నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

పుణుకులు – 3

ఇవాళ నేను పుణుకుల కోసం అన్నీ కలిపి పెట్టా. మీరే వేయించుకోండి కావల్సినట్టుగా..

ఒక చిన్న దీవి. అక్కడ ఒక కొబ్బరి చెట్టుపై ఒక చిన్న కోతి పిల్ల కూర్చుంది.అంతలో ఒక పెద్ద పులి దానిని

చూసి చెట్టు క్రింద కూర్చుంది అది దిగితే తినెద్దామని. అది మంచి ఆకలిగా నిద్రపోకుండా మరీ కూర్చుంది ఆ

కోతిపిల్లను తిందామని.
 
ఇప్పుడు చెప్పండి ఆ కోతిపిల్ల ఎలా తప్పించుకుంది??? 

Comments on: "పుణుకులు – 3" (16)

  1. అసలే కోతి

    ఆపై కొబ్బరి చెట్టుపై ఉన్నది

    కొబ్బరి కాయలన్నీ పులి నెత్తిన కొట్టి

  2. అదేం కాదు..చెట్టుకి ఇంకా కొబ్బరి కాయలు కాయలేదు.

  3. కోతికి కిందకు దిగాల్సిన అవసరమేముంది, వేరే చెట్టు మీదకి దూకి పారిపోయి ఉంటుంది.

  4. అసలు ఆ కోతిపిల్లకు వచ్చిన ఆపదేముందని? పులి చెట్టెక్కలేదు. కోతికి దిగాల్సిన అవసరమూలేదు. కోతిపిల్లకు ఆకలైతే ఆహారమూ నీళ్లూ చెట్టుమీదే ఉన్నాయి కదా.

  5. అదే మరి …అసలే అది చచ్చే భయంతో ఉంది. చెట్టుకి కాయలు లేవు మరి ఏం తింటుంది..దగ్గరలో వేరే చెట్టు లేదు..పాపం చిన్న పిల్ల ఎలా తప్పించుకుంటుంది అంటే అక్కడే ఉండమంటారు.హూ…

  6. చిన్నపిల్ల అని మీరే అంటున్నారు కాబట్టి తల్లి సహాయం లేకుండా చెట్టుపైకి వెళ్ళలేదు. కాబట్టి తల్లి సహాయంతొ అవతల చెట్లపైకి వెళ్ళిపోవచ్చు . ఇది సరదా ప్రశ్న కాబట్టి మేం ఏం చెప్పిన్న మీరు కాదనే అంటారు. ఇలాంటిదే గేదె ఎలా వుంటుంది అనే ప్రశ్న కూడా.

  7. hi

    Idhedho picchi mudirina ko(jyo)thilaa undhi

    Jyothi = Kothi

    sorrry just funny…

    bye..

  8. murali garoo..
    meeru jyothy gari abhimanulandarini badha pettaaru! parvaledu, sorry chepparu ga….

  9. ఇంత పెద్ద కోతులం మనకే తెలీలేదు పాపం చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది….

  10. జ్యోతి గారూ,
    కోతిపిల్ల తప్పించుకోలేదండీ…జూన్ 22 నుండి ఇంకా చెట్టు పెనే వుంది.
    (హి హి…) అవునా…
    -భరద్వాజ

  11. సింపుల్ ఆ పులికి కూడలి అడ్రస్సు ఇస్తే సరి ఆ కూడలి చదువుతున్నప్పుడు చల్లగా జారుకుంటుంది

  12. దీని కోసం అది. దాని కోసం ఇది అలా ఎదురు
    చూస్తూ చూస్తూ చూ……..స్తూ……….
    స్వర్గం లేదా నరకం
    పులి కోతి పిల్లను చూస్తుంది. కోతి మళ్ళీ చెట్టెక్కుతుంది.
    మళ్ళీ పైన కోతిపిల్ల క్రింద పులి….

  13. అసలా పులి ఇంకా అక్కడ ఉందా అని…దాని పెళ్ళాం వచ్చి.” ఏమయ్యా! నీకు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగాదా? అసలే కొవ్వు ఎక్కువైంది, షుగర్ మొదలైందికదా! డాక్టర్ కాస్త చూసి తినమన్నాడా లేదా? పద పచ్చికూరగాయల సలాడ్ , కాకర రసం చేసి పెట్టా తిని యోగా చేయాలి. నడు ఇంటికి” అని లాక్కెళ్ళింది.

  14. అది అమెరికా కోతి అయితే 911 కి ఫోన్ చేసింది. వెంతనే SWAT టీం వచ్చి, పులి ని కాల్చేసి, కోతి పిల్లని దింపారు.

    అది ఇండియా కోతి అయితే, ఆ పులి కి బలహీన వర్గాల కింద రిజర్వేషను కలిపిస్తానని నచ్చచెప్పి, రాజకీయాల్లోకి చేరి పోయింది.

    అది ఐ.టి కోతి పిల్ల అయితే, ఆ పులి కి ఓ ఆర్కుట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చింది. పులేమో దానికి అలవాటు పడి పొయి, వేటాడల్సింది పోయి, పిజ్జాలు తెప్పించుకొని తింటుంది.

  15. నిపుణుడు అంటే technician అండీ. engineer ని వేరేగా పిలవాలేమో!
    ఏమయినా పోస్టు మాత్రం బావుంది.

  16. తెలు"గోడు" said:

    నిపుణుడు అంటే technician కాదండి శ్రవణ్ గారు… expert ( నైపుణ్యం కల వాడు ).. మీరు సాంకేతిక నిపుణుడు అన్న అర్ఢం లో వాడినట్టున్నారు… 🙂

వ్యాఖ్యానించండి