నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

శుభవార్త ..

   
మా ఇంట్లో గత నాలుగేళ్ళ నుండి కంప్యూటర్ ఎరా పత్రికను కొంటున్నాము. మావారు చదివేవారు,ఇప్పుడు మా అబ్బాయి. నాకు అందులో కంప్యూటర్ తప్ప మిగతా ఒక్క విషయమూ అర్ధమయ్యేది కాదు. ఐనా నల్లమోతు శ్రీధర్‌గారి చిన్నపాటి ఫ్యాన్‌నే. కంప్యూటరు గురించి మాతృభాషలో ఎంత బాగా రాస్తున్నారు అని అనుకునేదాన్ని. అందుకే ఆయన మన బ్లాగు గుంపులోనికి రాగానే ఎంతో సంతోషించాను. ఆయన దగ్గరున్న విజ్ఞాన సంపద తప్పకుండా తెలుగు బ్లాగులో ఉండాల్సిందే అని ఆయన బుర్ర తినేసి బ్లాగు మొదలెట్టేలా చేసా. ఒకప్పటి ఆయన పత్రిక ద్వారా అభిమానినైన నేను ఆయనతో పాటు ఆయన బ్లాగు నిర్వహించడం చాలా గర్వంగా ఉంది . కాని ఎందుకో మరి ఓరోజు ఆయన తన పత్రికలో బ్లాగులు, వికీ గురించి తను రాద్దామనుకున్న వ్యాసాన్ని నన్ను రాయమన్నారు. ముందు భయమేసింది. నేనేంటి పత్రికలో వ్యాసం రాయడమేంటని. కాని మరికొందరు తోటి బ్లాగర్ల సహాయం, ప్రోత్సాహముతో వ్యాసాన్ని రాసి శ్రీధర్‌గారికిచ్చా.. నాకు వీలైనంత సమాచారాన్ని అందులో రాయగలిగాను. అందులో చిత్రాలు అవి ఆయనే పెట్టారు. ఈ వ్యాసం ఎలా వచ్చిందో తెలియదు మరి..ఎదురుచూడాలి.ఎవరి గురించైనా, ఏ చిన్న విషయమైనా మిస్సయ్యి ఉంటే క్షమించండి.
 
నాకు ఈ అవకాశమిచ్చిన నల్లమోతు శ్రీధర్‌గారికి ధన్యవాదములు.

త్వరలో నేను మొదటి బ్లాగుపుట్టినరోజు జరుపుకోబోతున్న సంధర్భంలో తెలుగు బ్లాగర్లందరికి ఈ వ్యాసం ఒక చిరు కానుక.

పత్రిక ముఖచిత్రమిది….

 small-cover.jpg 

ఇంకో శుభవార్త.. చాలా త్వరలో కొత్త బ్లాగు మొదలెడుతున్నాను . ఆరోగ్యం , ఆహరం గురించి…

Comments on: "శుభవార్త .." (15)

  1. వింజమూరి విజయకుమార్ said:

    విజయం! సెప్టెంబర్ ‘తెలుగు ఎరా’ ఓ అద్భుతం. ‘తెలుగు వెలుగులు’ కవర్ పేజీ ‘చూడచక్కనిదమ్మా ఈ పేజీ’ అన్నట్టుంది. దీన్ని డిజైన్ చేసిన వారెవరో వారికి నా సాహితీ కృతజ్ఞతలు. ముఖ్యంగా శ్రీధర్ గారికీ, జ్యోతి గారికీ మరిన్నికృతజ్ఞతాభినందనలు!

    మీ … వింజమూరి విజయకుమార్.

  2. ఇది చాలా హాట్ గురూ!! శ్రీధర్ గారికి, జ్యోతి కి అభివందనాలు

  3. రవి గారికి, విజయకుమార్ గారికి ధన్యవాదాలు. మొదటిసారిగా కవర్ పేజీ రూపకల్పనకు నేనే పూనుకున్నాను. వీలైనన్ని ఎక్కువ బ్లాగుల టైటిల్స్ కి కవర్ పేజీపై చోటిద్దామని రెండు గంటలపాటు కుస్తీపట్టి ఈ పాటి ఫలితాన్ని సాధించాను. ఈరోజే ప్రింటింగ్ కి పంపించవలసి రావడం వలన, మేగజైన్ ప్రిపరేషన్లో గత కొద్ది రోజులుగా బాగా అలసిపోయి ఉండడం వల్ల చాలా హడావిడిగా స్ర్కీన్ షాట్లు తీసి కాంప్రమైజ్ కావలసి వచ్చింది. ఇంకా పలువురు ప్రముఖ బ్లాగర్ల టైటిల్స్ పెట్టలేకపోయానే అన్న అసంతృప్తి మిగిలి ఉంది. వీలు వెంబడి పత్రికలో వారి బ్లాగులకూ సముచిత స్థానం కలిపిస్తాను. పత్రిక నా చేతిలో ఉన్నప్పుడు నా వాళ్లు అనుకున్న మన బ్లాగర్లు అందరినీ ఆనందపరుద్దామని, మరీ ముఖ్యంగా తెలుగు వ్యాప్తికి మరింత కృషి చేద్దామని నేను జ్యోతి గారూ ప్రయత్నించాం. పత్రిక చూసిన తర్వాత పొరబాటున ఏ అంశాన్నయినా విస్మరించాం అనిపిస్తే నా దృష్టికి తీసుకు రాగలరు. రాబోయే సంచికలలో చర్చిస్తాను.
    -నల్లమోతు శ్రీధర్
    ఎడిటర్, కంప్యూటర్ ఎరా

  4. ఇది ఒక మంచి ప్రయత్నం. మీరు తెలుగు కోసం చేస్తున్న కృషి తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది.

    జ్యోతక్కకి, శ్రీధర్ గారికి అభినందనలు.

    — విహారి

  5. అద్భుతం గా ఉంది.

  6. చాలా సంతోషం. జ్యోతిగారికీ శ్రీధర్ గారికీ శాతాధిక అభినందనలు. వీలైతే వ్యాసాన్ని స్కాన్ చేసి జెపెగ్గులుగా పెట్టండి.
    జ్యోతీ – అత్యుత్తమ బ్లాగుల లిస్టుల్లో మీ బ్లాగులు ఉన్నాయా లేదా అనే కలవరం అక్కర్లేదు మీకు. ఎందరినో తెలుగు బ్లాగ్లోకంలోకి లాక్కొచ్చి బ్లాగులు మొదలు పెట్టించిన మీ పేరు తెలుగు బ్లాగులున్నంత కాలం ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఎవరైనా చెయ్యొచ్చు, కాని కొందరే ఇన్‌స్పైర్ చెయ్యగలరు!

  7. కొత్తపాళి గారు చెప్పింది అక్షరాల నిజం

  8. అయ్యో కొత్తపాళిగారు,

    నేను సరదాకి అంతా మనోళ్ళే కదా అని అలా అన్నా!.నా సంగతి తెలియదా? ఐనా నేను ఈ వ్యాసం, కొత్తబ్లాగు పనిలో బిజీగా ఉన్నా …నాకు తెలిసింది పదిమందికి చెప్పడం ,తెలియంది పదిమందిని అడగడం ..ఇదే నా అలవాటు. ఎదో నాకు చేతనైంది నేను చేసా!!

  9. జ్యోతి, శ్రీధర్ గార్లకు అభినందనలు.

  10. అందరి కోసం మీరు పడుతున్న
    తపన, శ్రమ అభినందనీయం

    -నువ్వుశెట్టి

  11. Hmm… నేను ఈ శనివారం ఇంటికి వెళ్ళేముందు చేయాల్సిన మొదటి పని కంప్యూటర్ ఎరా కొనుక్కుని వెళ్ళడం… మహా ఆత్రంగా ఉంది..ఏమి రాసారో చదవాలని 🙂

  12. చాలా సంతోషం జ్యోతిగారు.. మీ ప్రయత్నం నా లాంటి కుర్రబ్లాగర్లకి ఎనర్జీ డ్రింక్ వంటిది.. ఎందుకోసం బ్లాగ్ మొదలెట్టానో, నా కర్తవ్యం ఏంటో మీలాంటి వాళ్లనుండి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూఉంటాను.. మొదటిసారి కంప్యూటర్ ఎరా చదువుతాను… ధన్యవాదములు శ్రీధర్ గారు.

  13. కొన్ని పనులు కొందరే చేయగలరు. జ్యోతి గారికి, శ్రీధర్ గారికి హ్రుదయపూర్వక అభినందనలు.

  14. అభినందనలు.

  15. మీరే ప్రయత్నం చేసినా అది తప్పక హిట్టవుతుంది.

వ్యాఖ్యానించండి