అక్షరాలతో అల్లరి
రాసినది జ్యోతి పై నవంబరు 21, 2006
తి తి తి తి తికమకలు
మా నాన్న పేరు చలపతి
ఆయన పదేకరాలకు అధిపతి
మా అమ్మ పేరు వసుమతి
ఆమె ఎంతో సహనవతి
మా పెద్దక్క పేరు సుమతి
ఆమె చాలా సుగుణవతి
ప్రస్తుతం ఆమె గర్భవతి
మా బావ పేరు జగపతి
అతను వట్టి మందమతి
మా రెండో అక్క పేరు మధుమతి
చూడచక్కని రూపవతి
ఇంకా పెళ్ళీ కాని శీలవతి
మా పెద్దన్నయ్య పేరు వెంకటపతి
ఎప్పుడు అతడికి గుండే గతి
ఎందుకంటే ఎప్పుడూ వెళ్తుంటాడు తిరుపతి
ఆయనే చూస్తాడు మా పొలాల అతీగతి
మా రెండో అన్నయ్య పేరు కాశీపతి
ఊళ్ళో ఇతనికి చాలా పరపతి
ఎందుకంటే అతని వృత్తి హొమియోపతి
ఇంతకీ చెప్పలేదు కదూ నా పేరు జ్యొతి
నేను చదివేది పదిహేనో తరగతి
నా మాటలతో పోయిందా మీ మతి
అసలు విషయం చెప్పనా
ఒక్కటి కోసుకోనా మీ చెట్టుకున్న చామంతి
chandu చెప్పబడిన
మీ అల్లరి చాలా బాగుంది జ్యోతి గారు.
Vasu చెప్పబడిన
చాలా బాగుంది జ్యోతి
అందుకే అందుకోండి నా బహుమతి
ఓ వాసంతి
తి తి తి తి తికమకతో పోగొట్టారండీ నా మతి
ఒక్క చామంతి ఏంటి?
కోసుకోండి పూబంతి
నేవెళ్ళి చేయించుకొస్తా నా మతికి మరమ్మతి
ఎవరవుతారో గానీ మీ పతి జాగ్రత్త సుమతీ!
సరదాకి వాసుగాడు
vijaya చెప్పబడిన
good one…
valluri చెప్పబడిన
మీ అల్లరి / పదవల్లరి బాగానే వుంది కాని, రెండో అక్కయ్య అంటూ “ఇంకా పెళ్ళీ కాని – శీలవతి” అనటము మాత్రము ఎమీ బాగాలేదు. నిర్మొహమాటం గా చెప్పినందుకు ఏమి అనుకొవద్దు.
charasala చెప్పబడిన
జ్యోతీ
సౌభాగ్యవతీ
పోలేదు గానీ మా మతి
వచ్చింది మరింత నవ్వుల కాంతి
తీసుకోండి అభినందన చామంతి
–ప్రసాద్
http://blog.charasala.com
చదువరి చెప్పబడిన
మాకో చెట్టునే (మీ వంశ వృక్షాన్ని) ఇచ్చి, మీరు అడిగింది కేవలం ఒక పువ్వునా!!
వైజాసత్య చెప్పబడిన
హా పదిహేనో తరగతి చదువుతున్నారని చెప్పకనే చెప్పారుగా.
Dileep చెప్పబడిన
హ హ నాది కుడా మీ లాంటి అబి ప్రాయమె జొతి గారు.. ఈ జీవితం చాలా చిన్నది, ఒక 60 లెక 70సం!! రాల విహర యాత్ర లాంటిది అని నా అబిప్రాయం, సొ ఆనందంగా అందరితొ గడపాలి, ఉండాలి. మీ అల్లరి ఇలాగె సాగించండి…
దిలీప్.