నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అవసరమా????

sivaji-q.jpg

ఇది నేను ఎవరిని విమర్శించడం లేదు. ఎవరినీ బాధపెట్టాలని లేదు. నాకు కలిగిన సందేహాలు మాత్రమే. ఎవరైనా వీటిని తీర్చగలరేమో అని నా ఆకాంక్ష మాత్రమే. అన్యధా బావించకండి.

శివాజి సినిమా గురించి చాలా హంగామా జరుగుతుంది. మీకందరికీ తెలిసిందే. సినిమా చూడటానికి జనం పడే తపన, ఎంత తొందరగా చూస్తామా అన్న ఆరాటం. ఎన్నడూ లేనంతగా ఇంత ప్రచారం ఎందుకు? ఇది నిర్మాతల వ్యూహమా? సినిమా చూసిన తర్వాత జనమే చెప్తారుగా ఎలా ఉందో??ముందే ఇంత ప్రచారం చేసి జనాన్ని వెర్రెత్తించడమెందుకు?? కంపెనీలు ఐతే తమ ఎంప్లాయీస్ కోసం గ్రూప్ బుకింగ్, థియేటర్ వాళ్ళే సగం టికెట్లు బ్లాక్ మార్కెటింగ్ చేయడం. ఇందులో ఎవరు ఫూల్స్ అయ్యేది? నష్టపోయేది? పిచ్చిజనమే! టికెట్ల కోసం జనం అల్లాడిపోతున్నారు. తమిళనాడులో జనం యాభై రూపాయల టికెట్‍కు ఐదు వేలు పెట్టడానికి కూడా వెనుకాడటంలేదు. బెంగుళూరులో రెండువేలు, హైదరాబాదులో కూడా నిన్న ఒక్కో టికెట్ ఐదు వందల నుండి వెయ్యి వరకు పలికిందంట. ఏంటీ వేలం వెర్రి. పైగా కొంత మంది అంటారు ఇంత ధరలు పెడితే మాలాంటి వాళ్ళు ఎలా చూడాలి అని. అంత డబ్బెట్టి చూడాలా??? కొద్ది రోజులు ఆగలేరా??

 ఐనా ఆ సినిమాలో అంత ఆకట్టుకునేది ఏముందని? అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ మహిమ. అంతా మాయ. సినిమా ఇతివృత్తం బావుంది. కాని ????????????????????? ఇంత హంగామా అవసరమా అని నా సందేహం…

Comments on: "అవసరమా????" (14)

  1. నిజంగా మంచి మాటే అడిగారు.ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారపు ఖర్చును మరలా ప్రేక్షకులనుండే రాబట్టటానికి ప్రయత్నిస్తారు. అధిక అంచనాలతో సినిమా ఫెయిల్ అయితే తిరిగి ఈ ప్రచారకర్తలే పరిశ్రమ నష్టపోతోందంటూ గగ్గోలు పెడతారు.ఈ ప్రచార పటాటోపాన్ని నియంత్రించుకోలేకపోతె ఏదో ఒకనాటికి ఈ సినిమా మాధ్యమం సామాన్యుడికి దూరమవ్వకతప్పదు.

  2. మీ సందేహాన్ని పక్కనపెడితే, మీరు సినిమా చూసేరనేగా! అదృష్టవంతులు.

  3. మీరు సినిమా చూసారా?

  4. లేదు మా అమ్మాయి చూసింది ఇవాళే. బాలేదంట. అనవసర గోల ఎక్కువ అంటుంది. మా అబ్బాయి రాత్రికి వెళ్తున్నాడు. చూడాలి వాడి అభిప్రాయం. నేను మాత్రం చస్తే చూడను.

  5. “……..చాలా హంగామా జరుగుతుంది.
    ……..పిచ్చిజనమే!
    మీరు …..చూసారా?
    చూడాలి వాడి అభిప్రాయం.
    నేను మాత్రం చస్తే చూడను.
    ????????????????????? ఇంత హంగామా అవసరమ”
    మే?!

  6. మా బావ కూడా చూసి యాక్ బాబా నే నయం అని చెప్పినాడు

    పాపం బెల్లం కొండ! రెండు మూడు కోట్లు వస్తాయో రావో

  7. మా వాడి రిపోర్ట్ వచ్చింది. అంతా భారీ సెట్టింగ్స్,దుస్తులు. మొదటి సగం అస్సలర్ధం కాదు. మిగతా సగం ఓకె.ఇది చూస్తుంటే మొదటి సగం మరిచిపోతాం. అంతా పబ్లిసిటీ స్తంట్…

    చారానా కోడికి బారానా మసాలా…………….అర్చమైందా????????

  8. ఇంతకీ మీ పిల్లలు టిక్కెట్ ఎంత పెట్టి కొన్నారు?

  9. వరూధినిగారు , మీరు నన్ను తక్కువగా అంచనా వేసినట్టున్నారు. నేనెప్పుడు వాళ్ళని బ్లాక్ లో టికెట్లు కొననిస్తాను.వంద రూపాయలే అది కూడా మళ్ళీ నెల దాటేవరకు సినిమా మాటేద్దు అనే కండీషన్ మీద…

  10. నాకు కూడా సినిమా అంతగా ఏం నచ్చలేదండి. దీనీకంటే బాబా నే బాగుంది.ఫస్ట్ హాఫ్ చూస్తుంటే భలే చిరాకు, కోపం రెండూ వచ్చేసాయ్! అయినా ఈ వయసులో ఈయనకు ఈ పోకిరి వేషాలు ఏంటీ అనిపించింది. సెకండ్ హాఫ్ ఓకే…

    సినిమాలో తీసుకున్న కాన్సెప్ట్ బాగున్నా, అనవసరంగా హీరోయిన్ పాత్రని, ఆ సన్నివేశాల్ని కథతో ముడిపెట్టాలనుకోవడంతో సినిమా దెబ్బతిన్నదనిపిస్తోంది.

  11. రెండు పడవల మీద పయనం…

    జాతకాలు…. నల్లడబ్బు…

    నల్లడబ్బు ఒకటే ఇతివృత్తంగా తీసుకుంటే చిత్రకథనం ఇంకా అద్భుతంగా సాగేది, సినిమా బాగుండేది అని అనిపిస్తుంది.

  12. ఈ టైపు ప్రచారం ఒకో రోజు సాగినా…బెల్లంకొండకు హుస్సేన్ సాగరే గతి…అతిగా హైపనేల..లేటరు దెబ్బ తిననేల..
    అన్నట్టు మొన్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకొందటగా!!!

  13. ఇండియాలోనే కాదు ఇక్కడ కూదా ఇదే పరిస్థితి. NJ లో టికెట్స్ 25$ ను0డి 50$ వరకు బ్లాక్ లో అమ్మారని ఫ్ర్రెండ్ చెప్పాడు. పిట్స్ బర్గులో కూడా జనాలు పడికాపులు కాచి చూసారు. చూసినవాళ్ళంతా వేస్ట్ సినిమా అన్నారు

  14. నల్లమోతు శ్రీధర్ said:

    అందరూ అన్నీ జనాలపై రుద్దాలనుకుంటారు.. మనలో పరివర్తన రానంతకాలం ఆ ప్రలోభాలు సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఎవరికివారు వ్యక్తి స్థాయిలో సంస్కరించుకోవడమే తప్ప ఏకంగా నిర్మాతలు, దర్శకులు, ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పుని ఆశించడం వృధా!

    – నల్లమోతు శ్రీధర్

వ్యాఖ్యానించండి