నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

Archive for the ‘Uncategorized’ Category

అమ్మ

మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ
సన్నజాజుల వింజామరలూపి
ఎంచక్కని పూతేనెల విందులిచ్చి
నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు?
ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి
మమతల మురిపాల లోగిలికి…
తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని
నీ చిన్నారి బొజ్జ నింపే
ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి.

ఎందుకు ప్రభూ? నీకంటే ప్రేమయినదా. ఆమె?
అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది.
చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది
తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది.
ఎండకన్ను తెలియనీయని వృక్షమవుతుంది.
నువ్వు పూజించకున్నా నీ పాలిటి దేవతవుతుంది.
నీకోసం ప్రాణాలిస్తుంది.


ఆమె పూలజోలల లాలనలో, ఒడిన ఊగు వూయలలో
నీకు ఈ దేవుడు కూడా గుర్తుండడు.
అన్ని చోట్లా అన్ని వేళలా నేను అందుబాటులో ఉండను
అందుకే ఆమెను నీకిస్తున్నాను

అవునా ప్రభూ! ఆమె పేరేంటి? నేనేమని పిలవాలి?

అమ్మ! అమ్మా అని పిలవాలి చిన్నారి”……..
(మరింత…)

ఈద్ ముబారక్….

eid-mubarak.gif

eidmubarakty3.png

ముస్లీమ్ సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు……

సిరిసిరిమువ్వగారికి శుభాకాంక్షలు…

flowers.gif వరూధినిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా బ్లాగ్లోకానికి రావాలని కోరుతూ…….

birthday_cake2.jpg

ఇంటర్నెట్లో తెలుగు వెలుగులు……….

                           small-cover.jpg

కంఫ్యూటర్ ఎరా సెప్టెంబర్ నెల పత్రికలో  మన బ్లాగులు, వికీ గురించి వ్యాసం వస్తుందని తెలుసుగా..ఇప్పుడది మార్కెట్లో ఉంది. చదివి వ్యాసం ఎలా ఉందో చెప్పండి. మార్కెట్లో దుకాణాలలో లభించకపోతే  తెలుగుదుకాణం ద్వారా తెప్పించుకోవచ్చు.

శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు…

jyo1.jpg

 బ్లాగ్సోదరులందరికీ జ్యోతక్క రాఖీ శుభాకాంక్షలు………

jyoth.jpg

టాగు మేఘం