నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అందరి అభిప్రాయాలు భలే ఉన్నాయి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.సరే ఇప్పుడు ఈ క్రిందివాటిలో మీకున్న అలవాట్లు నిజాయితీగా ఒప్పుకోండి. ఇది 20 నుండి 60 సంవత్సరాల శ్రీమతుల రిసెర్చ్ తర్వాత చేసిన కంప్లైంట్లు.   

భార్యలలో కొందరు తమ భర్త విచిత్రమైన అలవాటును చూసి సందిగ్ధంలో పడుతూ ఉంటారు.ఒక్కోసారి భార్య అతని అలవాట్లకు ముగ్ధురాలు అయిపోతే ఒక్కోసారి తల గోడకేసి బాదుకుందామా అనిపిస్తుంది. కొందరు భర్తల కొన్ని విచిత్రమైన ఈ అలవాట్లు ఎలా ఉంటాయో చూద్దాం.

* పెళ్ళి, పుట్టిన రోజు సంధర్భంగా విష్ చేయ్యడం మర్చిపోతారు.

* తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు.

* ఇతరుల భార్యలలో అన్ని మంచి లక్షణాలే కనిపిస్తాయి. తన భార్య అంటే మాత్రం అలుసు.

* భార్య ఇచ్చిన మంచి సలహా అందరి ముందు ఒప్పుకోవలంటే వెనకముందు అవుతారు. కారణం అదరూ తనని ‘ భార్యాదాసుడు ‘అంటారేమో అని భయం.

* పిల్లల్లో ఉన్న ప్రతి మంచికి తమను తాము పొగుడుకుంటారు. అదే చెడు అయితే అది భార్య నెత్తిన రుద్దుతారు.

* భార్య పుట్టింటి వారు ఇంటికి వస్తే ‘ ఎన్ని రోజులు తిష్ట వేస్తారు ‘ అని అడుగుతారు.

* భార్యతో ఎప్పుడైనా బజారుకు వెళీతే తను భార్యకు ఎదో ఫేవర్ చేస్తునట్టు ముఖం పెడతారు లేదా శిక్ష అనుభవిస్తునట్టు ఫీలవుతారు.

* 60 ఏళ్ళ వయసులో కూడా ఇతరులు తమని ప్రేమించేలా మార్చుకోలేరు. పైగా భార్య మాత్రం ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితే మాత్రం సహించలేరు.

* తమ సరదాల కోసం వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ భార్య బ్యూటీ పార్లర్ విషయం వస్తే మాత్రం డబ్బులు వృధా చెయ్యడం మంచిపని కాదు అని ఉపన్యాసాలు ఇస్తారు.

* సాధారణంగా పురుషులు తమ స్వంత ఇంట్లోనే గెస్టుల్లా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ వస్తువు,సామాను ఉందో తెలియదు. తమ నిత్యావసర వస్తువులైన షేవింగ్ మెటీరియల్, హండ్ కర్చీఫ్, సాక్సులు, పెన్ను, టై లాంటి వాటికి కూడా భార్యపై ఆధారపడతారు.

* రాత్రి చంటిపిల్లాడు పక్క తడిపి ఏడుసుండడం తెలిసీ నాపీ మర్చడం తమ పని కాదనుకుంటారు. అలిసిపోయి నిద్రపోతున్న భార్యను లేపడం మాత్రం తమ కర్తవ్యం అనుకుంటారు.

* పరాయి స్త్రీలు తమను పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతారు,అదే తమ భార్యలను ఎవరు పొగడొద్దు.

* భార్యతో జుట్టుకు రంగు వేయించుకోవడం, తలకి నూనె రాయించుకోవడం, ఒంటికి మర్ధన చేయించుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తారు. భార్యకు నిజంగా తలనొప్పి వస్తే తలకు బాం రాయాడానికి మాత్రం వారి అహం అడ్డు వస్తుంది. పైగా టీ తాగు తగ్గిపోతుంది నాక్కూడా ఓ కప్పు ఇవ్వు అంటారు.

* ఈ రోజు వంట చేసే మూడ్ లేదని భాయ అంటే భర్త వెంటనే ‘ మటాన్ పులావ్,టమాట పప్పు, నాలుకు చపాతీలు, గోంగూర పచ్చడి, కొంచెం సలాడ్ మాత్రం చేయి చాలు, ఈరోజు వీటితో సరిపెట్టుకుందాము. అంటాడు.

* భార్య పుట్టింటి వాళ్ళు వస్తే మనసు విప్పి మాట్లాడరు. కాని భార్య మాత్రం అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు పువ్వులాగా వికసించిన ముఖంతో అతిథి సత్కారాలలో మునిగిపోవాలి అని ఆశిస్తారు.

దిగులుగా ఉన్న భర్త ముఖం చూసి భార్య ‘ ఆఫీస్‌లో ఎదైన టెన్షనా ‘ అని అడిగితే ‘ నీకు అర్ధం కాదులే ‘ అని అంటారు. ఇలా అన్నారు కదా అని ఇంకొకసారి అడగకుండా ఉంటే ‘నేనెందుకిలా ఉన్నాను అన్ని నీకు కొంచెం కూడా పట్టదు ‘ అని అంటారు.

Comments on: "శ్రీవారి విచిత్ర అలవాట్లు" (13)

  1. maa vaariki mancham pai tadi tovel vadileyadam tappa inka meeru cheppina list lo emi levu…paapam, MAA AAYANA CHAALA MANCHODU

  2. Interesting, అయ్యో..నాకు ఇంకా పెళ్ళి కాలేదండి, కాని ఇందులో..చాలా వరకు నిజమే అనుకుంటున్నాను…

  3. నాకింకా పెళ్ళి కాలేదు కానీ నేను మీరు పేర్కొన్న వాటిలో కొన్ని బయట గమనించాను.ఆవన్నీ కొంత మంది చేస్తున్నారు. అలా అని ఇక్కడ ఒక గాటన కట్టేయకండి.

    నేను ఇంకా గమనించినవి కొన్ని ఉన్నాయి..
    ౦౧. సొంతంగా కూర రోజు వండుకొని తినే మగాళ్లని, ఇంటి పని చేసుకునే వాల్లని భార్య కాక పోయినా చుట్టు పక్కల ఆడాల్లు ఆడంగి అని పిలవటం…(ఆంధ్రలో మాత్రమే)
    ౦౨. పెళ్ళి, పుట్టిన రోజు మర్చి పోవటం మతిమరుపు ఉన్న వారెవరయినా చేసేదే
    ౦౩. ఇతరుల భార్యలలో మంచి లక్షణాలు కనిపించటం : ఎదటి వారిలో మంచి చూస్తే తప్పేముంది 😉 అందరి భార్యలకు తమ దగ్గరే తక్కువ నగలున్నట్లు, చీరలున్నట్లు అనిపించడం లేదా..అలాగే ఇదీను…

    ౦౪. బజారుకు వెళితే శిక్ష అనుభవించినట్లు మొహం పెట్టడం : నిజమే…కానీ అసలు కారణం ఏమిటంటే…భర్త తనకొక షర్టు కొనుక్కోవాలంటే తన వార్డు రోబ్ లో లేనిది చూస్తాడు. భార్య మాత్రం ఒక చీర కొనాలంటే ఇంటికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆడవాళ్ళందరి వార్డు రోబులో లేని చీర కోసం వెతుకుతుంది. ఇక భర్తకు ఏం ఖర్మ, సేల్స్ మేన్/ఉమన్ కు కూడా శిక్షే.

    ౦౫. చాలా మంది మగాళ్ళు పూర్తిగా ఆడవారిపై అధారపడటం తమ జన్మ హక్కుగా భావిస్తారు. అన్నింటికీ అమ్మనడగటం అలవాటవడం వలన కావచ్చు

  4. ఏమో ఇప్పటి రోజుల్లో ఈ లిస్ట్ లో చాలా లేవు.
    వంట చెయ్యటం, టీ పెట్టటం, ఆరోగ్యం బాగోనప్పుడు సేవలు చెయ్యటం వంటివి మగవాళ్ళు బాగానే అలవాటు చేసుకున్నారు.
    కానీ నేననుకోవటం అబ్బాయి ని తల్లిదండ్రులు పెంచిన పద్దతి బట్టి వాళ్ళకి ఈ అలవాట్లు రావటం/రాకపోవటం ఉంటుందేమో.

  5. “పిల్లల్లో ఉన్న ప్రతి మంచికి తమను తాము పొగుడుకుంటారు. అదే చెడు అయితే అది భార్య నెత్తిన రుద్దుతారు”
    “భార్యకు ఎదో ఫేవర్ చేస్తునట్టు ముఖం పెడతారు ”
    ఈ రెండూ మాత్రమే మా వారికి వర్తిస్తాయి.

  6. అన్యాయం అండి. ఏక పక్షంగా, ఏక దాటిగా భర్తల మీద దాడి చేసారు. అయినా భర్తలు అందరు అదేకొవకు చెందరండి. పొద్దున లేచిన దగ్గరనుంచి ఇద్దరు కలిసి ఇంటి పనులన్ని చేస్తెనే, ఆఫీసులకి టైం కి వెళ్ళటం కష్టం. ఇంకా సేవలు చేయుంచుకోవటము కోడానా?. ఏది ఏమైనా పెద్దలు చెప్పినట్లు ‘పుణ్యం కొద్ది పురుషుడు……..” ఏమంటారు సాటి భర్తలు?

  7. ఇలాంటి చర్చలు ఒక పట్టాన తేలేవి కాదు.పెళ్ళి అనేదే ఒక చిట్‌ఫండ్ కంపెనీ.అందులో పరార్థం ఆశించడం అనవసరం.మొత్తం మీద భార్యాభర్తలు ఒకరికొకరు ఉపయోగపడుతున్నారు కదా. అది చాలు.భరిస్తారు.

  8. ఇవన్నీ కాల దోషం పట్టి పోయాయనుకుంటా. ఇందులో జరిగేవన్నీ బహుశా ఒకప్పటి జమానాలో జరిగేవేమో.

    నన్ను నేను ఇందులో చూసుకుంటే లేదా నాకు తెలిసిన చాలా మంది తో పోల్చుకుంటే ఇందులో ఏవీ నిజం కాదు. నా విషయంలో అయితే ఒక డైపీ మార్చడంలో తప్ప ఏవీ నిజం కాదు.

    విహారి.

  9. అయినా మా ఆయన బంగారు… కదండీ

  10. లిస్ట్లోవన్నీ ఈమధ్య వర్తించట్లేదు. కానీ స్వాతిగారు చెప్పినట్లు, తల్లిదండ్రులు పెంచిన పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ రోజుకి కూడా పెళ్ళాం ఉద్యోగం చేస్తూన్నా కూడా తన బాధ్యత ఉద్యోగం చేయడం వరకే, మిగిలిన సంసార బాధ్యతలన్నీ పెళ్ళానివే అనుకొనే మగాళ్ళని చూస్తోనే ఉన్నాను. ఆడపని, మగ పని అని కాకుండా మన పని అనే కాన్సెప్ట్ పిల్లలకి చిన్నప్పటినుండి తల్లిదండ్రులు ఆచరణలో చూపిస్తేనే ఏదైనా మార్పు సాధ్యం.

  11. * పెళ్ళి, పుట్టిన రోజు సంధర్భంగా విష్ చేయ్యడం మర్చిపోతారు.
    — నేను ఛస్తే మరిచిపోను. (మా ఆవిడ చంపెయ్యదూ!)

    * తడి టవల్‌ని బెడ్‌పైనే వదిలేస్తారు అందులో వారికి తప్పేమి కనిపించదు.
    — ఛ. అలా కూడా చేసేవాళ్ళున్నారా?

    * ఇతరుల భార్యలలో అన్ని మంచి లక్షణాలే కనిపిస్తాయి. తన భార్య అంటే మాత్రం అలుసు.
    — నా భార్యను రోజూ పొగిడితే ఇతరుల భార్యను అప్పుడప్పుడు పొగుడుతాను. అదీ తప్పేనా?

    * భార్య ఇచ్చిన మంచి సలహా అందరి ముందు ఒప్పుకోవలంటే వెనకముందు అవుతారు. కారణం అదరూ తనని ‘ భార్యాదాసుడు ‘అంటారేమో అని భయం.
    — ఇప్పుడు అలా ఎవరు చేస్తారండి? ఒప్పుకోకపోతే అందరిముందూ దులిపెయ్యదూ?

    * పిల్లల్లో ఉన్న ప్రతి మంచికి తమను తాము పొగుడుకుంటారు. అదే చెడు అయితే అది భార్య నెత్తిన రుద్దుతారు.
    — ఇది మాత్రం కరఖ్టు. మా ఆవిడ ఈపనే చేస్తుంది.

    * భార్య పుట్టింటి వారు ఇంటికి వస్తే ‘ ఎన్ని రోజులు తిష్ట వేస్తారు ‘ అని అడుగుతారు.
    — ఇది కూడా నాకు వర్తించదు. అయితే గియితే మా ఆవిడకే వర్తించాలి. (కోడలి బందువులు వంటింట్లోకి, కొడుకు బందువులు అరుగు మీదికి అని ఏదో సామెత కూడా వుందిగా)

    * భార్యతో ఎప్పుడైనా బజారుకు వెళీతే తను భార్యకు ఎదో ఫేవర్ చేస్తునట్టు ముఖం పెడతారు లేదా శిక్ష అనుభవిస్తునట్టు ఫీలవుతారు.
    — ఇది మాత్రం నాకు శిక్షే! ఇప్పుడు మా ఆవిడే డ్రైవింగ్ చేయగలదు కనుక షాపింగ్ అంతా ఆమే చేస్తుంది.

    * 60 ఏళ్ళ వయసులో కూడా ఇతరులు తమని ప్రేమించేలా మార్చుకోలేరు. పైగా భార్య మాత్రం ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితే మాత్రం సహించలేరు.
    — నో కామెంట్స్

    * తమ సరదాల కోసం వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ భార్య బ్యూటీ పార్లర్ విషయం వస్తే మాత్రం డబ్బులు వృధా చెయ్యడం మంచిపని కాదు అని ఉపన్యాసాలు ఇస్తారు.

    –సరదాల కోసం వేల రూపాయలా? అమ్మో!

    * సాధారణంగా పురుషులు తమ స్వంత ఇంట్లోనే గెస్టుల్లా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఏ వస్తువు,సామాను ఉందో తెలియదు. తమ నిత్యావసర వస్తువులైన షేవింగ్ మెటీరియల్, హండ్ కర్చీఫ్, సాక్సులు, పెన్ను, టై లాంటి వాటికి కూడా భార్యపై ఆధారపడతారు.
    — నా వస్తువులన్నీ నాకు తెలుసు. ఆమె వస్తువులు ఆమెకు తెలుసు.

    * రాత్రి చంటిపిల్లాడు పక్క తడిపి ఏడుసుండడం తెలిసీ నాపీ మర్చడం తమ పని కాదనుకుంటారు. అలిసిపోయి నిద్రపోతున్న భార్యను లేపడం మాత్రం తమ కర్తవ్యం అనుకుంటారు.
    — ఇది పాత చింతకాయ పచ్చడి. నేనూ, మా ఆవిడ వున్నప్పుడల్లా డయాపర్ నేనే మారుస్తాను. (మా పిల్లలు కూడా నేనే మార్చాలని గొడవ పెడతారు.)
    * పరాయి స్త్రీలు తమను పొగుడుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతారు,అదే తమ భార్యలను ఎవరు పొగడొద్దు.
    — నో కామెంట్స్

    * భార్యతో జుట్టుకు రంగు వేయించుకోవడం, తలకి నూనె రాయించుకోవడం, ఒంటికి మర్ధన చేయించుకోవడం తమ జన్మహక్కుగా భావిస్తారు. భార్యకు నిజంగా తలనొప్పి వస్తే తలకు బాం రాయాడానికి మాత్రం వారి అహం అడ్డు వస్తుంది. పైగా టీ తాగు తగ్గిపోతుంది నాక్కూడా ఓ కప్పు ఇవ్వు అంటారు.
    — ఇది కూడా పాత చింతకాయ పచ్చడే! నా జుట్టు, నా రంగు, నా గడ్డం నా ఇష్టం. ఇక్కడ మా ఆవిడ ప్రమేయమేమీ వుండదు.

    * ఈ రోజు వంట చేసే మూడ్ లేదని భాయ అంటే భర్త వెంటనే ‘ మటాన్ పులావ్,టమాట పప్పు, నాలుకు చపాతీలు, గోంగూర పచ్చడి, కొంచెం సలాడ్ మాత్రం చేయి చాలు, ఈరోజు వీటితో సరిపెట్టుకుందాము. అంటాడు.

    — నేనసలనను.

    * భార్య పుట్టింటి వాళ్ళు వస్తే మనసు విప్పి మాట్లాడరు. కాని భార్య మాత్రం అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు పువ్వులాగా వికసించిన ముఖంతో అతిథి సత్కారాలలో మునిగిపోవాలి అని ఆశిస్తారు.

    — మా యింటి వాళ్ళ కంటే మా అత్తింటి వాళ్ళతోనే నాకెక్కువ సఖ్యము, సౌఖ్యమూను.

    దిగులుగా ఉన్న భర్త ముఖం చూసి భార్య ‘ ఆఫీస్‌లో ఎదైన టెన్షనా ‘ అని అడిగితే ‘ నీకు అర్ధం కాదులే ‘ అని అంటారు. ఇలా అన్నారు కదా అని ఇంకొకసారి అడగకుండా ఉంటే ‘నేనెందుకిలా ఉన్నాను అన్ని నీకు కొంచెం కూడా పట్టదు ‘ అని అంటారు.
    — నేను అర్థమయేలా చెప్పినా వినకపోతే నేనేం చేయను?

    ఇక్కడ నా సమాధానాలేవీ మా ఆవిడతో ముచ్చటించకండి. ఆమె ససేమిరా అనొచ్చు 🙂

    –ప్రసాద్
    http://blog.charasala.com

  12. ప్రసాద్ గారూ మీ గురించి మీరు చెప్పుకోవడం కాదు,మీ ఆవిడని చెప్పమనండి.అప్పుడు మీరు చెప్పిన ఈ సమాధానాల లోనే 100 తప్పులు చూపెడతారు మాకు.

  13. baboi.. ee comments enti intha range lo vunnayi

వ్యాఖ్యానించండి