నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

she.jpg

  రెండువేల సంవత్సరాలలో ప్రసిద్ధులు అంటూ లిస్ట్ తయారు చేస్తే ..అందులో ఆడవాళ్ళు వేళ్ళమీద  లెక్కబెట్టగలిగేమంది మాత్రమే ఉన్నారు. 1901 నుంచి ఇస్తున్న నోబుల్ ప్రైజుల్లో ఎంతమంది స్త్రీ గ్రహీతలున్నారు? నాటకపోటీలలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు. నాటక రచయితలందరూ కూడా మగవాళ్ళే. సంగీత దర్శకులు, సినిమా దర్శకులు, సినీపాటల తచయితలు, మాటల రచయితలు, సైంటిస్టులు అందరూ కూడా మగవాళ్ళే ఏం? ఎందుకని ? స్త్రీలలో జీనియస్‌లు లేరా?

 

 

ఒక ఇంట్లో జీనియస్ ఉంటే, ఇంట్లో మరో జీనియస్ పుట్టే చాన్సులున్నాయి. ప్రాబబులిటీ ధియరీ ప్రకారం ఎంత దగ్గర బంధుత్వం ఉంటే ప్రాబబులిటీ అంత ఎక్కువ అని గాటన్ అన్నారు. గాటన్ చార్లెస్ డార్విన్ కజిన్. మనందరికీ తెలిసిన మరో రెండు ఫామిలీలున్నాయి. ఒకటి క్యూరీ కుటుంబం, మరోటి సి.వి.రామన్, సుబ్రమణ్య చంద్రశేఖర్. జీన్స్‌లోంచి తరం నుంచి మరో తరానికి స్పెషల్ టాలెంట్ అందితే వాళ్ళే జీనియస్‌లవుతారు.

 

జీనియస్ అనబడే వ్యక్తికి చెమ్మగిల్లే హృదయం ఉండాలి.కంట తడి పెట్టగలిగే మెత్తటి మనసుండాలి. గుణాలు ఆడవాళ్ళలో సహజం. అందుకే ప్రతీ స్త్రీలో జీనియస్ దాగి ఉంటుంది. అది పైకి రావాలంటే ఎంతో సమయం ప్రాక్టీసులో వెచ్చించాలి. పూర్తి టైం అంతా దీనికే వినియోగిస్తే వంటెవరు చేస్తారు? పిల్లలనెవరు సాకుతారు? యింటి బాధ్యతలనెవరు స్వీకరిస్తారు? పైగా ఈర్ష్యాసూయల సమాజములో మేల్ డామినేటింగ్ సమాజంలో అడుగు ముందుకెయ్యాలంటే ఎన్నో అడ్డంకులు, వాదాలు, వివాదాలు, తనో జీనియస్ అని నిరూపించుకోవడానికి అనుక్షణం యుద్ధం చేయాల్సొస్తుంది.సహజంగా స్త్రీ ప్రశాంతతని కోరుకుంటుంది. జీవితం, మనసూ రెండూ కూడా హాయిగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటుంది, కాబట్టి స్త్రీలు జీనియస్‌లుగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నించరు.

 

మాడ్, బాడ్ అండ్ డేంజరస్ టు నో అని జీనియస్ గురించి మహానుభావుడంటే, ‘ జీనియస్ కారికేచర్ వెయ్యడం సులువు, పిచ్చి మనిషి మీద రంగులు వేస్తే చాలు అని మరోడు అన్నాడు.ఇలాటి కామెంట్స్‌కి తట్టుకోవడం కష్టం. అందుకే ఆడవాళ్ళు తనకున్న తెలివితేటలకి అడుగు పైకి వెళ్ళరు.

 

 

నిజానికి జీనియస్సుల జీవితాలు పూలపానుపులు కాదు. ముళ్ళబాటలు. మైకేలాంజిలో, బైరన్, వాన్‌గోగ్ జీనియస్‌లు అయినా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో వాళ్ళ చరిత్రలు చదివితే తెలుస్తుంది. సోక్రటీస్, గెలీలియో జీవితాలు అత్యంత దయనీయంగా గడిచాయి. హెమింగ్వే లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు.

 

1968లో బార్రన్ ఇలా అన్నాడు సృష్టించడం అన్నది ఒక్క కళాకారులు మాత్రమే చెయ్యగలరు. వాళ్ళ రాతల్తోనో, చేతల్తోనో,గీతల్తోనో. విధమైన యింటలెక్చుయల్ క్రియేటివిటీ స్త్రీలల్లో లోపించింది. రిస్క్లెందుకని ప్రకృతి డివిజన్ ఆఫ్ లేబర్ చేసింది మగవాళ్ళు ఐడియాలని, పెయింటింగ్‌లని, సాహిత్య, సంగీత, సంస్థల్ని, దేశాల్ని, మతాల్ని, కొత్తవి,కొత్తవిధానాలని, స్త్రీలు తరాల్ని సృష్టించేటట్ట్లుగా.

 

అయితే ఫ్రాయిడ్ ప్రకారం పుట్టుకతో ఆడవాళ్లు ఇన్‌ఫీరియర్  కాదు. సామాజిక బంధాలు, కమిట్మెంట్స్ వాళ్ళని ఇంటల్లెక్చుయల్గా, మెట్టు తక్కువ చేసింది. కంచెల్ని చేదించినవాళ్ళు, తప్పించుకున్నవారు, మగలక్షణాలున్న ఆడవాళ్ళలాగానే మిగిలిపోతున్నారు. ఒక స్త్రీ నిజమైన స్త్రీత్వం గల మనిషిలాగా నైనా ఉంటుంది. లేదా క్రియేటివ్ జీనియస్‌గా నైనా ఉండిపోతుంది. రెండూ కూడా ఒకే స్త్రీలో ఉండడం చాలా అరుదు. స్త్రీత్వాన్ని దూరం చేసుకొవాలి. లేదా స్త్రీగానైనా ఉండిపోవాలి. అందుకనే స్త్రీలు జీనియస్సులుగా లోకంలోకి తక్కువ వస్తున్నారు. 

 

 

Comments on: "ఆడవాళ్ళలో జీనియస్‌లు ఎందుకు లేరు?" (19)

  1. Very interesting and relevant topic. There’s an organization called “Anveshi” in Hyderabad that is dedicated to study women’s problems. At their anniversary functions, I heard two presentations by Dr. Vithal Rajan one on women artists and another on women scientists. Even from the scant evidence available, Dr. Rajan successfully demonstrated that the male colleagues and the society colluded to suppress these highly talented women. BTW, women geniuses like Virginia Woolf and Georgia O’Keefe also suffered a lot in personal life.

  2. మళ్ళీ కొంచెం తీరిగ్గా చదివాను. ఈ టపాలో మీరు కొన్ని వివాదాస్పదమైన తీర్మానాలు చేశారు. ఈ విషయం మీద ఇంకొంచెం విస్తరింపజేసి పొద్దులో ఒక వ్యాసం రాయండి – అక్కడ కొంత బహిరంగ చర్చ జరిగే అవకాశం ఉంటుంది.

  3. జన్యువుల ద్వారా తెలివితేటలు ప్రాకినట్లే “స్త్రీత్వం” “అణిగిమణిగి వుండటం” ముఖ్యంగా ఇండియాలో “పాతివ్రత్యం” ఆడవాళ్ళకు జన్యు పరంపరలో వారసత్వంగా సంక్రమించింది. చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకు సంరక్షణలో పెరగాలని చెప్పడంలోనే వుంది, స్త్రీకి స్వంత అభిమతం, వ్యక్తిత్వం, సృజన వుండకూడదని. సావిత్రి, సీత, అనసూయ మనకు ఆదర్శవంతమైన మహిళలు అయ్యిన రోజునే మన స్త్రీలు స్వంత తెలివితేటలని పోగొట్టుకొని ఇంకొకరి నీడలో బ్రతికే “అబల” అయ్యింది.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  4. ప్రసాదు గారు, అబ్జెక్షన్. సావిత్రి, అనసూయ ఏ విధంగా చూసినా అబలలు కారు.

  5. అవును స్త్రీలు ఎప్పుడూ అబలలు కారు. కాని వారు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు. నేడు చాలా మంది మహిళలు తమ కెరీర్ తో పాటు ఇంటిపని, లేదా ఇంట్లో ఉండే పని చేయడం చేస్తున్నారు. కాని మగవాళ్ళు ఉద్యోగం ఒక్కటే చేస్తారు. రెండూ ఒకేసారి విజయవంతంగా చేయలేరు. అందుకే జీనియస్సుల భార్యలు ఇల్లు పిల్లల భాధ్యత తీసుకుంటే వాళ్ళూ తమ పనులు సక్రమంగా చేసుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు.

  6. జ్యోతి గారూ మీ వాదనతో నేను కొంత వరకు ఏకీభవిస్తాను.
    నిజమే ఈ రెండు వేళ్ళ సంత్సరాలలో జీనియస్సుల లిస్ట్ తయారు చేస్తే ఆడవాల్ల సంఖ్య వేల్ల మీద లెక్ఖ పెట్టవచ్చు.దీనికి కారణం స్త్రీలలో జీనియస్సులు లేక కాదు.స్త్రీల చరిత్రని మరుగుపరచడమే కారణం.
    తెలివైన స్త్రీలని పిచ్చి వాళ్ళని,మంత్రగత్తెలని కాల్చి చంపిన ఉదాహరణలెన్నో చరిత్ర నిండా వున్నాయి కదా.మీరు అన్నట్లుగా సంసారం,ఇంటిపని, పిల్లల పని, వంట పని ఆడవాళ్ళని పీల్చి పిప్పిచేసేస్తాయి కదా.నాలుగు గోడల జీవితం ఎలాంటి జీనియస్సుని ప్రసాదిస్తుంది? ఇల్లు వాకిలి వదిలేసి, పెళ్ళాం పిల్లలిని గాలికొదిలేసే మగవాళ్ళలా ఆడవాళ్ళు వుండి వుంటే స్త్రీలలో కూడా బోలెడంత మంది జీనియస్సులు పుట్టుకొచ్చి వుండే వారు.

  7. 1) జీనియస్ అనేదానికి మనం చాలా అనవసరమైన ప్రముఖ్యం ఇస్తాం
    2) జేన్ ఆస్టిన్, వర్జీనియా వుల్ఫ్ , ఏన్ రాండ్ లాంటి వారిని మేధావులనక తప్పదు. భారతీయులలో కూడా ఎంఎస్ సుబ్బలక్షిగారు లాంటి వారిని కూడా మేధావులే అనాలి.

    నేనెప్పుడూ అనేది ఏమిటంటే,
    ఆడవారు చాలా కష్టపడవలసిన అవసరం రావడం, నాగరికతకే అవమానం. ఆడతనం అందానికి ప్రతిరూపం. వారు చేయవలసినదల్లా, మగవాళ్ళు కష్టపడడానికి ఇన్సపైర్ చేయడమే 🙂

  8. ఆడవాళ్ళలో చాలామందే జీనియస్లు వున్నారు.వాళ్ళు దానిని బయటపెట్టాలనుకోరు.వాళ్ళకి జీనియస్లు అనిపించుకోవడం కన్నా ఇంకా ఇష్టమయిన విషయాలు చాలా వున్నాయి.ఆఫీసులో ప్రమోషన్ కన్నా కూతురో,కొడుకో స్కూల్ లో ప్రైజ్ గెలిచినప్పుడు ఆడది ఎక్కువ సంతోషపడుతుందని ఎక్కడో చదివాను.

  9. మేడమ్ క్యూరి గారిని, శకుంతలా దేవిని మర్చి పోయారా ఏమిటి?

  10. జీనియస్సుల సంగతి నాకు తెలియదు.కాని ఇండియాలో ఆడవాళ్ళంటే చాలా బోల్డు తెగ కష్టపడిపోతున్నారని వాళ్ళంతా భర్తల చెప్పు కింద తేళ్ళలా బతుకుతున్నారని వాళ్ళని ఇదివరకు బాగా అణిచేశారని వాళ్ళందరూ మహాపతివ్రతలని జరుగుతున్న ప్రచారం మాత్రం నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇది కేవలం ప్రచారమే తప్ప ఇందులో సత్యం పాలు ఆవగింజంతే. Sorry, if I did not sound politically correct. But I don’t want any votes.

  11. కొత్తపాళీ గారూ,
    సావిత్రి, అనసూయల శక్తి అంతా పాతివ్రత్యంతో వచ్చిందే గదండీ. అలా పతివ్రతలుగ వుంటే మీకు అలా శక్తి వస్తుందనీ చెప్పకనే చెప్ఫే కాకమ్మ కథలవి.

    ఆడపిల్లైతే సరిగ్గా తిండి పెట్టని ప్రభుద్దులూ, ప్రతి చిన్న విశయంలో అబ్బాయితో “అమ్మాయివి” నువ్వు పోటీపడటం ఏంటని చిన్నబుచ్చే అతిరధులూ కొల్లలుగా వుంటే ఆడవాళ్ళలో తెలివి ఎలా పెరుగుతుంది?

    రాధిక గారూ,
    “భర్తో, కొడుకో, కూతురో గెల్చినప్పుడు సంతోషపడటం” అనివార్యమయ్యే తప్ప అదే వారి అభిలాష అయ్యి కాదు. నేను డాక్టరునయ్యే అవకాశం ఇప్పుడెంత మాత్రం లేదు అందుకని నా కొడుకో, కూతురో అవ్వాలనుకుంటాను. అది ఇప్పుడు అవకాశం లేకే గానీ నాకు అవ్వాలని గాక కొడుకు అవ్వాలని కాదు.
    మన సగటు స్త్రీ కూడా తను బయటికి వెళ్ళి వుద్యోగం చేయలేదు, చదవలేదు మరి తన ఆశళను కోర్కెలను ఎలా తీర్చుకోవాలి? భర్తో, కొడుకో, కూతురో తీరుస్తారని అనుకోవాలి.

    తాడేపల్లి గారూ,
    పట్నాల సంగతి నాకంతగా తెలియదు గానీ, ఏదైనా ఓ పల్లెకు వెళ్ళండి. నా చిన్నతనంలో “నా బార్య నా యిష్టం” అంటూ ముల్లుగర్రతో బార్యను కొట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇంలో ఆడవారి పెత్తనముంటే వాళ్ళమ్మాయి మాకొద్దు అని వెళ్ళిపోయిన సంభందాలూ నేనెరుగుదును.
    మీకే కాదు ఇక్కడ ఎవరికి మాత్రం ఓట్లు కావాలి?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  12. @కొత్తపాళిగారు,

    నేను చేసిన వివాదాస్పదమైన తీర్మానాలు ఏవి? ఇందులో నేను చెప్పినవి ప్రముఖులు చెప్పినవి.ఎలాగూ చర్చ మొదలయింది కాబట్టి ఇక్కడే కొనసాగిద్దాం.మళ్ళీ పొద్దులో ఎందుకు. ఇక్కడ సగం అక్కడ సగం.

    @సత్యవతిగారు,
    నేను స్త్రీలలో జీనియస్సులు లేరని అనలేదు. అందరిలో ఆ ప్రతిభ ఉంటుంది కాని కుటుంబ బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల అది మరుగున పడుతుంది.

    సుధాకర్,
    అవును ఆడవాళ్ళలో జీనియస్సులు ఉన్నారు కాని కొంతమందే.అలా అని ఆడవాళ్ళకు తెలివితేటలు లేవని కాదు. బయటికి రాలేక అణచివేయబడతాయి.

    సుబ్రమణ్యంగారు,
    ఇప్పటికీ ఆడవాళ్ళు భర్తల చెప్పుచేతలకిందే బ్రతుకుతున్నారు.పల్లెలలో ఐతే మరీ ఘోరం. చాలా కుటుంబాలలో ఆడదానికి అస్సలు విలువ ఉండదు. మొగుడు చెప్పినట్టు వినాలి.తన్నిన,తిట్టినా.బహుశా మీరు ఇలాంటివారిని చూసుండకపోవచ్చు. కాని పట్నాలలో చదువుకున్న వాళ్ళు కూడా భార్యలు తాము చెప్పినట్టే వినాలని కోరుకుంటారు. ఎదురుతిరిగితే నాకొద్దు అని వదిలేసే ప్రభుద్ధులు, వారిని సమర్ధించే తల్లితండ్రులూ ఉన్నారు.

    ప్రతి స్త్రీలో జీనియస్ ఉంటుంది.కాని మగవారిలా ఆడది ఇల్లు,పిల్లలు,అత్తవారి బాధ్యతలు గాలికొదిలేసి తిరగలేదుకద.కాని ఇవన్నీ సక్రమంగా నిర్వహిస్తూనే తమ కెరీర్‌ను వృద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు.

    సరే మీకు ఇవన్ని పుస్తకాలలో రాతలాగా అనిపిస్తుంది కద. నా సంగతే చెప్తా వినండి. నేను ఇంట్లో పని, పిల్లలపని, వంట అన్నీ పూర్తి చేసుకుని ఈ బ్లాగు పని చేసుకుంటాను. అది ముఖ్యం నాకు.అప్పుడప్పుడు పప్పులో ఉప్పు, టీలో చక్కెర మర్చిపోతుంటాను. ఇంక ఆరోజు దండకమే. ఇంటిపని ముందు చూసుకో అని. ఇంట్లో ఉన్న నా సంగతి ఇలా ఉంటే బయటికెళ్ళి ఉద్యోగాలు చేసే స్త్రీల సంగతేంటి. పాతిక వేలు సంపాదించినా ఎప్పుడైనా ఇంటి పనులలో తప్పు జరిగితే మొగుడు ఊర్కోడు. ఆడదానివి సంపాదిస్తున్నావని గీరా ఇంటిపని చేతకాదు అని.

  13. జ్యోతి గారు,

    ఆడ వాళ్ళను వేధించే విషయాల గురించి నాకు చాలా చెప్పాలని ఉంటుంది. ఓపిక తెచ్చుకుని ఒక టపానే రాస్తానేమో.

    మీరు మీ గురించి చెప్పిన విషయం నాకు అర్థం అయ్యైంది. అయితే అది ఎంత మంది మగ వాళ్ళకి పెద్ద విషయంగా అనిపిస్తుందో నాకు సందేహం. అంతెందుకు, అత్త గారి స్థానంలో ఉన్న ఆడవారికే అది పెద్ద విషయంగా అనిపించక పోవచ్చు.

    ఈ విషయం గురించి వీలైనంత వరకు ఎవ్వరినీ దోషులుగా నిలబెట్టకుండా సమస్యను ప్రధాన విషయంగా చూపిస్తూ రాయడనికి నా బ్లాగులో ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి “వేద ఘోష” కి నా శక్తి చాలా ఖర్చయిపోయింది. తాడేపల్లి గారు అప్పటికీ అపార్థం చేసుకున్నారు.

    లలిత.

  14. “ఆడవారికి ఆడవాళ్ళే ప్రథమ శత్రువులు” అని నేనూ నమ్ముతాను.
    ఆడవాళ్ళ చుట్టూ గీసిన గీతలని మరింత పటిష్ట పరిచేది ఆడవాళ్ళే! గీత దాటిన ఆడవాళ్ళని అవహేళన చేయడంలో ముందుండేది ఆడవాళ్ళే!
    అత్తకు కోడలూ తనలాంటి ఆడదే అన్న విషయం గుర్తు పెట్టుకోదు. కోడలికి అత్తా అంతే!
    చివరికి ఆడపిల్లని హద్దుల్లో వుంచే పవిత్ర భాద్యత అమ్మదే! నీ పెంపకంలో ఈ పిల్ల ఇలా అయ్యిందేంటి అని అమ్మనే అంటారు (ఆ పిల్ల తండ్రితో సహా!).
    బయటి పడలేని ఎంత సంక్లిష్ట వ్యవస్థ మనది!!!!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  15. అత్తకీ కోడలికీ పెట్టి మగవాళ్ళూ తప్పించుకు తిరుగుదాం అనుకుంటారని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. చెప్పాను కదా ప్రసాద్ గారు, “సమస్య” ప్రధానం అని. అయినా మీ వ్యాఖ్యకు ఇలా జవాబు రాయాలని అనిపించింది.

    ఎవరో ఒకరిని (లేదా ఇద్దరిని) దోషులు చేసేస్తే సరిపోతుందా. పరిష్కారం లేదని తప్పించుకుంటే అవుతుందా? దేనిని పరిష్కరించాలి అన్నది ముఖ్యం.

    అత్తగారి దృక్కోణం వేరు. అలాగే భర్త దృక్కోణం వేరు. భార్య దృక్కోణం వేరు. అదీ నేను చెప్ప దల్చుకున్నది.

    ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు రాస్తే ఉద్దేశం చెడిపోతుంది.

    నా ఆలోచనలు మాటలకు ప్రాణం పోస్తే అప్పుడో టపాలో వివరిస్తాను.

    లలిత.

  16. The root cause of all our problems is ‘NOT following the DHARMA’.

    It is a very simple statement, but when we think ‘deep in to it’, we realise
    the meaning of it and that provides the solution to many of our day to day problems.

    What do you think?

  17. ‘బయటి పడలేని ఎంత సంక్లిష్ట వ్యవస్థ మనది!!!!’
    లోపం వ్యవస్తలోనా లేక ఆ వ్యవస్తనుపయోగించే మనిషి లోనా?

    “ఆ తెల్ల వాడు మనల్ని వెధవల్ని చేసి, మన విద్యా వ్యవస్తను మార్చి,
    మనం వెధవలం అని తెలీకుండా చేసాడు.”
    – దాశరధి రంగాచార్య

  18. […] సంక్లిష్టమైన సమస్య ఇది! Posted July 10, 2007 ఇక్కడ నేను చేసిన వ్యాఖ్యను సవరించుకోవాలి […]

  19. narrow minded గా వుండడం మానండి. నేనయితే సీత/క్యూరీ ఎలా అవ్వదల్చుకొన్నా freedom, encouragement ఇవ్వడాన్ని సమర్దిస్థాను.

వ్యాఖ్యానించండి