నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

             kanchi-saree.jpg 

సీ. పాద పంకజములకు పారాణి యద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనము
నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి
అవనికేతెంచు గంగా ఝరీ తరగలై కురిసేటి కుచ్చిళ్ళ కులుకు పలుకు
కాంతుని మదిగెల్చు కందర్ప కేతువై పైరగాలుల రేపు పైట జిలుగు


ఆ.వె. చీర కట్టు లలన చిలిపి వన్నెల భరిణ
చీర కట్టు పడతి సిరుల ప్రోవు
చీర కట్టు లేమ సింగారముల సీమ
చీర సొగసు బొగడ శివుని తరమ?

saree-with-50000-colors.jpgచెన్నైలోని ఒక ప్రముఖ చీరల వ్యాపారస్థులు ఈ చీరను తయారు చేసారు. ఇందులో సరిగ్గా 5౦,౦౦౦

ఉన్నాయి. దీని ధర కూడా 5౦,౦౦౦ రూపాయలు.

 reversible-saree.jpg

ఈ చీర నాలుగు అంచులు, రెండు కొంగులతో రెండువైపులా విభిన్నమైన రంగులు,

డిజైన్లతో తయారుచేయబడింది. ఈ చీరను రెండు వైపులా కట్టుకోవచ్చు.

matchbox.gif

కరీంనగర్‍లోని నల్ల పరంధాములు అనే నేతకారుడు అగ్గిపెట్టెలో పట్టేటంతటి చీరను

తయారు చేసాడు.

maya.jpg 

 ఈ రంగులు మార్చే చీర చూసారా? ఇది ధరించి ఎండలో వెళ్ళగానే దాని రంగు

మారిపోతుంది. మళ్ళీ నీడలోకి రాగానే పాత రంగుకు వచ్చేస్తుంది. దీనిని మాయ

చీర అంటారు.

 longest-saree.jpg

 ప్రపంచంలోనే అతి పొడవైన కంచిపట్టు చీర ఇది. 214 m పొడవు, 139 cm  వెడల్పుకలది.

ఇందులో వివిధరకాల జంతువులు, మందిరాలు, ప్రాచీన శిల్పాలు మొదలగునవి

ఎన్నో నేయబడ్డాయి.

j.jpg

 ఇది ఒక వినూత్నమైన చీర. దీనికి ఒక ప్రక్కన చీర రంగులోనే చిన్న సంచీ కుట్టారు.

అందులో సెల్‍ఫోన్ పెట్టుకోవచ్చు.

6.jpg

జీన్స్ ధరించే ఆధునిక యువతులకు ఈ డెనిమ్ సిల్క్ చీర తయారుచేయబడింది. డెనిమ్ బ్లూలోని అన్ని షేడ్స్ లో ఈ చీరలు దొరుకుతాయి..

Comments on: "చిత్ర విచిత్రమైన చీరల సింగారాలు" (6)

  1. డెనిమ్ చీర అంటే చాలా బరువుండదూ.

    అన్నట్లు,
    నేను నా బ్లాగు మీద visitors కి తెలుగు పదం పెట్టాలి.
    రసజ్ఞులు అంటే visitors ఆ లేక పోతే కళలలో మంచి అభిరుచులు కల వారనా ?

  2. ఈ చీరల టపా కోసమ్ అడగ్గానే రెండు పద్యాలు అవలీలగా బుర్ర బద్దలు కొట్టుకుని మరీ రాసిచ్చిన కొత్తపాళిగారికి ధన్యవాదాలు.

    డెనిమ్ ఇంకా పట్టు కలిపి నేసిన చీరలు. బరువు ఉండవు రాకేశ్‍గారు. విజిటర్స్ అంటే ఇక్కడికి వచ్చినవారు. రసజ్ణులు అంటే వచ్చి ఇక్కడి టపాలు చదివి ఎంజాయ్ చేసేవాళ్ళు. అని నా భావం…

  3. క్షమించాలి. తప్పుగా రాసాను. నేను ఏ పద్యం దొరక్క బుర్ర బద్దలు కొట్టుకుని అడిగితే కొత్తపాళి గారు అవలీలగా రాసిచ్చారు.చూసుకోలా…

  4. అద్భుతమయిన పద్యాలు కొత్త పాళీ గారు.
    చీరలకి కాంతలకీ ఉన్న అభినాభవ సంబంధం తెలియనిదా ?
    చీర కట్టులో చెలి, పురుషుని గుండెలో గిలి.

  5. జ్యోతిగారు,

    చీరకట్టు మీద పద్యం చాలా మంచి ఆలోచన. అభినందనలు. అయితే, ఈ రెండు పద్యాలనూ విడగొట్టకూడదేమో. ఏందుకంటే మొదటిది సీసపద్యం. ఆటవెలదిగానీ తేటగీతిగానీ సీసపద్యాన్ని వెనువెంటనే అనుసరించాలనేది సంప్రదాయం (నియమం!?). ఒక ఉచిత సలహా ఏమిటంటే 🙂 మొదటిపద్యానికి ముందు “సీ.” అని, రెండవదానికి ముందు “ఆ.” అనీ రాస్తే పద్యానికి ఒక హుందాతనం వస్తుంది.

    కుచ్చిళ్లను భూమికి దిగివస్తున్న గంగాతరంగాలుగాను, పమిటను మదనుని కేతనమని (మన్మధుని జెండాగుర్తుగా) వర్ణించడంతో సీసపద్యం స్వర్ణమయపద్యం అయిందని నాకనిపించింది. చీర సొగసును పొగడటం శివునితరమౌనో కాదోగానీ కొత్తపాళీకి చాలా బాగా చేతనయింది.

    వాస్తవప్రపంచానికొస్తే పరిస్థితి ఎలా ఉందో నాబోటి వారికి కవిగారే ఇలా సెలవిచ్చారు చూడండి: http://mynoice.blogspot.com/2007/03/blog-post_09.html

  6. పద్యం చాలా బాగుంది.

వ్యాఖ్యానించండి