నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఏది సులభం???

లేఖిని ,  బరహ ,  ఇన్‍స్క్రిప్ట్

సుమారు 500 గా ఉన్న తెలుగు బ్లాగర్లు ఈ మూడింటిలో ఎదో

ఒకటి వాడుతున్నారు. మీరు బ్లాగు టపా రాయడానికి ఇందులో

ఏది వాడుతున్నారు, మీకు ఏది సులువుగా,త్వరగా అవుతుంది

అనిపించింది చెప్పండి.

Comments on: "ఏది సులభం???" (20)

  1. నేను ప్రస్తుతం లేఖిని వాడుతున్నాను. కాని ఇన్ స్క్రిప్ట్ లోకి మారాలని ప్రయత్నిస్తున్నాను. ధైర్యంగా ఓ పెద్ద వ్యాసం టైప్ చేద్దామంటే ఎక్కడైనా పొరపాటు జరిగి కాపీ మరియు పేస్ట్ ప్రాసెస్లో మొత్తం పోతుందేమోఅని భయమే. లేఖిని ని మెరుగుపరచటానికి నావి కొన్ని సలహాలు ఉన్నాయి, వాటిని వీవెన్ గారికి త్వరలో పంపుతాను.

  2. ఇన్‌స్క్రిప్టు. మొదట్లో కొద్దిగా అలవాటు చేసుకుంటే చాలు. మిగతా పద్ధతులన్నింటికంటే వేగవంతంగా రాయవచ్చు. ఇందులో కాపీ-పేస్టుల జంఝాటం లేదు. ఇంకో సాధనం అవసరం లేదు.

  3. “నేను ప్రస్తుతం లేఖిని వాడుతున్నాను. కాని ఇన్ స్క్రిప్ట్ లోకి మారాలని ప్రయత్నిస్తున్నాను.”
    క్విల్ల్ పాడ్ అప్పుడప్పుడు ఇండిక్ ఎక్స్ట‌టెన్స్‌న్ కూడా !

  4. ఇన్స్క్తిప్ట్

  5. ఇన్‌స్క్రిప్ట్

  6. నాకు ఇన్ స్క్ర్రిప్ట్ లో రాయడమే సులభంగా వుంటుంది. అదే బాగా అలవాటు అయింది.
    లక్ష్మి.

  7. నేను ప్రస్తుతం లేఖిని వాడుతున్నాను

  8. నేను లెఖిని వాడుతున్నాను. బాగానే ఉంటుంది…కానీ inscript గురించి తెలియదు. ఎలా వాడాలో చెప్పండి

  9. jyothi, nenu lekhini vaadutunnanu..naku baga alavatu ayundi.
    vere vati gurinchi naku telyadu inka

  10. నేను లేఖిని, బరహ, ఇన్‍స్క్రిప్ట్ అన్ని ప్రయత్నించా. నాకు లేఖిని చాలా సులువుగా,వేగంగా చేయగలుగుతున్నాను. కాని అందులో ఆటో సేవ్ ఉంటే బాగుంటుంది. ఇన్‍స్క్రిప్ట్ కూడా సులువే కాని ………….

  11. నేను AKSHARAMALA వాడతాను …..
    అది ఎవరికీ నచ్చలేదా ఏంటీ ఎవరూ చెప్పలేదు ….

  12. మరి గురుజి గురించి కూడా తెలియదనుకుంటాను… దానికి తోడుగా లేఖిని ఉందిగా !

  13. కానీ ఈ లేఖిని ఏంటో, దానిని చూచి, రాయు విధంబెట్టిదో ఎవరైనా తెల్పిన ధన్యుడను. మీరు ఇక్కడైనా చెప్పొచ్చు లేదా http://www.hydbachelors.wordpress.com లో చెప్పగలరు లేదా నాకు pravynandas@gmail.com పైన మెయిల్ చేయగలరు..
    – ఉంటాను జ్యోతిగారు… ప్రవీణ్ (ముద్దుగా నంద)

  14. http://lekhini.org/

    చాలా మంది బ్లాగర్లు వాడేది ఇదే… కాపీ పేస్ట్..

  15. Hmm….
    నేను పద్మ వాడతాను. ఆ మధ్య Baraha IME వాడాను… పద్మ ని కూడా వదిలేసి.. కానీ, దాని లొసుగులు దానికున్నాయి. సో, మళ్ళీ back to padma. Baraha IME తో పోలిస్తే BarahaPad ఉపయోగించడమే బాగుంది…. కథలు గట్రా రాయాలంటే Baraha Pad బాగుంటుంది నాకు. ఆ మధ్య టైపింగ్ టూళ్ళ గురించే ఓ సారి బ్లాగు లో రాసాను.. Part-2 రాయాలి..అనుకుంటూ రాయలేదు….ఈ పోస్టు చూసాక రాయాలి అనిపిస్తోంది….. అప్పటి వ్యాసం లంకె:

    Indian Language Transliterators – Part 1

  16. నేను, నాతోపాటు తెలుగుదనం బృందం అంతా లేఖిని వాడతాము.

    వీనెన్‌గారు ఇన్‌స్క్రిప్ట్ అనడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది!

  17. ఇన్ స్క్రిప్ట్. కంప్యూటర్లో తెలుగును తెలుగులో రాయడానికి (రాసేవారు, రాసేటప్పుడు) ఇదొక్కటే సరైన సాధనమేమో. ఇన్ స్క్రిప్ట్ లో తెలుగు టైపింగ్ నేర్పడానికి ఒక కొత్త ఉపకరణం, “అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్”. దీని గురించి మీరు విన్నారా, జ్యోతిగారు.

  18. @Anupama:
    మీరు అనుపమ టైపింగ్ ట్యూటర్ అని ప్రతి చోట వ్యాఖ్య రాయడమేనా లేక అదెక్కడ దొర్కుతుందో చెప్పేది ఉందా అనుపమ గారు?

  19. సౌమ్య, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ను హైదరాబాద్ బుక్ ఫేర్ లో చూడవచ్చు. సమయం చిక్కితే ఒకసారి వెళ్లి చూడండి. హైదరాబాద్ బుక్ ఫేర్ డిసెంబర్ 7 నుండి 17 వరకు మాత్రమే కలదు.

వ్యాఖ్యానించండి