నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

                                       

 మార్కెట్లో దొరికే సర్ఫ్, విం, ఫినైల్ లాంటివి నిజంగా మురికిని వదలగొడుతున్నాయా లేక మీ జేబులకు చిల్లు పెడుతున్నాయా..

                                     

వాటికంటే వందరెట్లు ఎక్కువ పని చేసేవి అదే ధరకు ఇంట్లోనే తయారు చేసుకుంటారా??? దీనికి ఎక్కువ ఖర్చు,శ్రమ అక్కరలేదు. కాస్తంత ఓపిక కావాలి అంతే.

                                              

భయపడకండి. వీటివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. నేను గత ఐదు సంవత్సరాలుగా ఇంట్లోనే చేసుకుంటున్నాను. మన వస్తువులను శుభ్రపరుచుకోవడానికి పాటి శ్రమ పడలేమా??

                                               

చెప్పమంటే నేను వస్తువులు ఇంట్లోనే చేసుకునే విధానము,ఖర్చు,ఎక్కడ దొరికేది అన్నీ చెబుతాను.ఎటువంటి రియాక్షన్ ఉండదు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. రిస్క్ లేదు.

 

మగాళ్ళకి బాధలేవీ తెలీదు. వీటిగురించి తెలుసుకుంటారా అని మీ భార్యనో, అమ్మనో అడగండి.. 

 

ఏవంటారు?

Comments on: "నేర్చుకుంటారా????" (9)

  1. జ్యోతి గారూ, మేము రెడీగా వున్నాము, చెప్పండి. కాకపోతే ముడిపదార్థాలు దొరికే ప్రదేశాలు మూడు నాలుగు చెపితే ఎవరికి దగ్గరగా ఉన్న వాటికి వాళ్ళు వెళతారు.

  2. చెప్పండి మేడమ్, నేర్చుకుంటాం, ఫ్యూచర్ లో పనికొస్తుంది.

  3. నేను ఈ మధ్యనే ప్రిల్,విమ్ లిక్విడ్ లను కనుక్కున్న మహానుభావులకు భక్తితో నమస్కరించాను 🙂 అంత సులభంగా పనులు జరుపుకోవచ్చని ఇప్పుడే తెలిసింది నాకు.

    అయితే మీ ఈ చిట్కాలు ఆడవారికి మాత్రమే అయితే మేము చదవం లెండి 🙂

  4. ఈ పోస్ట్ లోనే చెప్పేస్తున్నారేమో అని చాలా సంబరపడిపోయాను.ఇలా చేస్తారనుకోలేదు.

  5. వంటకాలే కాకుండా వంటగిన్నెలు కడగడానికి సబ్బులు, వంటచెసేటప్పుడు మడ్డైన బట్టలుతకడానికి పౌడర్లూ కూడా తయారుచేయడం తెలుసా? అయితే తెలుగు బ్లాగర్ బ్రాండు ప్రోడక్ట్స్ అమ్మేయచ్చుకదా మనం. వాషింగ్ పౌడర్ తెబ్లా — వాషింగ్ పౌడర్ తెబ్లా – టింగ్ టింగ్ టింగ్ :))

  6. వాషింగ్ పౌడర్ తెబ్లా — వాషింగ్ పౌడర్ తెబ్లా – టింగ్ టింగ్ టింగ్ :))

    ఇంకా నవ్వు ఆగట్లేదు. 😀

  7. బాగుంది సత్యసాయిగారు. కాని ఇది నేను ఐదేళ్ళ నుండీ చేస్తున్నా. మా పిల్లలు ఎప్పుడో పేరెట్టేసారు..జ్యోతి ఎక్సెల్, …అన్నింటికి జ్యోతి తగిలించారు. ఏం చేద్దాం.

  8. సత్యసాయిగారు,

    వండడమే కాదు శుభ్రపరచడం మా వంతే కదండీ> మీకేం హాయిగా వడ్డించింది తినేసి వెళ్ళిపోతారు. ఐనా షడ్రసోపేతమైన విందు ఇచ్చిన వారికంటే ఎంగిళ్ళు శుభ్రపరిచినవాడికే పుణ్యమంట. భారతకథలో చదివా శ్రీ కృష్ణుడు చెప్పగా…

వ్యాఖ్యానించండి