నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

satamaanam-bhavathi.png

అందరికీ సహస్ర వందనాలు. ఈరోజు నేను నా బ్లాగులన్నింటిలో కలిపి వెయ్యి టపాలు పూర్తి చేసాను. నేను బ్లాగు రాయడం మొదలెట్టి తొమిది నెలలైంది. గుంపులో కొచ్చి ఏడాది అయ్యింది. ఈ పయనం మీ అందరి సహకారంతో

చాలా సునాయాసంగా నడిచింది. ఇప్పటివరకు ఈ బ్లాగు సందర్శకులు – 15,000 …..

 

జ్యోతి 200

షడ్రుచులు 300

అన్నపూర్ణ 200

గీతలహరి 275

నైమిశారణ్యం 25

 

 

నేను బ్లాగులు రాసేది నాకోసం. ఎవరినీ ఉద్దరించడానికి కాదు. నాకు తెలుసు ఈ బ్లాగులో నేను పనికొచ్చేది ఏమీ రాయనని. ఎప్పుడు సరదా కబుర్లే ఉంటాయి. ఏం చేయను సీరియస్ విషయాలు రాయాలని ఎంతో ప్రయత్నించాను. అసలవి నా బుర్రకెక్కితే కదా బ్లాగులో రాసేది. ప్రసాద్ అంతరంగం చూసి ఎన్నో సార్లు అనుకుంటాను. నేను అంత లోతుగాఎందుకు ఆలోచించను అని. ఇంకో విషయం చెప్పాలి. రాధిక నా బ్లాగులన్ని చదివి వ్యాఖ్యలు రాస్తుంది. కాని నేను తన కవితలను గురించి వ్యాఖ్యలు రాయను. తన కవితలను బాగుంది అని చెప్పడం బాగుండదు. చాలా బాగుంటాయి కాని నా భావాలను సరిగా వ్యక్తపరచలేను అందుకే ఏమీ రాయను తన బ్లాగులో. మిగతా బ్లాగుల్లో కూడా నాకు అర్ధం కానివి చాలా ఉన్నాయి. వాటిలో వ్యాఖ్యలు ఎమని రాయను మరి.

 

నేను ఎన్నో విషయాలలో సాంకేతికమైన సందేహాలు అడిగి వీవెన్,సుధాకర్ ని తెగ సతాయించాను. పాపం వాళ్ళు ఓపికగా చెప్పేవారు.. ఊరికే సతాయించినందుకు సారీఅడిగినవన్నీ చెప్పినందుకు థాంక్స్సాహిత్య సంబంధమైన విషయాలలో కొత్తపాళిగారు కూడా ఎంతో సహాయం చేసారు. ఇలా అందరికీ నా కృతజ్ఞ్తతలు.

 

 

ఒక విషయం…. ఇక నేను రాయడం తగ్గించి, లేదా తాత్కాలికంగా ఆపేసి చదవడం మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. విశాలాంధ్రపై దాడి చేయాలి.

 

రవి, వీవెన్, నవీన్ నేను తెవికి కి వస్తున్నాను. కాసింత చోటు ఇవ్వండి.

 

 

నా మొదటి టపా ఇది .. ధమాకాతో మొదలెట్టా…….స్పీకర్లు ఆన్ చేయండి.

 

 

 

 

ఇప్పుడొక SHORT BREAK…

Comments on: "శతశతమానం భవతి…" (24)

  1. మీ షడ్రుచుల పుణ్యామా అని…అమెరికాలో నేను 5కేజీల బరువు పెరిగాను. అందరూ ఏంట్రా అందరూ అమెరికాలో తిండి దొరక్క బక్కచిక్కి వస్తే నువ్వు ఇలా వచ్చావేంటి అని అడిగారు. అంత షడ్రుచుల మహిమ (పప్పు కూర వెరైటీలు) అని చెప్పాను జనాలకు. మీరు అనుమతిస్తే మీ షడ్రుచులలో ని వంటకాలన్నీ వికీసోర్సులో పెట్టే ఆలోచన ఉంది.
    వికీ పుష్పక విమానం లాంటిది.. మీలాంటి ఔత్సాహికులు రావాలే కానీ …ఎంత చోటు కావాలంటే అంత చోటు దొరుకుతుంది. నిజం చెప్పాలంటే…వికీ సభ్యులందం కలసి…”అయ్యా వ్యాసాలు వ్రాయండి”, “అమ్మా వ్యాసాలు వ్రాయండి” అనే అడుక్కునే పరిస్థితిలో ఉన్నాము. అలాగని ఎవ్వారూ లేరని కాదు…మాటల బాబు, నాగరాజ గారు, ఫిడరా..ఇంకా కొంత మంది ఔత్సాహికులు ఉన్నా కూడా చాలదు.
    చాలా మంది చేసే పొరపాటేమిటంటే…వికీ అంటే వ్యాసాలు వ్రాయటమే అనుకొంటారు. ఉన్న వ్యాసాలు సరి చెయ్యొచ్చు, ఆంగ్ల వ్యాసాలు అనువదిచ్చొచ్చు, కరెంట్‌ ఎఫైర్స్ వ్రాయొచ్చు, చరిత్రలో ఈ రోజు వ్రాయొచ్చు…..ఇలాంటి ఎన్నో పనులున్నాయి. కావలసిందల్లా మీకు నచ్చిన అంశంలో వ్యాసాలు వ్రాసుకొంటూ పోవడమే. కొత్తవారికి సహాయం చెయ్యడానికి మేమందరం “క్యా హై మేరే దోస్త్” అని ఎప్పుడూ సిద్దంగా ఉంటాం. త్వరలో వికీలో ఉద్యాగాలా ఖాళీ గురించి ఒక టాపా వ్రాసెద……

  2. తెవికీ పూనకంలో అసలు విషయం మరిచా……వెయ్యి టపాలు వ్రాసిన మొట్ట మొదటి తెలుగు బ్లాగరుకు నా శుభాకాంక్షలు. త్వరలో 10,000వ్యాసాలు వ్రాసిన వికీ సభులు కావాలని ఆశిస్తున్నా.

    – నవీన్ గార్ల
    http://gsnaveen.wordpress.com

  3. Congrats!

    You are number two I think!

    Welcome to the club.

    BTW don’t put your shaDruchulu on wiki 😦

    If you put them then make sure you link back to your blog, I know how much you worked for them.

  4. శుభాకాంక్షలండీ,
    మీ గురించి మా అమ్మ తో సహా చాలా మందికి చెప్పాను ,
    మీరు నిఝంగా అద్బుతం-మాకు ఒక వరం.

  5. Hi Kiran,

    I am not asking to dump షడ్రుచులు content in wikisource as it is. Needless to say that, we need to Wikify them before using it in TeWiki.
    We can create article on each item like [[dosa]] and [[idli]]

    e.g:

    1) http://en.wikipedia.org/wiki/Idli
    2) http://en.wikipedia.org/wiki/Dosa
    3) http://en.wikipedia.org/wiki/Category:Indian_cuisine

    – Surendra Naveen

  6. అన్నట్టు జ్యోతి గారు, నా మాటలు చదివి ఈ వంటల వ్యాసాలు ఏదో priority task అనుకొనేరు…ఎంత మాత్రం కాదు. దీని కన్నా అత్యంత అతి ముఖ్యమైన పనులు తెవికీలో కోకొల్లలు ఉన్నాయి.

  7. శుభాభినందనలు. ఇక ఇప్పుడు వికీలో అడుగుపెట్టి దాన్నీ పరుగులు పెట్టించండి.
    అయినా మీ బ్లాగుల్లో పనికొచ్చేది రాయరని ఎందుకనుకొన్నారు. ఎంత పనికిరాకపోతే నవీన్ 5 కేజీల బరువు పెరుగుతారు? ఎవరేం చెప్పినా చేసినా చివరి ద్యేయం ఆనందమే కదా? మీరు మీ సరదా బ్లాగులతో ఆ కార్యం బాగా నెరవేరుస్తున్నారు. కాకుంటే ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు వాటిని చదువుతారు.
    ఇక మీ అడుగు తెవికీలో పెట్టి దాన్నీ పరుగెట్టించండి.
    తెవికీలో నేనూ రాయాలి.. కానీ ఇంకా నాకు ఆ వికీ ఫార్మాట్ మీద అనుభవం రాలేదు..ఇది ఓ సాకు అనుకోండి. మీరెళ్ళండి మీ వెనుకాల తెవికీలోకి నేనూ వస్తాను.

    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. అభినందనలు మీ వెయ్యి టపాల పూర్తి కి.
    ఇక టపాల విషయానికి వస్తే సీరియస్ గా రాసేవారు చాలామందే ఉన్నారు. అందరిలా మీరూ ఎందుకు ?

    అయినా చరసాల గారు అన్నట్టు మనందరం రాసేది మనకోసమే, మన సంతోషం కోసమే, ఎవరినీ ఉద్ధరించడానికి కాదు. ఎవరికేది ఇష్టమయితే అది చదువుతారు.

    నవీన్ గారు అన్నట్టు మీ వంటలు అవీ వికీ లో ఉంచడాన్ని నేను సమర్థిస్తాను. అందరికీ ఉపయోగంగా ఉంటుంది కదా…

  9. అభినందనలు జ్యోతి గారు
    సరదాగా రాయడం కూడా ఒక కళండీ .. హాస్యాన్ని జోడించడం నాకు వచ్చి ఉంటే నేను చదవడానికే పరిమితం అయ్యేవాడిని కాదు ..

  10. ఆధునిక జీవితంలో బాగా కొరవడిన వస్తువు చక్కటి హాస్యం. సరే, సినిమాల్లో హాస్యం సంగతి చెప్పకండి – కథల్లోనూ, కవిత్వంలోనూ, ఎక్కడ చిన్న నవ్వు కనిపిస్తే వాళ్ళ సీరియస్ నెస్కి భంగం కలుగుతుందో అన్నట్టు మొహాలు బిగించుకుని రాస్తున్నారు. ఇలా బిగతీసిన వాతావరణంలో మీ బ్లాగులో, పొద్దు రచనలూ ఆహ్లాదకరమైన చల్లటి పిల్ల గాలులు. ఇతోధికంగా కొనసాగించండి. ఇంతపెద్ద మైలురాయి దాటినందుకు అభినందనలు.

  11. సుధాకర్(శోధన) said:

    అయ్యో, నేనెలా మిస్ అయ్యాను ఈ విషయం? వెయ్యి టపాల టపటపటపటపోత్సవం సందర్భంగా శుభాభినందనలు. 🙂

    నావెన్నో లెక్కెట్టుకోవాలి ఒక సారి..

  12. నిన్న కాక మొన్నే మీకు 500 టపాలు పూర్తిచేసినందుకు అభినందనలు తెలిపాము.అప్పుడే 1000 అయ్యిపోయాయా?తెలుగు బ్లాగు చరిత్ర అంతూ ఒకటుంటే అందులో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. నాకు మీ టపాలన్నీ నచ్చుతూ వుంటాయి.కనుబొమ్మలు,పెదవులు బిగించుకుని సీరియస్ గా గడిచిపోతున్న సమయంలో మీ పోస్టులు చక్కని ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి.నలుగురిని నవించడం లో వున్న ఆనందం ఎందులోను దొరకదేమో?మీరిలాగే మరిన్ని పోస్టులు చేస్తూనే వుండండి.నా బ్లాగులో కామెంట్లు రాయకపోయినా అప్పుడప్పుడూ మీ పోస్టులలో నా గురించి కూడా రాస్తూవున్నారు.అది నాకు చాలా ఆనందాన్నిస్తుంది.థాంక్స్ అండి.

  13. ఇలాగే పదికాలాలపాటు సీరియస్ విషయాలు (వీటి గొప్పేం లేదు) మీబుర్రకెక్కకూడదని కోరుకుంటూ సహస్ర టపోత్సవ శుభాభినందనలు

  14. జ్యోతి గారు,
    అభినందనలు.

    షడ్రుచులు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

    మా పిల్లల food allaergies మూలంగా నేను ఏమి వండాలో ఎన్నుకోవడానికి తెగ కష్ట పడే దాన్ని.
    షడ్రుచులలో నాకు ఉపయోగ పడే వంటలు చాలా ఉన్నాయి. వాటి రుచులు అమోఘంగా ఉంటున్నాయి.
    ఒక్కో సారి తెలిసిన వంటలే అయినా, మీ రెసిపీ చదివి చేస్తే దాని రుచే వేరు.
    చదివితే చేయాలనిపించేలా ఉంటాయి మీ రెసిపీలు.

    ఇక మీ హస్యపు జల్లులు మాకు ఇంకో వరం.

    మీరీ మధ్య రాసిన “ఇంటి నుండి మొదలెడదామా” టపా చాలా బాగుంది.

  15. టి.వి. యాంకర్: ఇట్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ టు సీ ఏ టెల్గు పర్సన్ రైటింగ్ సో మెనీ బ్లాగ్స్. మీకు కంగ్రాట్స్.
    జ్యోతి: నీ మొహం మండా ఇంటర్వ్యూ కు పిలిచి ఇంగ్లీషులో మాట్లాడుతావా?

    టి.వి. యాంకర్: ఓహ్ ఐ యాం వెరీ సారీ. ఏదో ఫ్లోలో.. అలా
    జ్యోతి:పరవాలేదు క్షమించేశా.

    టి.వి. యాంకర్: మీరు ఇంత షార్ట్ టైంలో సో మెనీ బ్లాగ్స్ ఎలా రైట్ చెయ్యగలిగారు.
    జ్యోతి: మళ్ళీ ఇంగ్లీష్.. సరేలే అన్ని బ్లాగులు రాయాగలగడం ఇంట్లో వాళ్ళ సహకారం, మరియూ దేవుడి దయ.

    టి.వి. యాంకర్: ఒహ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ హెల్పింగ్ యు ఏ లాట్. మీరు మీ ఫ్యామిలీ గురించి ఫ్యూ మినిట్స్ టాక్ చేస్త్రారా.
    జ్యోతి: అదే మరి మండుద్ది. తెలుగు టి.వి. పేరు పెట్టుకుని అంతా ఇంగ్లిపీసులో మాట్లాడతావా? నిన్నూ నీ టి.వి. నా బ్లాగులో ఉతికేస్తా. నా బ్లాగు గురించి చెప్పేటప్పుడు మీ టి.వి. ని ఉతికేసిన ఇంకో టపా కలుపుకుని చెప్పు. ఇక నే వస్తా.

    జ్యోతక్కకు ఎన్నో వందనాలు. ఈ సందర్భంగా మీకు “ప్రచండ బ్లాగరి” అని బిరుదు ప్రదానం చేస్తున్నా కొలరాడో తెలుగు బ్లాగర్ల సంఘం తరపు నుండి.

    — విహారి

  16. “ప్రచండ బ్లాగరి”

    బాగు బాగు

  17. నేను గమనించినంతవరకూ – క్రమంగా మీ టపాల్లో నాణ్యత పెరుగుతూ వస్తోంది. మీ వేగం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. వికీలో మీరు ప్రవేశిస్తే చాలా మంచిది. నేను తెవికీలో ఉన్నానని చెప్పుకోవడమేగానీ, చేసేదిమాత్రం చాలా తక్కువ. మిమ్మల్ని చూసైనా కాస్త హుషారు తెచ్చుకోవాలి. రాయడం తగ్గించి, చదవడం పెంచాలనే నిర్ణయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చదివేకొద్దీ రాయడానికి చాలా సరుకు దొరుకుతుంది. 🙂 శత శతమానం భవతి! అని మీరన్నట్లే పదివేల టపాలూ రాసేసిన రోజు త్వరలోనే రావచ్చు కూడా.

  18. మీ అందరి ప్రేమ అభిమానం చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లాయి. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలినో అనిపిస్తుంది. ఎదో ఒక్కో క్లాసు మంచి మార్కులతో పాసయినట్టుగా సాగిపోతున్నాను. ఇంకా ఎదో సాధించాలి వేరే ఎవరితోనూ పోటీ పెట్టుకోకుండా నాకు నేనే పోటీ అన్నట్టుగా నాకు నచ్చినవి నా డైరీలో రాసుకున్నట్టుగా బ్లాగులలో రాసుకుంటున్నాను. కాని మీ అందరి వ్యాఖ్యలు చదువుతుంటే నాకు గర్వం మొదలయింది. అమ్మో…అది మాత్రం వద్దు.

    ఇక నేను నిన్నటినుండే తెవికీ లో కౌరవులతో కలిసి అడుగుపెట్టి శతకములు మొదలెట్టాను.

    నేను రాసింది సహస్ర టపాలు మాత్రమే ..కాని నాకు లభించింది శత శతమానం భవతి అనే పదివేలమందికంటే ఎక్కువ ఆశీస్సులు.

    మరి నేను బిల్ గేట్స్ ను మించినా కార్లోస్ కంటే ధనవంతురాలిని అనుకుంటున్నాను. ఎక్కువైందా?? లేదు…

  19. శతటపోత్సవం సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు.కాని మీ మీద ఒక కంప్లైంట్ ఉందండి.మీ “షడ్రుచులు” హాస్టల్ లో ఉండే నాలాంటి వాళ్ళని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి.ఇలా కాదు కాని మీ ఇల్లెక్కడో చెప్పండి,ఒక మూడు రోజులకి సరిపడ బట్టలు సర్దుకొని మరీ వస్తాను.చక్కగా “షడ్రుచులు” మీ చేత్తో చేసి పెడితే తిని నాలుగో రోజుకి బాక్స్ లో కట్టుకొని మా ఊరికి మేము బయలుదేరుతాము.ఏమంటారు మరి??

  20. శతటపోత్సవం సందర్భంగా ముందుగా మీకు శుభాకాంక్షలు Hi Jyothi gaaru Really U r Blog soo nice hasyapunukulu name chaalaa baagundi inka inka manchi manchi vishayaalu mee blog lo ponduparustaru ani aasistu……..

  21. 1000 posts in such short time: Incredible.amazing, unbelievable. Hearty congrats. You deserve a place in Telugu blog history.

    -cbrao
    Camp: Tenali.

  22. వెయ్యి టపాలు పూర్తి చేసిన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. మీ SHORT BREAK త్వరగా ముగించుకొని, లక్ష టపాలు వ్రాసిన మొదటి బ్లాగరి మీరే కావాలని ఆశిస్తున్నాను.

  23. అభినందనలు. మీరు ఇలాంటి మైలురాళ్ళను మరెన్నో అధిగమిస్తారని ఆకాంక్షిస్తూ…..

  24. పుంఖానుపుంఖాలుగ బ్లాగే మీ ఓపికకు ఇవే నా జోహార్లు!

వ్యాఖ్యానించండి