నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఇది ఒక మృదులాంత్ర నిపుణుడి అదేనండి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ ఆలోచనల సమాహారాం. త్వరలో ఉద్యోగంలో చేరబోయే మా అబ్బాయి పరిస్థితి కూడా ఇంతేనేమో??
కాలేజీలో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు ఐపోతాయో, పరీక్షల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో,

ఉద్యోగంలో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని తొందర పడతాం. ఉద్యోగ వేటలో నానా తిప్పలు పడి,

కనపడిన ప్రతీ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయి , చివరకు ఎలాగో ఉద్యోగం సంపాదిస్తాం.

ఉద్యోగంలో జాయిన్ అవుతాం.

మొదటి నెల – పని తక్కువ – ఎంజాయ్ ఎక్కువ – ఆల్ హ్యాపీస్ 

రెండో నెల – పని – ఎంజాయ్ – ఓ కే

మూడో నెల – ఓన్లీ పని – నో ఎంజాయ్ – సమస్యలు మొదలు
అప్పటికి ఆఫీస్ రాజకీయలు తెలుస్తాయి.

పక్క టీమ్‌లో మేనేజర్ మంచోడు అయుంటాడు.
పక్క టీమ్‌లో అమ్మాయిలు బావుంటారు.
పక్క టీమ్ లో జీతాలు తొందరగా పెంచుతారు.
పక్క టీమ్ లో పని అస్సలే ఉండదు.
మనకి మాత్రం రోజూ పండగే.

చేసిన పనికి చెయ్యని పనికి దొబ్బించుకోవటమే. ఒక్కో క్లయింటేమో పిచ్చి నా Requirements ఇస్తాడు. అవి పని చెయ్యవు అని తెలిసీ అలానే చెయ్యాలి. అర్ధ రాత్రి సపోర్టులు. ఆన్‌సైట్ వాడిని అమ్మ నా బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది. కాని ఆఫీసులో నెట్ ఇంకా కాఫీ ఫ్రీ అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది. మనకీ ఒక బ్యాచ్ తయారవుతుంది.

వారానికో.. రెండు వారాలకో మందు కొట్టి TL,PM ని తిట్టి ఒక ఆరు నెలలు గడిపేస్తాము. ఇలా లూప్‌లో పెట్టి  కొడితే రెండు ఏళ్ళూ ఐపోతాయి. అప్పటికి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు,, వేళ్ళు వంకరలు,మెడ నొప్పులు… వగైరా….ప్చ్ 

ఇలా జబ్బులన్ని వచ్చేసి ఉంటాయి. అమ్మ,నాన్న,అక్క,చెల్లి, అన్న, తమ్ముడుతో కూడా చుట్టపు చూపుగా వెళ్ళి చూడాల్సొస్తుంది. ఒక వేళ మన అక్క,తమ్ముడు ఇదే మృదులాంత్ర ఉద్యోగంలో ఉంటే అర్ధం చేసుకుని తిట్టటం మానేస్తారు. లేకపోతే ఫోను చేసిన ప్రతీ సారీ సంజాయిషీ చెప్పాల్సొస్తుంది.
 
జీతం పడుతూ ఉంటుంది, బాండ్స్‌కి,క్రెడిట్ కార్డ్ బిల్స్ అని కట్టి కట్టి సంపాదించింది అంతా ధార పోస్తాము., ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు ఐతే  హోమ్ లోన్ మీద, మనలాంటోడు ఐతే మందు, సిగరెట్, గాలి తిరుగుడు మీద తగలేస్తాం.

ఇలా జీవితం ప్రశాంతంగా  సాగుతూ ఉండగా ఒకరోజు కొలీగ్ పెళ్ళి సెటిల్ అయిందని పిలుస్తాడు.  మనకీ ఒక అమ్మాయి ఉంటే బావుండు అనె ఒక వెఱ్ఱి కోరిక కలుగుతుంది. మన s/w లో బావున్న అమ్మాయిలు అందరూ పెళ్ళైనోళ్ళు,ఉత్తర భారతీయులు,బుక్కైనోళ్ళు ఉంటారు. అక్కడే వందలో 95 మంది జల్లెడ పట్టేసాము. మిగిలింది 5 గురిలో నలుగురు ఫ్రెండ్ అనే కంటే అక్కా అంటేనే బెటర్ అనేలా ఉంటారు. ఆ మిగిలిన ఒక్క అమ్మాయి కోసం టీమ్ అంతా ఊర కుక్కల్లా కొట్టేసుకుంటాం. ఆ అమ్మాయి మాత్రం ఎవరితోను కమిట్ అవకుండా అందరితో పబ్బం గడిపేస్తూ ఉంటుంది. ఒక మంచి రోజు తన బావతో పెళ్ళి అని అందరికీ పెళ్ళిపత్రికలు పంచుతుంది. 
ఇంకేముంది అందరూ కలిసి కూర్చుని మందు కొట్టేసి ఆ అమ్మాయి మంచిది కాదు అని నిర్ణయించేసుకుని.. మళ్ళీ ఇంకో అమ్మాయి కోసం లైనేద్దాం అని ప్రయత్నాలు మొదలు.

ఉద్యోగంలో సమీక్షలు( రివ్యూస్) వస్తాయి. “నువ్వు ఎక్సెలెంట్.నువ్వు లేనిదే కంపెనీ లేదు, కత్తి కమాల్ ..లాంటి ఎగస్త్రాలు ఎన్నో  చెప్పి ఊరించి చివర్లో “బట్” అంటారు. తీరా చూస్తే నీ జీతంలో ఇంకో సెనక్కాయ పెంచాం పో అంటారు. మన రెజ్యూం అప్‌డేట్ చేయాలి అని గత ఆరు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మళ్ళీ ఒక సారి స్మరించుకుని అలా ఇచ్చిన సెనక్కాయల మీద బ్రతికేస్తుంటాము.

జీవితం అంతా దూరదర్శన్ హైదరాబాదు ప్రసారాలలానే ఉంటుందా? వేరే ప్రోగ్రామ్స్ ఉండవా?

చీ !! ఈ వెధవ బ్రతుకు!!!!!!!!!!!………….

నిన్న  ఒక software engineer తన కష్టాలు ఇంగ్లీషులో టూకిగా చెప్తే నేను తెలుగులో ప్రయత్నించా…ఇది చదువుతుంటే విహారి టపా కాపీ కొట్టినట్టుంది కదా…

Comments on: "మృదులాంత్ర నిపుణుడి మనోభావాలు" (16)

  1. శర్మ వేమూరి said:

    “జీతంలో ఇంకో సెనక్కాయ” ఇది సూపరు.

  2. “మృదులాంత్ర నిపుణుడి” ….:)
    భలే ఉందండీ…చాలా బాగుందీ.. అనువాదం..!!

  3. అర్ధ రాత్రి సపోర్టులు. ఆన్‌సైట్ వాడిని అమ్మ నా బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది. కాని ఆఫీసులో నెట్ ఇంకా కాఫీ ఫ్రీ అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది.

    — super

  4. ఆన్‌సైట్ వాడిని అమ్మ నా బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది

    ఆన్‌సైట్ లో వుంటే Client గాడిని అమ్మ నా బూతులు
    తిట్తాలనిపిస్తుంది. కాని ఇక్కడ పారిపొయే option వుండదు

  5. అసలు సంగతి చెబుతున్నా ఎవరికీ చెప్పకండి. అలా ఆఫీసులో ఉచితంగా కాఫీ ఇస్తూ డ్రగ్స్ కలుపుతారు 🙂 వాటికి అలవాటు అయిపోతే ఇక కంపెనీ వదిలే సీనే లేదు. నేను వచ్చిన కొత్తలో అలానే తాగా. గత అయిదారేళ్ళుగా ఇంటి నుండే కాఫీ తెచ్చుకుని తాగుతున్నా. ప్చ్.. అప్పుడు తాగిన దాని ఎఫెక్టు ఇంకా పోలా.. 🙂

    — విహారి

  6. Excellent .. Enjoyed reading this 🙂

  7. జ్యోతి గారూ, వాస్తవ స్ఠితిని చాలా హాస్య చతురతతో వ్యక్తపరిచారు. మీకు మీరే సాటి!

    – నల్లమోతు శ్రీధర్

  8. తీరా చూస్తే నీ జీతంలో ఇంకో సెనక్కాయ పెంచాం పో అంటారు, కాదు కాదు ఇలానె చెసారు నాకు మా కంపెని వాల్లు 😦

  9. balegundi jyothigaru
    🙂
    espపక్క టీమ్‌లో మేనేజర్ మంచోడు అయుంటాడు.
    పక్క టీమ్‌లో అమ్మాయిలు బావుంటారు.
    పక్క టీమ్ లో జీతాలు తొందరగా పెంచుతారు.
    పక్క టీమ్ లో పని అస్సలే ఉండదు.
    మనకి మాత్రం రోజూ పండగ

    so true

  10. అమ్మో ఎంత చక్కగా పట్టేశావ్ అక్కాయ్!

    ఇంతకీ ఇలా మీ అబ్బాయిని భయపెట్టడం ఏం బాగాలేదు. (కొంపదీసి ఇది మీ అబ్బాయి రాయలేదు గదా?)
    –ప్రసాద్
    http://blog.charasala.com

  11. ammo jyothigaru super cant say in words

  12. “మన రెజ్యూం అప్‌డేట్ చేయాలి అని గత ఆరు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మళ్ళీ ఒక సారి స్మరించుకుని అలా ఇచ్చిన సెనక్కాయల మీద బ్రతికేస్తుంటాము.” 😀

    చూసినట్టే రాశారు. 100% కరెక్ట్!

    అదేంటో మరి… దాదాపు అందరి జీవితాలూ ఇలాగే ఏదో ప్రోగ్రామ్ ఎక్సెక్యూట్ చేసినట్టు ఒకేలా ఉంటాయి. ఎవర్ని కదిపిన అదే నిర్లిప్తత… ‘ఎంట్రా ఈ ప్లాస్టిక్ జీవితాలు’ అనుకుంటూ…

వ్యాఖ్యానించండి