నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

నా అభిప్రాయం

అనిల్ చెప్పిన విషయాలు చదివినప్పుడు నాలో రేగిన ఆలోచనలు ఇవి. అనిల్ చెప్పినవన్ని సరియైనవే.కాదనను. అరుంధతీ రాయ్ చేసేదంతా తన ప్రచారం కోసమే.ఇలా ఎదో ఒక విషయంపై ఆందోళన చేస్తే జనం వాళ్ళను గుర్తుపెట్టుకుంటారు, బండబూతులు తిట్టినా సరె వాళ్ళకు అదేమి పట్టదు. ఐనా వాళ్ళు చేసేది సరియైనదా కాదా అనే ఇంగితం ఉంటె కదా.నిందితుల కుటుంబీకులంటె ప్రాణబిక్ష కోరడం సమంజసమే వారి పిల్లల కోసం. కాని అసలు నేరస్తులు వీరు కాదు. వీరికి డబ్బులిచ్చి చేయించేవాళ్ళు పెద్ద ఖూనీకోర్లు. వీళ్ళు ఆటబొమ్మలు మాత్రమే. ఉరిశిక్ష వేస్తే ప్రాణం హాయిగా ఒకేసారి పోతుంది.అది సరిపోదు ఇలాంటి నేరస్తులకి. వాళ్ళు చేసిన పని వల్ల చనిపోయినవారి కుటుంబీకులు ఎలా జీవితాంతం బాధపడతారో వాళ్ళు కూడా అలాగె జీవితాంతం తమవారికి, సుఖాలకి దూరమై జైలులో మగ్గి పోవాలి.బయటికి రానివ్వొద్దు.నళిని కూడ గర్భవతి, స్త్రీ అని అప్పుడు మరణశిక్ష వేయలేదేమో.. తన కూతురికి దూరమై కుమిలిపోతుండొచ్చుగా ఇన్నేళ్ళుగా. అలా అని ఉరిశిక్ష వద్దని అనటంలేదు. అది చాల చిన్నది హాయిగా ప్రాణం పోతుంది అలా కావొద్దు అని. అరుంధతి లాంటి వారు మద్దతు ఇచ్చి అరిచి గోల పెట్టినంత మాత్రాన ఏమి మునిగిపోదు. మనం దానికి ప్రాధాన్యం ఇస్తె వాళ్ళకి ఇంకా ప్రచారం చేసినట్టే. అందుకే గమ్మున ఊరకుంటె మేలు.నేను వాళ్ళని సమర్ధించడంలేదు.అనవసరంగ వాళ్ళని తిడుతు విమర్శిస్తూ మనమే ప్రచారం చేస్తున్నాం.వాళ్ళకి కావల్సింది అదే. అయినా నా దృష్టిలో అఫ్జల్, పాకిస్తాన్ కంటె మన రాజకీయవేత్తలే పెద్ద ఖూనీకోర్లు, సిగ్గులేని వారు అనిపిస్తుంది. మన టాపిక్ వేరే దారి వెళ్తుందని నాకు తెలుసు.అఫ్జల్ తన పైవారికోసమో డబ్బులకోసమో ఈ పని చెసాడు. కాని మన నాయకులు జనం కాళ్ళు మొక్కి, నోట్లు గుమ్మరించి, సారా పోసి గెలిచి తరవాత వాళ్ళ మొహం కూడా చూడరు. ఒక వైపు జనం చికన్ గన్యాతో చస్తుంటే అసలు పట్టించుకున్నారా? రోశయ్య ఐతె ఒక ఆడ మనిషి బండ బూతులు తిట్టింది అందరిముందు దులిపేసుకుని వెళ్ళిపోయాడు.ఇప్పుడు కూడ డెంగ్యూ ప్రమాదం పొంచి ఉన్నా అసలు ఎమి పట్టనట్టు ఉన్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళలో వాళ్ళే తిట్టుకుంటారు జనాలు నవ్వుతారన్న తెలివి కూడ లేకుండా. మనకు కావల్సింది మందులు, నీళ్ళు, రేషణా లేక తెలంగాణాన .మనం వేసిన ఓట్లతో గెలిచి మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బులతో మన అవసరాలు తీర్చని నాయకుల కంటె పెద్ద నేరస్తులు పుండాకోర్లు ఎవరు???

Comments on: "నా అభిప్రాయం" (3)

  1. తివిరి ఇసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁ
    దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁ
    దిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చుఁ
    జేరి రాజకీయుల మనసు రంజింపరాదు

  2. ఈ రోజు టీవీ 9 బాగా గడ్డి పెట్టాడు. మన అరుంధతి గారికి ఇలాంటి విఛ్చన్నకర శక్తులమీద తెగ ప్రేమ. ఈవిడ హిందూయిజం మీద కూడా చాలా అవాకులు రాసింది ముందర.

    ప్రముఖ పాత్రికేయులు అన్నట్లు, ఇక్కడ ఉరి తీయాలా వద్దా అనేది ముఖ్యం కాదు. ఎవరిని ఎప్పుడు సమర్ధించాలి, ఎప్పుడు కూడదు, అనే విచక్షన మన దేశంలో ఎందుకు నశిస్తోంది…ఇలా అయితే ఎవరైనా ఈ దేశంలో ఎందుకు ఉండాలి? మన భారతీయులు ఇక్కడ కంటే అమెరికాలోనే హక్కులు కాపాడుకుంటున్నారు…

  3. నిన్ను పూర్తిగా వ్యతిరేకించే అభిప్రాయాన్ని గూడా నీవు గౌవరిస్తేనే ప్రజాస్వామ్యం.
    సమయానికి గుర్తు రావటం లేదు ఆంగ్లంలో ఒకరన్న వాఖ్య. ఇంచుమించుగా దానర్థమేమంటే “తన అభిప్రాయం నాకు వ్యతిరేకమయిందే కావచ్చు కానీ దాన్ని వ్యక్తీకరించే అతని హక్కుకై నేను ప్రాణాన్నైనా ఇస్తాను” అని.
    అరుందతీ రాయ్ కళ్ళతో, హృదయంతో మనం ఆలోచిస్తే మనకూ అది తప్పని తోచవచ్చేమొ! ఎవ్వరి అభిప్రాయం ఎలాంటిదైనా దాన్ని మనం గౌరవించాలి.
    –ప్రసాద్
    http://charasala.com/blog/

వ్యాఖ్యానించండి