నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                   images.jpg

రమణగారికి ముందుగా శతకోటి దన్యవాదములు. నాకు వ్యతిరేకంగానైనాసరే నువ్వు చేసిన ప్రచారం అభినందనీయం. దీనివల్ల నాకే లాభం కలిగింది. నా బ్లాగు విజిటర్శ్ రెట్టింపయ్యారు మూడు రోజులనుండి. నీ ప్రవర్తన , నీ బ్లాగు రచనతోనే  నీ వ్యక్తిత్వం అర్ఢమైంది  జీవితానుభవం లేదని. అందుకే నువ్వు అంటున్నా. నాయనా రమణ అసలు నీకు నా మీద ఎందుకింత కచ్చ. పని గట్టుకుని మరీ ఇలా దుష్ప్ర్రచారం చేస్తున్నావు.  ఇది చూసి నాకు కోపం రావట్లేదు. జాలి కలుగుతుంది.  చాలా రోజులుగా నా బ్లాగును క్రమం తప్పకుండా చదువుతూ ఇంత నిశితంగా విమర్శిస్తున్నావు.  వేరే పనేమీ లేదా?? ఐనా నా బ్లాగులో నేనేమి రాస్తానో నీకెందుకు. నాకిష్టమైనవాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాను . నువ్వు ఎవరు నాకు సలహా ఇవ్వడానికి. నా బ్లాగులో రచనలకు నేను బాధ్యురాలిని. నీకెందుకు ఆ బాధ. రచయితలతో నేను చూసుకుంటాగా ఏ గొడవలైనా.. ఐనా నీ పేరు ఊరు చెప్పడానికి ధైర్యం లేనివాడివి ఎందుకు ఆదరాబాదరాగా బ్లాగు మొదలెట్టి , అందరి బ్లాగులకెళ్ళి లింకులిచ్చి ,, కంగారు కంగారుగా నా మీద పోస్టులు రాయడమెందుకు. ఆ కంగారులో అన్నీ మళ్ళీ మళ్ళీ పోస్టు చేసానని కూడా చూసుకోలేదు.. ఇది చదివి అందరికి కోపమొచ్చింది కాని పెంట మీద రాయేస్తే మనమీదే పడుతుందని మిన్నకున్నారు. ఇప్పటిదాకా. కాని నీకు నా విషయంలో చాలా సందేహాలున్నాయని ఇలా రాస్తున్నాను. రోజు నా బ్లాగు చూస్తావని తెలుసు కాబట్టి.  నా బ్లాగు గురించిన విశ్లేషణకు కారణం తెలుసుకోవచ్చా.. దీనివల్ల నీకు లాభమేంటి.  ఇలా నాకు నీతులు చెప్పాలంటే ధైర్యంగా నా బ్లాగులో కామెంట్ చెయ్యాల్సింది. పిరికివాడిలా అనవసరంగా కొత్త బ్లాగు మొదలెట్టి రాయాల్సిన అవసరమేంటి?? ఒక్కటి తెలుసుకో. ఎదుటివారిని విమర్శించడానికి ముందు నీ గురించి తెలుసుకో. ఎదుటివారిని ఒక్క వేలెత్తి చూపితే మిగతా నాలుగు వేళ్ళు నిన్ను చూపుతాయి. ధైర్యంగా నీ సొంత పేరు, వివరాలతో రాయి. ఎవరూ వచ్చి నిన్ను తన్నరు విమర్శించినందుకు.

 

నీకు నా రచనల గురించి చాలా సందేహాలున్నట్లున్నాయి. ఐతే రేపు ఆదివారం సాయంత్రం హైదరాబాదులో బ్లాగర్ల సమావేశం జరుగుతుంది. సనత్‍నగర్ కృష్ణకాంత్ పార్కులో . నేను వస్తున్నాను. నువ్వు కూడా ఇలా బ్లాగు రాసినంత ధైర్యంగా సమావేశానికి  రావచ్చు.  అక్కడ మిగతా బ్లాగర్ల ముందు నీ సందేహాలన్నీ తీరుస్తా. అంతే కాని ఇలా బ్లాగ్లోకంలో నా గురించి దుష్ప్రచారం చేస్తే నాకు జరిగే నష్టమేమీ లేదు. అలా అని నేను ఊరుకునేదీ లేదు.

 

ఒక్కటి గుర్తుంచుకో రమణ (నీ పేరేదైనా సరే). నాకు ఇలా ఇంటర్నెట్లో రాయడంతో పాటు , ఇలాంటి చెత్త విమర్శలనుండి రక్షించుకోవడం తెలుసు. నువ్వు తప్పుడు పేరుతో అందరి బ్లాగులలో నీ బ్లాగు గురించి కామెంటు ఇచ్చినప్పుడే నీ I P అడ్రస్ తెలిసిపోయింది. దానితో నీ చిరునామా తెలుసుకోవడం అంత కష్టమేమీ కాదు. నువ్వు సైబర్ కేఫ్, ఆఫీసు, ఇంటినుండి ఈ టపాలు రాసావో తెలిసిపోతుంది. అది నేను చేయగలను. ఒకె.

ఈ మధ్య బ్లాగులలో మహిళా బ్లాగర్లను లక్ష్యంగా విమర్శించడం ఎక్కువైంది. ఇది మంచిది కాదు. ఆడది ఆదరించి అమ్మలా అన్నం పెడుతుంది. ఆగ్రహిస్తే ఆదిశక్తి అవుతుంది . జాగ్రత్త..

 

చివరిగా ఈ అనామకులకు ఒక హెచ్చరిక

 

మీరు ధైర్యంగా మీ పేరుతో  వ్యాఖ్యలు రాయలేనివారు  మా బ్లాగులు చదవడమెందుకు, పిరికి వాళ్ళలా anonymous అని కామెంట్లు రాయడమెందుకు. అందులోనే మీ ధైర్యసాహసాలు తెలిసిపోతున్నాయి అందరికి. మెయిల్ ఐడి లేకున్నా మీకంటు ఓ పేరుంటుందిగా. రాయడానికి భయమెందుకు. మీ వ్యాఖ్యలకు మేము కోపంతో మిమ్మల్ని వచ్చి తన్నము. కాని శృతి మించితే మాత్రం ఇవి ఎలా నిరోధించాలో మాకందరికి తెలుసు….

 

 

Comments on: "శ్రీ శ్రీ శ్రీ మర్యాద “రమణ” గారికి," (25)

  1. వింజమూరి విజయకుమార్ said:

    చూడు నాయనా రమణా నువ్వు రమణవో రమణ పేరుతో వున్న మరో వ్యక్తివో గానీ యిలా స్త్రీల మీద బ్లాగుల్లో రాయడం తప్పు. ఒకవేళ వాళ్లు రాసింది తప్పనిపిస్తే వాళ్ళ పర్సనల్ మెయిల్ కి రాయాలి. లేదా వాళ్ళ బ్లాగులో వ్యాఖ్య రాయాలి. నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా? ఇప్పుడు గనక మేం నిన్ను లీగల్ గా పోలీస్ కి అప్పగించ దలిస్తే మాకు అది ఓ నాలుగు గంటల పని. పోలీస్ నీ తిత్తితీసి ఆరేస్తది. మళ్ళీ జన్మలో యిటువంటి పన్లు చేయవు. ఒకవేళ నువ్వు నెట్ సెంటర్ నుంచి రాసినా నిన్ను పట్టుకోగలం. ఎందుకంటే మేమంతా అంతో యింతో ప్రాముఖ్యత, అధికారం గలిగిన చోట్లలో పనిచేస్తున్నాం. మాకూ చాలా విస్తృతమైన పరిచయాలూ మీలాంటి వారిని దారికి తెప్పించగల శక్తులూ వున్నాయి.అయినా నీకు ఆవిడ చేసే ఒక్క పనీ మంచిగా అన్పించట్లేదా. పోలీసులొచ్చి నీకు మర్యాదలు చేయకముందే ఆడాళ్లంతా దేహశుద్ధి చేయకముందే చేసింది బుద్ది తక్కువ పని గనుక వెంటనే జ్యోతిగారికి క్షమాపణలు ఇదే బ్లాగులో చెప్పి తప్పించుకుంటావో మమ్మల్ని మా పంధాలో నడుచుకోమంటావో వీలయినంత తొందరగా చేస్తే మంచిది. ఎందుకంటే సైబర్ పోలీస్ కీ, కంట్రోల్ రూమ్ కీ, కంట్రోల్ రూమ్ నించి అన్ని పోలీస్ స్టేషన్ లకీ, నువ్వు టపా రాసిన చోటుకీ ఎక్కువ దూరం వుండదు. నాలుగయిదు ఫోన్ల టైమే. త్వరపడు. లేదంటే మా పనిలోకి మేం వెళతాం. నాకు చాలా మంది మెయిల్ చేసిన తర్వాత నేను నీకు ఈ బాగుపడే విన్నపం చేస్తున్నా. లేదంటే నీ ఖర్మకి అందరూ సంతోషిస్తారు. నేను జ్యోతిగారిని వెనకేసుకొచ్చి మాట్లాడ్డం లేదు. అందరి ఆడవాళ్ళ తరపునా మాట్లాడ్తున్నా. ఆ మాటకొస్తే అందరు బ్లాగర్ల తరపునా.

  2. ఇందులో ఆడా మగా ప్రసక్తి ఎందుకు ?

  3. ఈ రమణ ఎందుకు అంత గనం దాడి చేసిండో తెల్వదు. జ్యోతక్కకు బగ్గ కోపమొచ్చింది. ఓయ్ రమణా అక్కకి సారీ చెఫ్ఫు. అయినగాని అక్కా ఆ మనిషి చెప్పినవి గుడక ఓపారి సోచాయించరాదె. అనానిమకున్లెక్క ఉంటె తప్పేముందక్క. స్రుతి మించకుండ విమర్సలు చేసుకోవచ్చు. ఓ వింజమూరన్న నువ్వుభీ జర కూలయిపో.

  4. రమణకు శుభాకాంక్షలు 🙂

    జీవితంలో నువ్వు (మా లాంటి కుక్కల నుంచి) నేర్చుకోవాల్సింది చాలా వుంది. బురదలో దొర్లడం బురద చల్లడం నీ జన్మతహ ప్రవృత్తి కావచ్చు. కానీ ఒక్క సారి స్నానం చేసి చూడు…నీకే తెలుస్తుంది.

  5. నల్లమోతు శ్రీధర్ said:

    వ్యక్తిగత దూషణలను బ్లాగుల్లో చేయడం సంస్కారమో లేదో సదరు మహాశయులు ఆలోచించుకోవాలి. జ్యోతి గారు కానీండి, సౌమ్య గారు కానీండి, సుధాకర్ గారు కానీండి.. ప్రతీ ఒక్క బ్లాగర్ తనకు నచ్చిన శైలిలో, తన దృక్కోణంలో రచనలు సాగిస్తుంటారు. ఎవరికైనా ఆ రచనలు నచ్చితే ప్రోత్సహించాలి, పొరబాట్లు చోటుచేసుకుంటే సున్నితంగా చెప్పాలి, ఆలోచనా విధానంతో విబేధిస్తే మిన్నకుండిపోవాలి. అంతేతప్ప బ్లాగర్లపై వ్యక్తిగతంగా దాడికి చేయడం అసలు ఏ విధంగా సబబు? మనిషిగా కొన్ని మానవతావిలువలు పాటిస్తేనే మన జీవితానికి
    విలువ ఉంటుంది. జ్యోతి గారిపై వ్యక్తిగతమైన విమర్శలు చదివిన రోజు ఎంతో బాధ వేసింది. ఒక సాటి మనిషిగా నేనే ఇంత బాధపడితే ఆవిడ ఇంకెంత బాధపడతారో కదా అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం నిజం! మనం ఎవరికీ జవాబుదారీ కాదు. మనం మన అంతరాత్మకే జవాబు చెప్పుకోవాలి. విలువైన కాలాన్ని, డబ్బుని వెచ్చించి ఇలా మన జ్ఞానాన్ని పదిమందికీ పంచుతున్నామంటే ఏ కోట్లనూ
    సంపాదించడానికి కాదు, మనిషిగా పుట్టినందుకు ఎంతో కొంత మన అనుభవాల సారాంశాన్నీ పదిమందికీ పంచుదామన్న తపన తప్ప! ప్రతీ బ్లాగర్ తాను రాసే ప్రతీ పోస్ట్ వెనుక ఎంతో ప్రసవవేదన పడతారు. దాని విలువ నిజంగా ఆ సమాచారం అవసరంలో ఉన్నవాళ్లకే తెలుస్తుంది. మనం మంచి పనులు చేస్తున్నామా లేదా అన్నది మన మనసుకే తెలుస్తుంది, నిరాధారమైన విమర్శలకు మనసు వికలం చేసుకోవడం కన్నా రెట్టించిన ఉత్సాహంతో బదులు తీర్చుకోవడం అత్యుత్తమ
    కర్తవ్యం! ఇలా వ్యక్తిగతమైన విమర్శలకు ప్రత్యేకంగా బ్లాగులు
    ప్రారంభించిన వారు తమ ఆలోచనావిధానాన్ని ఒక్కసారి పాజిటివ్ కోణంలోకి మళ్లిస్తే ఎంత బాగుంటుంది? మనం బ్రతికే ఈ ఏభై, అరవై ఏళ్లలో ఇలా ప్రతీ చిన్న దానికీ శత్రుత్వాలు పెంచుకుంటూ తోటి మనిషిని దూరం చేసుకుంటున్నామంటే ఇంకా ఆనందం ఏం ఉంటుంది మనసుల్లో?

    – నల్లమోతు శ్రీధర్

  6. నల్లమోతు శ్రీధర్, well said

  7. జ్యోతి గారు,
    రమణ గారి వ్యాఖ్యకి (కొత్తపాళీ గారి తెలుగు బీభత్సం టపాలో అనామక వ్యాఖ్యకి) ప్రతిస్పందనగా useless comments పేరుతో ఒక టపా రాసాను..వీలున్నప్పుడు చదవండి.

    బాలసుబ్రహ్మణ్యం గారు అడిగినది సబబే, ఇందులో ఆడ మగా ప్రసక్తి అనవసరమేమో..

    గిరి

  8. ఇంతకు ముందు లలిత బ్లాగు ఓనమాలు లో జరిగిన గొడవ తెలీనట్టుంది మీకు. దానికి తను ఎంత బాధపడిందో. నా మీద ఈ దుష్ప్రచారం మొదలైంది నేను తనని సమర్ధిస్తూ అక్కడ ఇచ్చిన వ్యాఖ్య వలననే అని నా అనుమానం.

  9. నేను చాల రోజులుగా పనిలోపడి ఈ వైపు రావడం లేదు. ఈ రోజు, కాస్త ఖాళీ దొరికి కూడలి చేరితే – కనిపించిన మొదటి బ్లాగు ఇది. ఈ తెలుగు బ్లాగుల్లో ఒక్క నెలలో ఎన్ని మార్పులు!! Road Rage గురించి విన్నాను, చూసాను.అలాగే ఇదేమైనా బ్లాగ్ రేజ్ లాంటిదేమొ – ఈ రమణది. జ్యొతిగారు, ఇందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనేది అసంధర్భమని నా యోచన, ఆడైనా మగైనా పిచివాళ్ళు పిచ్చివాళ్ళే. ఇలాంటివాళ్ళకి అత్యవసరంగా కావలసింది professional help. హైదరాబాదులో ఉండేవాడిని కాబట్టి – ఎఱ్ఱగడ్డ గురించి తెలుసు – అలాగే మిగిలిన బ్లాగర్లకి తెలిసిన clinicల addressలు తెలిపి – పాపం ఆ రమణకి కాస్త చేయుతనివ్వండి.

  10. జ్యోతక్కా,

    మన లక్ష్యం,మార్గం మంచిది అయినప్పుడు ఇటువంటి పిచ్చ్చి కుక్కల అరుపులని గురించి పట్టించుకోకూడదు.వీళ్ళ గురించి ఇంకా ఎక్కువ అలోచించినా, మన పంధా మార్చుకున్నా అనవసరంగా వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్లే.

  11. can you please let me know the blog link by ramana. I searched, but couldn’t find that.

    thanks

  12. well said.
    ఆడా మగా భేదం ఉండకపోవచ్చు గానీ నేను చూసినంతలో మగవారి బ్లాగులమీదనో రచనలమీదనో అనామక దండయాత్రలు ఏదో ఒక బలమైన అభిప్రాయభేదం వల్ల జరుగుతున్నై. ఆడవారి బ్లాగులమీద ఏమీ ప్రేరణ లేకనే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎవరి మీద రాసినా ఇటువంటి అసభ్యమైన పద్ధతుల్ని ఖండించ వలసిందే.

  13. దిన్నిపాటి said:

    అక్కా,

    మా అమ్మ చెప్పేది కొండను చూసి కుక్క మొరుగుతూనే ఉంటది అని. అలా మొరగనివ్వండి. పాపం అయాసం వచ్చి పడి”పోతాడు”

  14. I am just curious to know what are “Ramana”s comments.
    Could any one post his/her blog link? Without knowing what he said, it is difficult to understand this post and comments.

    Thanks!

  15. కందర్ప కృష్ణమోహన్ said:

    అతను, అదే ఆ అనామక రమణ ఈ వ్యాధినుంచి తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను…

  16. @Vijay , @Srinivas, that blog link is not important, dont ask again, it already flagged and blogger team has taken the blog off

  17. hello Annonymus (incorrect spelling) – It is always important to know both sides of the story.

  18. “…మీకు
    చూసి చూడనట్టు చొప్పదంటు
    వేగునెటుల వదిలివేతురో అటులనే
    చేయ వాడికదియే చిత్రహింస”
    అని గిరి గారు చెప్పినా…మీరంతా “పం*”, “కు*” అంటూ అసభ్యంగా మాట్లాడ్డమూ బాలేదు! ఆ రమణకు మీరు అనవసరంగా లాడెన్ కిచ్చినంత ప్రచారం ఇస్తున్నారు.

  19. తెలుగు బ్లాగర్లను కొందరు విమర్శిస్తున్నారన్న మీ వ్యాఖ్య నాకు కించిత్ బాధ కలిగించింది. అందుకే ఈ వ్యాక్యాలను ఇక్కడ రాస్తున్నాను.

    ఎక్కడ స్త్రీలు పూజించబడుదురో అక్కడ దేవతలు పూజించబడుదురన్నది ఆర్యోక్తి.మన భారతీయ సంప్రదాయంలో స్త్రీలను పూజించే వ్యవస్థ చాలా బలంగా వుంది.ఈ సృష్టికి మూలం ఆదిపరాశక్తి.కాని ప్రపంచీకరణ నేపధ్యంలో విషపూరిత విదేశీ సంస్కృతి మన దేశంలోనికి అతి వేగంగా చొచ్చుకొని వచ్చి అతి సనాతమైన, పవిత్రమైన మన సంస్కృతి,సాంప్రదాయాలను సమూలంగా నాశనం చేస్తున్నాయి.స్త్రీని ఆటబొమ్మగా, ఒక వ్యాపార, విలాసవంతమైన వస్తువుగా చూస్తూ, ఆనందించే స్థాయికి మనము ఎదిగాము. కొందరు మహిళలు కూడా తమ వంతు సహకారములను అందించడం వలన మీడియావారు, సినిమా వారికి స్త్రీని అగౌరవపరిచే విధంగా చిత్రీకరించడంలొ రెచ్చిపోతున్నారు. అందుకూ భారతీయ మహిళల్లారా, అందరూ ఏకం కండి. మిమ్మల్ని విలాస వస్తువులుగా వాడుకోవాలన్న అహంకార పూరుత మగధీరులకు ధీటుగా జవాబు చెప్పండి. మిమ్మల్ని మీరే కించపరుచుకునే విధంగా వస్త్రాలను ధరించకండి. భారతీయ సాహిత్యాకాశంలో రచయిత్రులదే(కవయిత్రులదే)అగ్ర తాంబూలం అన్న విషయాన్ని మనము విస్మరించరాదు.తెలుగు బ్లాగులలో కూడా మీదే ఉన్నత స్థానం కావాలని ఆశిస్తున్నాము.

  20. చర్చ ఎటునుంచి ఎటు పోతుందో అర్ధం కావటంలేదు. మిత్రులారా, ఇది జ్యోతి గారి మీద మరొక బ్లాగరు చేసిన వ్యక్తిగత విమర్శ. దీనిని అలాగే చూడండి. విషయమేదో వారిద్దరినే తేల్చుకోనివ్వండి. గతంలో చాలామంది పురుష బ్లాగర్లు కూడా కువిమర్శలనెదుర్కొన్నారు. దీనిని స్త్రీల మీద దాడి అనో మరొకటనో రాజకీయం చేయకండి.

  21. everybody is commenting on this, as Vijay said, its important to know the flip side(there is always one) , we can’t ramana as a man, a lady can also do this kind of things.

  22. ముందుగా జ్యోతి గారికి నెనర్లు.

    మంచివారు విమర్శలకి కృంగిపోవడం మరెందరికో మంచివారికి మంచిది కాదు.
    మేము ఎన్నో రోజులుగా తెలుగు బ్లాగులు చూస్తున్నా కమెంట్స్ కూడ రాయలి అనిపించలేదు. కాని ఇప్పుడు తప్పలేదు

    కువిమర్శలకు మీరు క్రుంగిపొవడం ఎందుకు?

    మీ బ్లాగ్ చాలమందికి చాలా బాగా నచ్చింది. అబిమానుల నుంచి వేగు వచినట్లె రమణ లాంటి వారి కువిమర్శలు కూడా వచ్చాయి.

    ఐతే మీరు చాలా హుందాగా సమాధానం చెప్పినా కొంచం కాదు గాని చాలా ఎక్కువే కోపం కనిపించింది. రమణ (లెదా మరెవరో) చేసిన వెకిలి వ్యాఖ్యల్ని వదిలెయండి. మరిన్ని మంచి బ్లాగులు రాయండి.

    ~~ నెనర్లు ~~ నెనర్లు ~~ నెనర్లు

    ఐతె మీరు కూడ ఆ విమర్శల్ని చూసి అలా జరగకుండ చూడండి. చివరగా ఈ మధ్య నెను మీ బ్లాగ్ లో చూసిన ప్రశ్న ( https://vjyothi.wordpress.com/2007/10/31/ ) టి.సి.ఎస్ కంపెని లొ తరచుగా అడిగె ప్రశ్న కదా. మీకు బాగా నచ్చి ఉంటె ఎక్కడొ చదివానని ఉటంకించి ఉంటె బాగుండేది.

    ఐనా పరవాలేదు.
    మీ బ్లాగుల వెలుగు ఎక్కువ. వాటి విలువ కూడ ఎక్కువే

    ఇలాగే కొనసాగలని కోరుకుంటూ… ధృవ

  23. Hi
    I want to attend Telugu bloggers Bangalore meeting.
    But I dont know anybody.
    Can you give me some link so that I can contact them?
    I know this message is not the proper place to ask.
    Regards
    Sreedhar Ambati

  24. Good Jyothi gaaru….

    good reply to him.
    this is the second time i visited your bolg…

    i liked the birty day post…. i got tears in my eyes…
    really ladies are great.. they are the roots to all the human beings on this earth…

వ్యాఖ్యానించండి