నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అనుబంధం

candle-roses.jpg

 ముందుగా…..

ఫిబ్రవరి ఐదున ఎనిమిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న డా.ఇస్మాయిల్ గారికి

ఫిబ్రవరి ఎనిమిదిన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వీవెన్ గారికి

ఫిబ్రవరి ఇరవై ఐదున వివాహం చేసుకోబోతున్న అనిల్ చీమలమర్రికి

ప్రత్యేక శుభాకాంక్షలు

————————————————————————–

పెళ్ళి ఉంగరం మన చేతి నాలుగో వేలికే ఎందుకు తొడుగుతారు.

తెలుసుకుందామా.ఇది పెళ్ళయినవాళ్ళకి,పెళ్ళికాబోయేవాళ్ళకి

ఉపయోగకరము.చూద్దామా సంగతేంటో.

బొటనవేలు-తల్లితండ్రులకు ప్రతినిధి
చూపుడువేలు-తోబుట్టువులకు ప్రతినిధి
మధ్యవేలు-మనకోసం
ఉంగరంవేలు-జీవితభాగస్వామికి ప్రతినిధి
చిటికెనవేలు-పిల్లలకు ప్రతినిధి

ఆసక్తిగా ఉందికదా……..

marraige-ring.jpg

ఈ  విధంగా చేయండి.రెండు అర చేతులను తెరచి,మధ్య వేళ్లు

రెండూ మడిచి వెనకవైపునుండి దగ్గరగా పెట్టండి.ఇప్పుడు

మిగతా వేళ్లన్ని చివరలు కలిపి ఉంచండి.

మొదట బొటన వేళ్లు విడదీసి చూడండి.అవి విడిపోతాయి.

అంటే మానవులందరూ ఎదో ఒక రోజు చనిపోతారు.అలాగే

మన తల్లితండ్రులు కూడా మనల్ని వదలి వెళతారు.
ఇప్పుడు బొటన వేళ్లు కలిపి రెండో వేళ్లు విడదీయండి. అవి

కూడా విడిపోతాయి. అంటే మన తోబుట్టువులు కూడా వాళ్ల

 సంసారాలలో తలమునకలై ఉండి మనతో ఉండరు.
ఇప్పుడు రెండో వేళ్లు కూడా కలిపి చిటికెన వేళ్లు విడదీయండి.

అవి విడిపోతాయి. అంటే మన పిల్లలు కూడా తమ స్వంత

జీవితాలకోసం మనల్ని వదలి వెళతారు.

ఇక చిటికెన వేళ్లు కూడా కలిపి నాలుగో వేళ్లు విడదీయండి.

 ఆశ్చర్యం! ఇది నిజం అవి విడిపోవు.ప్రయత్నించినా మిగతా

వేళ్లు కలిసే ఉండాలి. ఎందుకంటే ఆ నాలుగో వేళ్లు భార్యా

 భర్తల బంధానికి,ప్రేమకు ప్రతినిధులు. జీవితాంతం కలిసే

 వుండాలని పెళ్లి ఉంగరాలను ఆ నాలుగో వేలికి తొడుగుతారు.

 అందుకే నాలుగో వేలిని ఉంగరపువేలు అని అంటారు.

ప్రయత్నించి చూడండి.
 

Comments on: "అనుబంధం" (10)

  1. నిజమే సుమా. చదివిన తర్వాత ముక్కున వేలేసుకొన్నా.
    మద్యవేళ్ళు కూడా ఒకదానితో ఒకటి చేరిస్తే, అప్పుడు మాత్రం ఉంగరం వేళ్ళు విడదీయొచ్చు. అంటే – మరీ ‘నేను’ అనే భావన ఎక్కువైతే, భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం ఉందన్న మాట.
    — నాగరాజు.

  2. జ్యోతి గారూ, ధన్యవాదాలు.

    వావ్! చాలా చక్కగా వివరించారు.

    – వీవెన్ & కల్పన

  3. అవునండి.బాగా చెప్పారు.నాగరాజు గారు చెప్పింది కూడా చాలా బాగుంది.వీవెన్ గారికి,ఇస్మైల్ గారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు.

  4. కరక్టే! భలే వింతగా వుందే. చాలా బాగా వివరించారు. ఆసక్తిదాయకంగా వుంది. అందుకేనెమొ పెళ్ళంటే నురేళ్ళ పంట అంటారు. అంత దీర్ఘకాలం వుండే బంధం ఒక్క వివాహ బంధం మాత్రమే. నాగరాజు గారు ఇచ్చిన ముక్తాయింపు కుడా బాగుంది.

  5. ఇస్మాయిల్ గారికి, వీవెన్ గారికి, అనిల్ గారికి నా శుభాకాంక్షలు.

    మీరు చెప్పిన విశేషాలు బాగున్నాయి.

  6. ఇంత అందంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది.ఎన్ని సార్లు చూసినా తనివితీరడం లేదు ఈ చిత్రాన్ని! మీకు మా మన:పూర్వక ధన్యవాదాలు.

    ఇక పెళ్లి – ఉంగరం – వేలు గురించి చక్కగా చెప్పారు.మీరు చెప్పిన విధంగా ప్రయత్నించి చూస్తే…ఆశ్చర్యం. దీనికి కారణం మధ్యవేలును, ఉంగరం వేలును కదిలించే కండరం ఒక్కటే. మధ్యవేలును మడచినప్పుడు ఆ కండరం గట్టిపడుతుంది అందుకు వ్యతిరేక దిశగా ఉంగరం వేలును వంచడానికి అందుకే వీలుకాదు! అయినా ఇది మెదడు ఉపయోగించాల్సిన సందర్భం కాదు హృదయంతో ఆస్వాదించాల్సిన సమయం.థాంక్స్!

  7. ప్రవీణ్,రాధిక గార్లకు ధన్యవాదాలు.
    వీవెన్&కల్పన గార్లకు శుభాకాంక్షలు.
    అనిల్ చీమలమఱ్ఱి…వెల్ కం టు ద క్లబ్!
    -ఇస్మైల్&సుధ

  8. చాలా బావుంధి!

  9. జ్యొతి గారు,

    మీరు మరీ ఆసక్తి గా చెప్పేస్తున్నారు అన్నీ. మీ ఓపికకు జోహార్లు. ఫోటో తీసి మరీ విశదీకరిస్తున్నారు.

    ఇక అందరికీ శుభాకాంక్షల విషయానికొస్తే ఎక్కవవుతుందేమో నని ఇక్కడ పెట్టకుండా నా బ్లాగులో పెట్టా.

    ఓ లుక్కేసుకోండి.

    విహారి
    http://vihaari.blogspot.com

  10. బ్లాగు మిత్రులకు శుభాకాంక్షలు చెప్పాలనే మీ ఆలోచన బాగుంది.నిజానికి ఇంతకుముందు మీ బ్లాగు చూడలేదు. cbrao, Dr. Ismail veeven, kalpana తదితరులందరికీ శుభాకాంక్షలు చెప్పటంలో ఒక ఆత్మీయతను వెదజల్లగలిగారు. నేను కూడా అందరికీ శుభాకాంక్షలు చెపుతున్నాను.

వ్యాఖ్యానించండి