నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఆడపిల్ల

పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు
ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు
అగ్నికుంపటి కాలేదు. అయినా
కన్నవారి కనుకొలకుల నుండి
వర్షించిన భాష్పాలిందుకు సాక్షమిచ్చాయి!

గోరుముద్దలు తినిపించి లాలించే అమ్మ
అత్తారింటికి సాగనంపే క్షణాన…
గోడున ఏడవకుండా ఉంటుందా?

ఈడొచ్చిందని  వెళ్ళిపోయే
రోజొచ్చిందని అందరికి తెలిసాకా
పదిలంగా చూసుకునే వరుడి కోసం
కాళ్ళకు బలపం కట్టుకుని
తిరిగేది నాన్న కాదా?

పరాయిదైపోయినా తన బిడ్డకోసం
కడదాకా అమ్మపడే
ఆ తపనను అక్షరాల్లో వర్ణించగలనా?
నేనూ తనలా కాగలనా?

అత్తింటికెళ్ళినా, పుట్టింటిపై మమకారం
వదలలేని ఆ ఆడపిల్ల అనుబంధానికి
అనురాగానికి అర్ధం చెప్పగలమా?

ఆడపిల్లకి పెళ్ళయ్యాక కూడా
పుట్టిల్లు, మెట్టిల్లు
రెండూ కావాలి, అందరిని ప్రేమగా
చూసుకునేది ఆడపిల్లే కదా?

Comments on: "ఆడపిల్ల" (12)

  1. ఏ కాలంలో ఉన్నారు మీరు ?

  2. @ బాలా సుబ్రహమణ్యం !!

    ఆ కాలమైనా ఈ కాలామైనా మనం మారలేదు గా !! (:))

  3. ముమ్మాటికి నిజం!

  4. ఏమీ మారలేదు.
    కాకపోతే పెళ్ళికి ముందే అమ్మాయిలు ఇంటికి దూరం గా వెళ్తున్నారు(చదువు కోసమో, ఉద్యోగం కోసమో)
    అందర్నీ balance చెయ్యవల్సిన భాద్యత అమ్మాయి మీదే ఎక్కువ.

  5. @స్వాతి
    మీరన్నది నిజమే.
    @@ బాలా సుబ్రహమణ్యం !!
    ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆ ఫీలింగ్స్ వుంటాయి.
    కూతురు అత్తారింటికి వెళుతుందంటే కళ్ళు తడవని తల్లిదండ్రులు వుండరేమొ?చదువుకోడానికో,ఉద్యోగానికో వెలుతుంది అంటే తిరిగి మాదగ్గరకే వస్తుంది అన్న భావన వాళ్ళలో వుంటుంది. అందుకు అప్పుడు పెద్ద ఫీల్ అవ్వకపోవచ్చు.కానీ పెళ్ళయ్యకా తమకి దూరమయిపోతుందనే ఆలోచనతో ఆ బాధ కలుగుతుంది.మీరు ఆడపిల్ల అయ్యున్నా,మీకో ఆడపిల్లున్నా మీకు ఆ బాధ తెలిసుండేది.

  6. నేనూ తనలా కాగలనా?” అని వ్రాసారు. నిజమే! ఆ అనుమానము సహజమే! అనుబంధాలు-ఆప్యాయతల తో కూడిన జీవన సంస్కౄతి మలి మలుపు లో పయనిస్తున్న తరం మనది.

  7. సాధారణ నియమాలు (general rules) అరుదై మినహాయింపులే (exceptions) జాస్తి అయిన కాలంలో మనం జీవిస్తున్నాం.

  8. అవును. అప్పటి వరకూ తనదనుకొన్న ఇల్లు వదిలి, అమ్మా నాన్నల వదిలి, ఆడుకొన్న వీదులనొదిలి, స్నేహితుల నొదిలి అప్పటివరకూ తనెరగని మెట్టినింటికి చేరి సరికొత్త బాద్యతలతో మెలిగే మహిళ నొప్పులు మగాడికెప్పటికీ అర్థం కావు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  9. ఎంత హౄద్యంగా వర్ణించారండీ!

  10. కొత్తపల్లి రాములు. said:

    చాలా బాగా రాశారు స్ర్తీ యొక్క జీవనాన్ని ఆ జీవితంలో తను పడే ఆవేదనను.కన్న వాళ్ళ కోసం పడే ఆవేదనను చక్కగా కవిత్వీకరించారు.

వ్యాఖ్యానించండి