poddannea mee post bhale navvinchimdi.

  4. హ్హ! హ్హ! అదేంటొ కాని అంటూ తెలుగు సినిమా విషయాలు చాలా చెప్పారు . ఇన్ని తెలిసిన మీరు సరదా గా తెలుగు సినిమా డైరెక్షన్ చెయకుడదూ ?

  5. Baagundandi mee “Adento gaani!”
    Chala sarada ga saagindi.

  6. chaala chaala bagundandi.

  7. అదేంటో గాని మీ “అదెంటోగాని” అదరగొట్టేసిందండి. హహహహహహహ

  8. శ్రీనివాస రాజు ఇందుకూరి said:

    బాగుంది.. ఎండింగ్.. అదిరింది..

    పోనీలేండి.. కోసుకుంటే కోసుకున్నారు..
    మంచి విషయాలు చెప్పారు.

వ్యాఖ్యానించండి