నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఒక మొగుడు..

ఒక పెళ్ళాం…

పెళ్ళాం పక్కనుండగానే “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడు.

ఇదెలా సాథ్యం????

Comments on: "ఏడుగురు పెళ్ళాలు ????…" (15)

  1. రెండో పెళ్ళాం బ్లాగు, మూడో పెళ్ళాం ఆఫీసు గావచ్చు, మిగతా నలుగురు పెళ్ళాలు ఎక్కడి నుండి వచ్చారో తెలీయదు.

  2. సింపులుగా చెప్పాలంటే, ఆమెకు తెలియకుండా ఇంకో ఆరు పెళ్ళిల్లు చేసుకొని ఉంటాడు :).

  3. రమణ ,,

    ఆ మొగుడు పెళ్ళాం పక్కనుండగానే అలా చెప్పాడు. ఆవిడ ఏమీ అనలేదు మరి. మళ్ళీ చదువు నేను చెప్పింది…

  4. pativRtaa SirOmaNi ayyi uMTuMdi :((sic)

  5. పెళ్ళాం పక్కనుండగానే “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడా
    లేక
    పెళ్ళాం పక్కనుండగానే ఆ మొగుడు “నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడా?

  6. శ్రీ కృష్ణుడు, సత్యభామ

  7. Pellam annade kani. Evvari pellam pakkano cheppaledu.

    So, evari pellam pakkano undi..NAAAKU EDUGURU PELLALU annadu.

  8. ఏడేడు జన్మలనుండి ఏడు సార్లు ఆమెనే పెళ్ళి చేసుకోవటం చేత ఆమెనే ఏడు పెళ్ళాల కింద జమ కట్టినాడా?

  9. ఆ మొగుడు తన పెళ్ళాం పక్కనుండగానే “నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడు. ఆవిడ సూర్యకాంతం డూప్లికేట్. వేరే ఆడదాన్ని కన్నెత్తి చూస్తే చీపురు తిరగేస్తుంది. ఐనా ఊరకుంది. ఎందుకు???

  10. జ్యొతి గారు మీరు రాసింది ఇలా

    పెళ్ళాం పక్కన వుండగానే “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అని కదా..

    అంటే అతను వెరే ఆవిడ భర్త గురించి చెప్తూ “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అని నాతో అన్నాడు అని తన బార్యకి చెప్తుండచ్చు.అవునా??

  11. వెల్!! వారానికి ఏడు రోజుల్లో ఏడు రకాలుగా ఏడిపిస్తుందేమో మరి 😦

  12. ఒక మొగుడు.
    ఒక పెళ్ళాం.
    పెళ్ళాం పక్కనుంది. ఎదురుగా సినిమా పోష్టరుంది.
    “ఆ మొగుడు నాకు ఏడుగురు పెళ్ళాలు” అన్నాడు.

  13. సరే అసలు సంగతి చెప్పేస్తున్నా.

    ఆ మొగుడు అన్నాడు ” మేరే సాథ్ బీవీ హై” అంటే నాతో పాటుగా భార్య ఉంది..హిందీలో సాథ్ అంటే తోడుగా ,ఏడు అని కూడా అర్ధం. అందుకే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని అన్నా..ప్రశ్నలోనే సమాధానం ఉంది.

  14. మీ సమాధానం చూసిన తరువాత, నాకు “శంకర్ దాదా MBBS” గుర్తుకు వచ్చింది.

  15. నల్లమోతు శ్రీధర్ said:

    ఎమో అనుకున్నా జ్యోతక్క మహా గడుసు ప్రశ్నలే వేస్తోంది
    -నల్లమోతు శ్రీధర్

వ్యాఖ్యానించండి