నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

సరూప ముచ్చట్లు

అన్నలకు , తమ్ముళ్ళకు , అక్కలకు , చెల్లెళ్ళకు నమస్తే చెప్తున్న. నేను ఎవరా అనుకుంటున్నరా. సరూప . జ్యోతక్క దోస్తుని. మేము పాత దోస్తులము. ఓసారి ఆళ్ళింటికెళ్తే  బ్లాగులగురించి చెప్పింది. నేను కూడా పేపర్ల సదూతూనే ఉన్నా. అప్పుడప్పుడు నా ముచ్చట్లు చెప్త నీ బ్లాగుల రాయమంటే సరేనంది. ముందుగల్ల నా గురించి జరంత చెప్పాలె. మేముండేది పాత బస్తీ షాలిబండల. సొంతిల్లు ఉంది. ఒక బిడ్డ. కొడుకు. నాది మీ అంత పాలీషు బాస రాదు . తెలంగాణా, ఉర్దూ కలిపి మాట్లాడ్డం . పరేషాన్ కాకుండ్రి.

 

ఇప్పుడు అంతటా గణేశ్ సంబరాలు నడుస్తున్నయ్ కదా. చూసిండ్రా ఎన్నెన్ని విగ్రహాలు పెట్టిండ్రో. నిన్న మేము ఏం జేసినమో తెల్సా. ఒక క్యాన్ నిండా పులిహార చేసి పెట్టుకుని కొన్ని గర్జెలు,మురుకులు , నీళ్ళు పెట్టుకుని నేను, మా ఆయన, పిల్లలు ఇగ సిటీల ఉన్న గణేశులను సూద్దమని బయలుదేరినము నాలుగు గంటలకు ఇంట్లకేలి ఎలితే రాత్రి పదకొండయ్యింది. తంగ్  అయిపోయినం అనుకోండి. కాని మస్తుగుండే . టీవీల చూసెకన్నా నిజంగా వెళ్లి చూస్తే ఆమజానే వేరు కదా. మీకు తెల్వదా.

 

ఇగ మా బాడల (అదే పదిఇరవై ఇండ్లు కలిప్తే బాడ అంటరు) అందరము కలిసి మంచిగ ఉంటము. తెలుగోల్లు, తురకోళ్ళు,కిరస్తానోళ్ళు అందరూ ఉంటరు. మా పండగలొస్తే  మేము చేసుకున్నవి వాళ్ళకు పంపిస్తాం. వాళ్ళ పండగలొస్తే వాళ్ళు మాకు పంపిస్తరు. పండగలన్నింటికి మంచిగ ఒకరినొరకు కలుసుకుంటము, మిఠాయిలు పంచుకుంటము. ఏ గడ్‍బడ్ ఉండదు.

 

ఇగ ఓ ముచ్చట జెప్పాలెనా. అందరు మోగోళ్ళు ఆఫీసులకు, దుకాణాలకు పోయినంక మా ఆడాళ్ళంతా జల్దీ జల్దీ ఇంట్ల పనంతా జేసుకుని ఒక దగ్గర కలిసి ముచ్చట్లేస్కుంటము. ఇగ మా ముచ్చట్లు ఎట్లుంటవంటే పాతబస్తీ నుండి పాకిస్తాన్ వరకు, దునియా అంతా తిరిగొస్తాం. టీవీ సీరియల్లు, సినిమా ముచ్చట్లు, ఇగ మాకు మాట్లాడుకోనికి లేని సంగతి ఉండదనుకోండి. అప్పుడప్పుడు వచ్చి ఒక్కో ముచ్చట చెప్తా మల్ల. ఇనుకోండి.

 

ఇప్పటికైతే ఈ మస్తు మస్తు పాట ఇనుకోండు. మీరు ఇస్మైల్ చేయకుంటే చార్మినార్ మీద ఒట్టు. మా పోరగాళ్ళైతే పడి పడీ నవ్విండ్రు.

 

ప్రేమ పాగల్‍గాడు పాడితే ఇట్లనే ఉంటదిమరి.

…..

పాట

Comments on: "సరూప ముచ్చట్లు" (9)

  1. అదిరింది! టపాను చదువుతున్నంత సేపూ నాకు వరంగల్, మెదక్, మిరియాలగూడ, కోదాడలలో నేను ఉన్నప్పటి రోజులను గుర్తుకుతెచ్చారు! పాటను ఎక్కడ నుండి పట్టుకొచ్చారు, అది విన్న తరువాత పెళ్లైన కొత్తలో పాటలు వింటుంటే ఏదోలాగా ఉన్నాయి 🙂

  2. నీకు నూరేళ్ల ఆయుశ్శు జ్యోతక్క… ఎందుకంటే… ఇదే పాటను ఈ రోజే అప్‌లోడ్ చేసి బ్లాగ్‌లో పెడదామనుకున్నాను… ఈ లోపు నువ్వే పెట్టేశావ్… చాలా సంతోషం…. (ఇక్కడ నేను స్పెషల్‌గా చెప్పొచ్చే విషయం ఏంటంటే… ఈ పాటను రాసిందీ, పాడిందీ, మా ఊరి (కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల ) అబ్బాయి ‘జడల రమేష్ ‘ !)… ఇవే కాదు..ఇలాంటివి చాలా ఆడియో క్యాసెట్లు (కామెడీ,పేరడీ) నా దగ్గర మస్తుగున్నాయి…

  3. జ్యోతి,
    బావుంది టపా.
    సరదాగా మాట్లాడుతూనే మీ దోస్తు భలే మంచి విషయాలు చెప్పింది కదా. మీతో చేరి కాసేపు ముచ్చట్లు చెప్పుకోవాలని అనిపిస్తోంది.
    పాట మస్తుంది:-)

  4. యాస బాగుంది…
    ప్రదీపు గారన్నట్టు వరంగల్ లో ఉన్న రోజులు గుర్తుకొచ్చాయి.

  5. చాలా వెరైటీగా వుందండి తెలంగాణ యాస. ఇదే మొదటి సారి తెలంగాణ యాస చదవడం. రాసినందుకు చాలా థాంక్స్:)

  6. గిది సద్వి మస్తు దిల్కుసయ్యింది. తెలంగాణ బాసలో టపా ఎయ్యక మస్తుదినాలయ్యింది.. నేనుభీ టపాజేస్తా.. సరూపక్క నమస్తే..షాలిబండంత సల్లగేనా?

  7. బాగుంది, మీ దోస్తును అడిగినట్లు జెప్పుండ్రి.

  8. వింజమూరి విజయకుమార్ said:

    బ్లాగులల్ల యాస యింతమంచిగ్రాసినన్క మాకు రాయనిన్గేముంటది జోతవ్వ?

వ్యాఖ్యానించండి